Previous Page Next Page 
మోహిత పేజి 29


    కారు డోర్  తెరుచుకుని, రాజేంద్రకుమార్ దిగాడు. అతనికోసమే ఎదురు చేస్తున్న జస్టిస్ ఆదిత్య గంభీరంగా ఎదురొచ్చి, గెస్ట్ రూమ్ లోకి తీసుకు వెళ్ళాడు.

 

    "జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని వరుసగా అబ్జర్వ్ చేస్తున్నాను. వాటీజ్ దిస్.... జయంత్ మర్డర్ మిస్టరీగా వుంది. మోహిత ఇంత పర్ ఫెక్ట్ ప్లానర్ అని నేననుకోలేదు" సోఫాలో కూర్చుంటూ అన్నాడు ఆదిత్య.

 

    "కొన్ని నెలల క్రితంవరకూ ఆ మోహిత నిస్సహాయురాలు. కానీ ప్రస్తుతం ఆమెతో ఒక యువకుడు తిరుగుతున్నాడు......" చెప్పాడు రాజేంద్రకుమార్.

 

    "అతని సహాయంతో మోహిత, ఈ మర్డర్స్ ని ప్లాన్ చేస్తోందా?" అడిగాడు ఆదిత్య.

 

    "అనే నా అనుమానం....."

 

    "బట్..... వెరీ ఇంటెలిజెంట్ మర్డర్స్....."

 

    "అందుకే మిమ్మల్ని హెచ్చరించడానికే స్వయంగా వచ్చాను. జయంత్ కి ఫోన్ చేసి, జాగ్రత్తగా వుండమని మరీ, మరీ చెప్పాను. విన్నాడు కాదు. మన  ప్రాణాలు చాలా విలువైనవి...... వాటిని రక్షించుకోవాలి...... నా విషయంలో  కూడా మీ సలహా కావాలి......" అన్నాడు రాజేంద్రకుమార్.

 

    "నా విషయంలో నాకేం ఇబ్బంది లేదు...... పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుంటాను. అవసరమైతే సెలవుపెట్టి ఓ రెణ్నెళ్ళపాటు ఏ కాశ్మీరో వెళ్ళిపోతాను......ధీమాగా అన్నాడు ఆదిత్య.

 

    "ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?" భయంగా అడిగాడు రాజేంద్రకుమార్.

 

    "మనం మోహితను అనవసరంగా అనుమానిస్తున్నామేమో. ఎవరి శత్రువుల వల్ల వాళ్ళు చనిపోయారేమో......" సందేహంగా అన్నాడు ఆదిత్య.

 

    "నో...... ఆదిత్యాజీ.... వరుసగా, మన్ గ్రూప్ వాళ్ళే మర్డర్  అవుతున్నప్పుడు...... అందుకు కారణం మోహిత మాత్రమే అవుతుంది" నిర్ధారణగా చెప్పాడు రాజేంద్రకుమార్.

 

    "మర్డర్స్  వరకూ ఎందుకు వెళ్ళనిచ్చావు? ఎక్కడుందో పట్టుకో. డబ్బెంత కావాలో తీసుకోమను" అన్నాడాయన.

 

    "పరిస్థితి మనచెయ్యి దాటిపోయింది ఆదిత్యాజీ! డబ్బుకి లొంగదు. ఎదురుపడితే చూద్దాం. మన జాగ్రత్తలో మనం వుండాలి" అన్నాడు రాజేంద్రకుమార్.

 

    "మోహితను మనం ట్రేస్ చెయ్యలేమా.....?" సాలోచనగా అన్నాడాయన.

 

    "ఎలా.....?"

 

    "ఆ ముగ్గురి తర్వాత, ఆ మోహిత దృష్టి మీమీద  కానీ, నామీద కానీ వుంటుంది..... అవునా?"

 

    "ఎస్.....!"

