Previous Page Next Page 
కాలనాగు పేజి 27

    ఎక్కడైనా అబ్బాయిలు వచ్చి గర్ల్ ప్రెండ్ కోసం వెయిట్ యటం వుంటుంది. ఆడే ప్రేమికుల లక్షణం కూడా?

    కానీ సంధ్య యిప్పుడు ప్రేమికుల స్థాయి  దాటిపోయింది. ఆమె ప్రియురాలి స్తానం నుంచి వధువు స్థానానికి ఎదిగింది. ఎలాగైనా ఎందరిని ఎదిరించి అయినా అడిత్యాని పెళ్ళి చేసుకోవాలి! ఇదీ ఆమె నిర్ణయం

    ఈ ప్రపంచంలో ఎవరికయినా చేయొద్దన్నదే చేయాలని వుంటుంది అందువల్ల మంచే జరగనీ_ చెడు జరగనీ_ అప్పుడు ఫలితం మీద దృష్టి వుండదుగా!

    తల్లి అడ్డు చెబుతోంది.

    మేనత్తకూడా కాదు, కాకూడదు అంటోంది.

    స్పృహా వుండీ వుందని తండ్రికూడా ఊహూ అంటున్నాడు.

    అందరూ కాదనటంతో ఆమెలో పట్టుదల హెచ్చింది.

    నేనూ అందరిలాటి ఆడదాన్నే! నాలోనూరక్త మాంసాలున్నాయి నాలోనూ వేడిగా రక్తం ప్రవహిస్తోంది' నాకూ కోరికలున్నాయి.

    నేనెందుకు వాటిని చంపుకుని, పెళ్ళి మానుకోవాలి?

    ఊహూ! తను ఎదురు తిరుగుతుంది. తప్పదు.

    "హలో! సంద్యా!"

    ఆ పిలుపుకి ఉలికిపడింది సంధ్య.

    ఎదురుగా నాగరాజు.

    ఆమె ముఖం ఆప్రసన్నంగా మారిపోయింది.

    "ఏమిటలా ముఖం పెట్టేవు. చూడరానిది చూసినట్టు వినరానిది విన్నట్టు. రాకూడని వాడు వచ్చినట్టు. అన్నట్టు నువ్వెవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా?" నవ్వూతూ అడిగాడు  నాగారాజు.

    సంధ్య సమాధానం చెప్పలేదు.

    "పాపం! ధర్మరాజుగారికి ఆరోగ్యం సారిగా  లేదట కదా! ఎవరో చెప్పారట! నువ్వు వాళ్ళబ్బాయిని చేసుకోవాలని అనుకున్నప్పటి నుంచీ అయన ఆరోగ్యం దెబ్బతిన్నదట_"

    వేయి పడగలతో పాము తన ఎదురుగా నుంచుని బుస కొడుతూనట్టు అనిపించింది సంద్యకి.

    "నాగారాజూ! ప్లీజ్ నువ్వెళ్ళిపో!" అంది అభ్యర్దినగా

    'ఏం? అదిత్యకోసం ఎదురు చూస్తున్నావా?'

    అతని కంఠంలో హేళననిగుర్తించింది ఆమె ప్చ్!అసూయని జయించిన మినిషి యిమ్తదకా పుట్టలేదు! అనుకుంది "అయినా ఇతన్లో రక్తమాంసలున్నాయా? పౌరషం వుందా? వుంటే యిలా సిగ్గు విడిచి అడుగుతాడా?" అనుకుంది మళ్ళీ జవాబు చెప్పలేదు.

    'సంద్యా! ఇది నీకు మర్యాద కాదు. పురుగుల యింటి అడపడుచువు. ఇలా పార్కుల్లో, కావువేలల్లో, హొటళ్ళలో కలుసుకుంటే నలుగురూ ఏమనుకుంటారు?"

    'నా యిష్టం? నువ్వెవరివి అంటానికి?" కోపంగా అంది.

