Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 28

 

    రూపాయి బిళ్ళ అచ్చం రూపాయి బిళ్ళలాగానే వుంటుంది. ఓ సైడిన రూపాయి బిళ్ళ గుర్తువుండి మరో సైడ్ న వాళ్ళ గుర్తు (కోడ్) వుంటుంది. రూపాయి బిళ్ళ చుసిన సర్వర్ అతను బయటవాడో తమ తాలుకా మనిషో గుర్తిస్తాడు. పైకి మాత్రం ఏం కావాలని అడిగి లోపలికి వెళ్ళంగానే సిక్రెట్ కోడ్ తో సిగ్నల్ పంపుతాడు. పంపించు ఇప్పుడు వద్దు. ఏదో ఒక సమాధానం వస్తుంది. పంపించు అంటే తను తీసుకువెళ్ళే పదార్ధంమీద వాళ్ళ కోడ్ గుర్తు చిన్నది అతికించుకుని వెళతాడు. వద్దంటే ఏ గుర్తు లేకుండా తీసుకెళ్ళి కస్టమర్ కి టిఫిన్ అందిస్తాడు. మాట్లాడుకునే పనిలేకుండా సిగ్నల్ అందుతుంది. వచ్చినవాడు అది అందుకుని టిఫిన్ తిని లోపలికో బయటికో నడుస్తాడు.

 

    గౌతమ్ తన దగ్గర రూపాయిని బల్ల మీద వుంచడంతో సర్వర్ కి తమ మనిషేమోనన్న అనుమానం వచ్చింది. రూపాయి బిళ్ళమిధ గుర్తుని చూద్దామా అంటే గుర్తువేపు బిళ్ళ తిప్పిలేదు. సర్వర్ దానినే పరీక్షగా చూడటంతో గౌతఃమ్ గబుక్కున రూపాయి బిళ్ళని తీసుకుని జేబులో వేసుకున్నాడు. అతడు పొరపాటున అటుతిప్పి వుంచాల్సిన రూపాయి బిళ్ళని ఇటు తిప్పడేమో అని సర్వరే పొరబడకుండా ఆ విషయం తెలుసుకోవడానికి వాళ్ళ సిక్రెట్ కోడ్ ని ఉపయోగిస్తూ "హ హిచ్ హూక్" అన్నాడు. అదేకనక వాళ్ళ వాడు అయితే కోడ్ కి దికోడ్ గా వెంటనే అనేవాడు. "మిరియం పొడి మాత్రమే చల్లి ఇంకేమి చేర్చకుండా చేసినా పెసరట్ ఇక్కడ దొరుకుందా?" అని.

 

    ఇంద్రభవన్ సిక్రెట్ తెలియని గౌతంకి కోడ్ ఎలా తెలుస్తుంది? అది తెలియనప్పుడు కోడ్ ని దికోడ్ ఎలా చేయగలుగుతాడు?

 

    పచ్చ కాగితంమిద బిల్లు వేయటం మూడో కోడ్. మొదటి దానికే గతిలేదు. ఇంక మూడోదానికి రెస్పాన్స్ ఏముంటుంది.


    
    వరదరాజులు గురించి అడిగితే చివాట్లు తగురీతిలో తినాల్సి వస్తుందేమో అనుకుని కాఫీ తాగి బిల్లు చెల్లించి బయటికి నడిచాడు గౌతమ్.

 

    వరదరాజులు గురించి అడిగినట్లయితే అతడు చాలా పెద్ద చిక్కులో పడేవాడు. వరదరాజులు గురించి హోటల్లో ఎవరిని అడగనందువల్ల అతడికి ప్రస్తుతం గండం గడిచింది. హి ఈజ్ లక్కి పర్సన్.

 

    గౌతమ్ అటు వెళ్ళంగానే

 

    సర్వర్ కౌంటర్ ముందుకొచ్చి గౌతం ఇచ్చివెళ్ళిన రూపాయి బిళ్ళను తీసుకుని అటూ ఇటూ తిప్పిచుశాడు.

 

    అతడు ఇచ్చింది గవర్నమెంటు వాళ్ళు తయారుచేసిన రూపాయిబిళ్ళ.

 

    "నేనే పొరబడ్డాను" సర్వర్ అనుకున్నాడు.

 

                                                    10
    
    క్లక్..... క్లక్ .....

 

    గోడ దగ్గర నుంచున్న చక్రపాణికి ఏం జరిగిందో అర్డంమయ్యేసరికి తల తిరిగిపోయింది.

 

    గోడలోంచి పుట్టుకువచ్చిందా అన్నట్లు రెండు గొలుసులు మెరుపువేగంతో వచ్చి చక్రపాణి కదలటానికి వీలులేకుండా చుట్టుకుపోయాయి. గోడకి అతుక్కుపోయి బందీ అయాడు.

 

    తను బందీ అయిపోయాడు.

 

    తను ఎక్కడ పొరపాటు చేశాడు.

 

    ఎక్కడ?

 

    అదేం పొరపాటు.

 

    ఇన్నాళ్ళ తన సాదన శ్రమ వృధాయేనా?

 

    బందీ ఆయింతరువాత ఏం జరుగుతున్నది తనామాత్రం ఉహించగలడు., ఏదయితే జరగాకుదదనుకున్నాడో అదే జరిగింది. ఈ ఒక్కరోజు ఆగినట్లయితే తను తన వాళ్ళకి వార్తని చేరవేసేవాడు. ఇరవై నాలుగు గంటల ముందు.....

 

    చప్పట్లు వినపడటంతో తల పక్కకి తిప్పి చూశాడు చక్రపాణి.

 

    గుర్రం ముఖం మాస్క్ ధరించిన వ్యక్తీ పక్క గదిలోంచి వస్తూ అభినందిస్తున్నట్లు చప్పట్లు చరుస్తూ వచ్చి చక్రపాణి ఎదుటకి వచ్చి ఆగాడు.

 

    తను వాళ్ళకి బందీ అయినట్లా కానాట్లా? అదో వింత లోకం. ప్రతి చిన్న విషయం వింతగా విచిత్రంగా జరుగుతున్నది. బందీ కావటం కూడా దానిలో భాగం కావచ్చు, "నాకు సంకెళ్ళు, గొలుసులు వేశారేమిటి?" తనంతట తానుగా బయటపడినట్లు అవుతుంది. మౌనం ఉత్తమం.   

 Previous Page Next Page