 

    "అంటే ఆవిడ గుంటూరు రావాలి. లేదా మైసూర్ వెళ్ళాలి."

 

    "అవును."

 

    "రైల్వే స్టేషన్, బస్టాండుల్లో మనవాళ్ళను కాపలా పెడితే?"

 

    "ఎలా గుర్తుపడతారు?"

 

    "ఫోటోలిస్తాం......"

 

    "ఎక్కడ దొరుకుతాయి ఫోటోలు? అయినా మోఅహిత ప్రస్తుతం నా పెరుమీడున్న కారులో తిరుగుతోంది."

 

    "అయితే మరీ మంచిది.... ఆ కారు నెంబరెంత......?"

 

    "కారు నెంబర్ ఎలాట్ అయింది కానీ, మోహిత ఆ నెంబరు ఇంబ్కా తీసుకోలేదు.

 

    "ఆ కారు కలర్......"

 

    "బ్లూ....."

 

    "మైసూర్. గుంటూరు పోలీసులకు, చెక్ పోస్టు ఆఫీసర్లకు నెంబర్ లెస్  బ్లూ కలర్ మారుతీ  కార్లను చెక్  చెయ్యమని ఇన్ ఫామ్ చేస్తే......" ఆదిత్య  ఐడియాతో, రాజేంద్రకుమార్ ముఖం వికసించింది.

 

    " వెంటనే ఆ పని చెయ్యండి ఆదిత్యాజీ...... మిగతాపని నేను చూసుకుంటాను" కసిగా  అన్నాడు రాజేంద్రకుమార్.

 

    వెంటనే సెల్ ఫోన్ అందుకున్నాడు జస్టిస్ ఆదిత్య.

 

    గుంటూరు, మైసూర్ ఎస్పీలకు, కలెక్టర్లకు ఫోన్ చేసి పావుగంటసేపు మాట్లాడి, సెల్ పోన్ ఆఫ్ చేసి......

 

    "వాళ్ళిద్దరి పని అయిపోయింది...... ఇరవైనాలుగు గంటల్లో వాళ్ళిద్దరూ దొరికిపోతారు. కలెక్టర్లు చెక్ పోస్టు ఆఫీసర్లకు ఇప్పుడే ఇన్ ఫాం చేస్తున్నారు....." చెప్పాడాయన.

 

    "నేనోపని చేస్తాను....." అన్నాడు రాజేంద్రకుమార్.

 

    "ఏమిటది?"

 

    "గుంటూరు, మైసూర్లలో ఇంపార్టెంట్ హోటల్స్ లో వెతకమని నా మనుషుల్ని పంపుతాను. ఆ సెల్ ఫోన్  ఇలా ఇవ్వండి....." అంటూ సెల్ అందుకుని, అర్జంటుగా అయిదుగురు వ్యక్తుల్ని గుంటూరు రమ్మని, ఇంకో అయిదుగురు వ్యక్తులు మైసూర్ లో  హోటల్స్ అన్నీ  వెతకమని చెప్పాడు.

 

    "ఓన్లీ ట్వంటీఫోర్ అవర్స్ లో వాళ్ళను పట్టుకోవాలి....... ఎంత ఖర్చయినా ఫర్వాలేదు....." ఎవరితోనో చెప్పి, పోన్ పెట్టేశాడతను.

 

    జిల్లాల ఎస్.పీ.లు. స్వయంగా  ఇన్ ఫార్మ్ చెయ్యడంతో, అన్ని పోలీసు స్టేషన్లకు చెందిన సి.ఐ.లు, ఎస్.ఐ.లు రంగంలోకి దూకారు. ఇంపార్టెంట్ రూట్స్ లోను, పోలీస్ ఐలాండ్స్ దగ్గర, ట్వంటీ ఫోర్ అవర్స్  పోలీసు గస్త్రీ ఏర్పాటైంది.

 

    అలాగే చెక్ పోస్టుల దగ్గర గస్తీ ఏర్పాటైంది.

