Previous Page Next Page 
యోధుడు పేజి 27

    అర్చనను నమ్మించి మోసం చేయడం అన్యాయం. మీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారనే విషయం అందరకీ తెలుసు. ఈ విషయాల్లో అర్చన ఎవరో తెలీదని మీరనడం అన్యాయం."

    "మీరు నాకు సంభందిమ్చని విషయాలు మాట్లాడుతున్నారు" చికాకును అణుచుకుంటు అన్నాడు కాశీచరణ్.

    "ఇప్పుడన్నీ సంబందించిని విషయాల్లాగే వుంటాయి. అర్చనకు మీరు రాసిన ఉత్తరాలు వున్నాయి. మీరిద్దరూ కలసి తిరిగినప్పుడు చూసిన సాక్షులున్నారు. నాకేమీ మీరంటే, అర్చన వూరుకున్నా నేనూరుకొను" బెదిరిస్తున్నట్ట్లుగా అన్నాడు అంకుష్.

    ఇద్దరి మధ్యా నిశ్చబ్దం నెలకొంది. అంతకుముందే అయిదు నిమిషాల క్రితం అక్కడకొచ్చిన డాక్టర్ మధురిమ అ సంబాషణంతా వింది.

    అకస్మాత్తుగా లోనికొచ్చిన ఆమె వైపు నిస్సహాయంగా చూశాడు కాశీచరణ్   
`
    "ఈ పరిష్టితుల్లో కాశీచరణ్ ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికావడాన్నీ డాక్టర్ గా తను సహించలేదు. అందుకే వెంటనే రియాక్ట్ అయింది. "ఎవరు... మీరు... ఏమిటిది... పర్మిషన్ లేకుండా లోనికేలా వచ్చారు?" అడిగిందామె కోపంగా.

    "కాశీచరణ్ కు బాగా కావాల్సిన వ్యక్తిని. ఆయనను చూడటానికి బెంగుళూరు నుంచి వచ్చాను" చెప్పాడు అంకుష్.

    "చూశారుగా వెళ్ళండి. ఈ సారేప్పుడూ నా పర్మిషన్ లేకుండా అయనతో మాట్లాడకండి."

    "అదికాదు మేడమ్_" అంటూ ఏదో చెప్పాబోయాడు అంకుష్.

    "అయన గతాన్ని మర్చిపోయిన ఏమ్నేషియా పేషెంట్. గతం గురించి ఆయనతో మీరు వాదించడంలో అర్ధంలేదు. అండర్ స్టాండ్!"  బయటకేళ్ళాగానే అంది మధురిమ_ తన అసహనాన్ని తెలియబరుస్తూ.

    "కాశీచరణ్ మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడు అవుతాడు?" అని అడిగాడు అతను.

    "కొన్ని రోజులు పట్టొచ్చు... కొన్ని నెలలు పట్టొచ్చు... కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు చెప్పలేం" అందామె సీరియస్ గా.

    "మళ్ళీ నేల రోజుల తర్వాత వస్తాను. ఈసారి మీతోనే డిస్కస్ చేస్తాను" అని ముందుకు వెళ్ళబోతున్న అంకుష్ వైపు చూసి కాశీచరణ్ రూమ్ లోకి వెళ్ళాలనే తన నిర్ణయాన్ని మార్చేసుకుని తన ఛాంబర్ లోకి వెళ్ళిపోయిందామె.

    కాశీచరణ్ అర్చనను ప్రేమించాడేమో? అన్న ఆలోచన మధురిమ మదిలో మెదలడంతో కొయ్యబొమ్మలా కదలకపోయిందామె.

    కాశీచరణ్ అర్చనను ప్రేమిస్తే దానికి తనెందుకిలా బాధపడుతోంది.

    ఎందుకు?

    అతన్ని తను ప్రేమిస్తోందా?

    ఆ ప్రశ్న వేసిన తన మనస్సుకు సూటిగా బడులిచ్చుకోలేకపోయింది మధురిమ.
   
                          *    *    *    *

    ఒకచేత్తో రణదీఫ్ కేవల్కర్ ఫైలును అందుకుంటూనే ఓరకంటితో అతనివైపు నఖశిఖ పర్యంతం చూశాడు లాయర్ నీలకంఠన్ .

    "కూర్ఛోండి" తన ఎదురుగా వున్న కుర్చీ ని చూపెడుతూ అన్నాడు నీలకంఠన్ .

    సుమారు డెబ్భై ఐదు సంవత్సరాల వయస్సుండవచ్చు ముందు బట్టతలా, వెనుక నెరసిన వెంట్రుకులు, శరీరంలో వృద్దాప్యలక్షణాలు కనిపిస్తున్నా చూపులు, శరీరపు కదలికలు, మాటలు, ఉత్తేజంగానే వున్నాయనిపించింది రణదీఫ్ కి.

    ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఆస్తి  దక్కకపోగా లేనిపోని అనవసరపు చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదముందని లాయర్ నీలకంఠన్  చూస్తూనే గ్రహించాడు రణదీఫ్.

    "చెప్పండి... ఎవరు మీరు... నా దగ్గరకు ఎందుకొచ్చారు?" ఫైల్ తెరవకుండానే ప్రశ్నించాడు లాయర్ నీలకంఠన్  కావాలనే.

    రణదీఫ్ ఒక్కక్షణం విస్తుపోయి వెంటనే తేరుకున్నాడు. "గంట క్రితం మీకు ఫోనుచేశాను. నాపేరురణదీఫ్ కేవల్కర్ " అన్నాడు రణదీఫ్ నెమ్మదిగా.

    ఏదో గుర్తుకోచ్చినట్ట్లుగా తల పకించి "చెప్పండి" అన్నాడు నీలకంఠన్ 

    "ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన ప్రకటన చూడగానే చాలా ధ్రిల్లయ్యాను. ఆ ప్రకటన చూడగానే మ అమ్మా, నాన్న గుర్తుకొచ్చారు.

    నాచిన్నప్పుడు మా అమ్మ సుశీల తరచూ చెబుతుండేది. మనమేప్పుడైనా హైదరాబాద్ వెళ్ళిపోతామని. అక్కడ అమ్మమ్మ,  తాతయ్య వున్నారని, కొన్ని నెలల క్రితం_ అమ్మ, నాన్న చనిపోయాక అమ్మమ్మను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చాను. అక్కడ ఎవర్నని అడగను? ఏమని అడగను?" తూచి తూచి మాట్లాడుతున్నావు?" అడిగాడు తడుముకోకుండా.

    "తర్వాత?"

    "హైస్కూలు వరకు అక్కడే చదువుకున్నాను. తరువాత మైసూర్ లో డిగ్రీ పూర్తీచేశాను. ఆ సమయంలో అమ్మ, నాన్న చనిపోయారు.

    యాడ్ ఏజెన్సీలో జాబ్ వస్తే డిల్లీలో సేటలయ్యాను."

    "డీల్లిల్లో ఎన్నాళ్ళనుంచి ఉద్యోగం చేస్తున్నావు?" అడిగాడు నీలకంఠన్ .

 Previous Page Next Page