    అయినా అతను చిరునవ్వు నవ్వేడు. 'నే నెవరో నీకు తెలీదా ?నీ బావని! నిన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నవాడిని_'

    "నువ్వనుకుంటే సరిపోయిందా!"

    "నువ్వూ యిష్టపడాలి! తప్పదు!"

    "ఏం? బలవంతమా?"

    'అం అవసరమయితే ఎత్తుకెళ్ళయినా నిన్ను పెళ్ళిచేసుకుంటాను.అది తప్పదు. అందులో తప్పూలేదు' నవ్వూతూనే అన్నాడతను.

    "సంద్యా! ఇంటికి వెళదాం పడ!"

     "నువ్వు వెళ్ళు! నాకు పని వుంది?"

    'ఏం పని? అతన్ని కలుసుకోవటమేనా?

    "అం అవును ఇకేం! చెప్పగా! వెళ్ళిపో!"

    'సంద్యా!హతాశుడై నట్టుగా పిలిచాడు. 'ఇది నీకు మర్యాదకాదు భావ్యమా కాదు'

    అతను పూర్తీచేయకముందే 'నాగారాజూ! నన్ను విసిగించకు వెళ్ళు! ఇంకో మాట మాటాడావంటే జన్మలో నీ ముఖం చూడను. దయచేసి వెళ్ళిపో !' అంది. ఆమె ముఖంలో కోపం, అభ్యర్దన, అసహ్యం, అసహనం అన్నీ కనిపించాయి.

    నాగరాజు ముఖం పాలిపోయింది.

    'సంద్యా...' అంటూ ఏదో చెప్పబోయాడు.

    'ప్లీజ్... యిమ్కేం మాటాడకు' అంది

    నిట్టూర్చి వెళ్ళిపోయాడు నాగరాజు. మరో నిమిషం తర్వాత అతని మోటార్ సైకిల్ పెద్ద శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది.

    ఉస్సురని నిట్టూర్చింది సంధ్య.

    అరున్నరయినా యింకా రాని ఆదిత్య పై విసుక్కుంది.
   
   
                                                                   27

    'నువ్వేనా సంద్యవి!'

    కోకిల స్వరం చెవి దగ్గర వినిపించినట్టుయింది. ఆకాలంలో వసంతం వస్తే తడపడ్డ కోకిల గమట గా సంగీత కచేరి చేసినట్టు వుండా పిలుపు.

    చప్పున తల తిప్పింది.

    ఓ అందమైన యువతి! ఆమెకి యవ్వనం అందం తెచ్చిందో అందం యవ్వడానికేఅందం తెచ్చిపెట్టిందో చప్పున తేల్చి చెప్పలేం.

    'నమస్తే!' ఈ పిలుపు మరీ మధురంగా వుంది.

    'అవును!' అంది సంధ్య. ఆమె ఇంకా ఆ మాదకత నుంచి తెరుకోలేదు. ఆ స్వరం యింకా చెవుల్లో సన్నాయి పాటలా వినిపిస్తూనే వుంది.

    'ఇక్కడ నుమ్చున్నరేం!'

    'గడికోచ్చాను!'

    'ఎందుకు? గుళ్ళో దేవుడుకి దండం పెట్టుకోటానికా?"

    'అవును'

    'ఇంతసేపు_ గంటసేపు_బయటే నుంచున్నారేం-లోపలకి వెళ్ళారా? లేక_ ఎవరి కోసమయినా చూస్తున్నారా? కలసి దండం పెట్టుకోవాలా?'     అత్మీయురాలినా ప్రశ్నిస్తోంది ఆమె.

    ఆమె గొంతు వింటుంటే కార్ర్టీజ్యోత్స్నలో నుంచునట్టుగా అనిపిస్తోంది. ఆ వెన్నెల్లో స్నానం చేస్తున్నట్టు భావన. ఎంత తీయని గొంతు! ఎంత అత్మీయుత. 'అవును!' అంది అన్నిటికీ సమాధానంగా.

 Previous Page Next Page