 

    "ఈ  రెండురోజులూ మీరీ గెస్ట్ హౌస్ లో వుండండి" అన్నాడు ఆదిత్య. తలూపాడు రాజేంద్రకుమార్.

 

    పోలీసులు రోడ్డుమీద నిఘాకు తయారుకావడానికి సరిగ్గా  నలభై నిముషాలు ముందే మోహిత కారు గుంటూరులోకి ప్రవేశించింది.

 

    
                                        *    *    *

 

    "మా బావని అరెస్ట్ చేయించడానికి పోలీసులకు మీరు అతని పేరు, వివరాలు ఇవ్వడం నాకేం నచ్చలేదు" డైలీపేపర్ని కోపంగా విసిరేస్తూ అంది ఇందు.

 

    "నిన్ను నానుంచి దూరం చేసేవాడెవడైనా నాకు శత్రువే..... వాడు బయట వుంటే, నువ్వు వాడితో వెళ్ళిపోతావు..... అందుకే వాడ్ని  ఎంత త్వరగా వీలయితే, అంతత్వరగా జైలుకి పంపిస్తే.... నాకు హాయి...." విస్కీ బాటిల్ని ఓపెన్ చేస్తూ అన్నాడు చంద్రప్ప.

 

    "మా బావ జైలుకి వెళితే, నేనీ ఇంట్లోంచి బయటికెళ్ళిపోతాను....." అంది సీరియస్ గా ఇందు.

 

    "ఎక్కడికెళతావ్...... వెళ్ళినా, నానుంచి తప్పించుకోలేవ్..... నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను..... నిజం......సరేనా?" అన్నాడతను.

 

    "నిన్నా..... నేనా.... చచ్చినా చేసుకోను...... దానికంటే విషం తీసుకుని చచ్చిపోతాను. నీకెప్పుడో చెప్పాను.....మా బావను ఒకసారి చూడడం కోసమే నేను బ్రతికున్నానని."

 

    "మీ బావను చూశావుగా...... మాట్లాడావుగా.... చచ్చిపో..... వెంటనే చచ్చిపో...... పాయిజన్ కొనితెస్తాను...... అయినా నీమీద నా కోరిక తీరేవరకూ నువ్వు నా గుపిట్లో వుంటావు."

 

    "ఇప్పుడే నేను వెళ్లిపోతాను. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లయింట్ చేస్తాను. నువ్వు నన్నేం చేయలేవు. అర్థమైందా.......?" అసహ్యంగా అతన్ని చూస్తూ అంది ఇందు.

 

    "వెళ్ళిపోతావా.... ఎలా వెళతావు.....?" అంటూ గబగబా లోనికెళ్ళి కొబ్బరి తాడుని తెచ్చి, ఇందు చేతుని పట్టుకుని లాక్కుని, బెడ్ రూంలోకి తీసుకెళ్ళి రాక్షసుడిళా ఆమెను ఆ బెడ్ మీద తోసేసి, తాడుతో కాళ్ళూ, చేతుల్నీ మంచానికి కట్టేసి, కాలుతున్న సిగరెట్ ని తీసి ఆమె బుగ్గమీద కసిదీరా వాతలు పెట్టాడు చంద్రప్ప.

 

    బాధతో విలవిల్లాడుతోంది ఇందు.

 

    పోలీసుబెల్టుతో రక్తం వచ్చేవరకూ కొట్టాడు.

 

    ఇందుకు స్పృహ తప్పిపోయింది.

 

    "మరోసారి బయటకు వెళ్ళిపోతానంటే..... వాతలు  పెడతాను......అర్థమైందా...." గట్టిగా అరుస్తూ డ్రాయింగ్ రూమ్ లోకొచ్చాడు చంద్రప్ప.

 

            
                                          *    *    *

 

    రూమ్ నెంబర్ 207.

 

    బాత్ రూమ్  లోంచి స్నానం చేసొచ్చి, పాతడ్రెస్ నే మళ్ళీ వేసుకుంటున్న మైత్రేయవైపు చూసింది మోహిత.

 

    "మైత్రేయా..... మార్కెట్ కి వెళదాం పద" వెంటనే హేండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరింది.

 

    "దేనికి.....? డోర్ లాక్ చేస్తూ అడిగాడు మైత్రేయ.

 

    "చెప్తాను..... పద" ఇద్దరూ రిసెప్షన్ దగ్గరికొచ్చారు. కారు పార్కింగ్ వేపు వెళుతున్న మైత్రేయని వారించింది మోహిత.

 

    "నడిచి వెళదాం..... టైం పాసవుతుంది" ఇద్దరూ  నడుచుకుంటూ అరండల్ పేట వెళ్ళారు.

 

    మైత్రేయ కోసం రెడీమేడ్ ఫాంటూ- షర్టూ, కుర్తా- పైజమా తీసుకుంది. తనకోసమ రెండు కోయంబట్టూరు కాటన్ చీరలు తీసుకుంది. లాగే రెండు టవల్స్ తీసుకుంది.

 

    అరండల్ పేట్  బ్రిడ్జి మీదుగా నడుస్తున్నారిద్దరూ.

 

    "ఏమంటుంది..... మీ ఇందు.....? ఆ విషయాలు చెప్పలేదే.....?" అడిగిందామె.

 

    ఆమె పరిస్థితి  చెప్పాడు మైత్రేయ.

 

    "నావల్లే ఇందు నీకు దూరమైంది కదూ.....?" సానుభూతిగా అంది మోహిత.

 

    మాట్లాడలేదు మైత్రేయ.

 

    "నన్ను దూరం చేసుకుని ఆమెకు దగ్గరైతే అన్ని విధాలుగా నీకు క్షేమం మైత్రేయ...." తనలో తాను అనుకున్నట్లుగా అంది మోహిత.

 

    "ఆమెను తీసుకువచ్చేయల్సింది" మళ్ళీ అందామె. దేనికీ జవాబు చెప్పలేదు మైత్రేయ.

 

    ఇద్దరూ పోలీస్ ఐలాండ్ దగ్గరకొచ్చాడు. రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో మోహిత దృష్టి చరోడ్  కార్నర్ లో నించున్న పోలీస్ ఆఫీసర్లమీద, వరసగా వాళ్ళు చెక్ చేస్తున్న మారుతీ కార్లమీద పడింది.

 

    "మారుతీకార్లను ఎందుకు చెక్ చేస్తున్నారు.....?"

 

    "మరోపని లేకమ్మా........ ఎవరో ఇద్దరు క్రిమినల్స్ తప్పించుకుని మారుతీ కారులో తిరుగుతున్నారట.... ఎస్పీ గారి ఆర్డర్లట......" ముందుకెళ్ళిపోయింది కారు.

 

    మోహిత సాలోచనగా మైత్రేయవేపు చూసింది. త్వరగా నడుచుకుంటూ ఇద్దరూ హోటల్ రూంకొచ్చారు.

 

    "జస్టిస్ ఆదిత్య ముందుగా జాగ్రత్త పడుతున్నాడనుకుంటాను..... "కుర్చీలో కూర్చుంటూ అంది మోహిత.

 

    "నీ ఊహ కరెక్టే ..... జయంత్ మర్డర్  న్యూస్ పేపర్ లో చూడగానే ఇద్దరూ ఎలర్టయి వుంటారు. మనకోసం  పోలీసుల్తోపాటు, రాజేంద్రకుమార్ మనుషులు కూడా ఒక కన్నేసి వుంచుతారనుకుంటాను....." అందామె.

 

    "ఇప్పుడేం చెయ్యాలి?" అడిగాడతను.

 

    ఆమె మెదడులో రకరకాల ఐడియాలు..... తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు.

 Previous Page Next Page