Previous Page Next Page 
అగ్ని పరీక్ష పేజి 28


    "కొత్త డాడీ ఎందుకు... డాడీ వుండగా యింకో కొత్త డాడీ ఎందుకు?." అమాయకంగా ఆరేళ్ళ పిల్ల అడిగిన ఆ ప్రశ్నకి తలలు నెరసిన తాత నాయనమ్మలు గాని, కన్నతల్లిగాని జవాబు చెప్పలేం అన్నట్టు తలలు దించుకున్నారు.
    "పూజా చూడమ్మా.... నీవు చిన్నపిల్లవి యిప్పుడు నీకు అర్ధం కాదమ్మా చెప్పినా పెద్దయ్యాక తెలుస్తుంది జవాబు నీకే. ఎం.బి.ఎ గుడ్ గర్ల్ అండ్ సే హల్లో టు యువర్ న్యూ డాడి." అన్నారు సదాశివంగారు పూజని దగ్గిరకి తీసుకొని "తాతగారూ కొత్త డాడీలు మా ఫ్రెండ్సుకి ఎవరూ లేరు. నాకెందుకు వచ్చారు పూజకి ఎవరు చెప్పినా ఏదో అర్ధంకాని విషయంలా. అందులో ఏదో గొడవ వుందన్నది మాత్రం అర్ధంఅయింది ఎందుకో ఆ చిన్న మనసు "కొత్తడాడి" అన్న మాటని అంగీకరించలేక పోతూంది- పూజ మొహంలో భావాలని, ఆమె మనసులోని అలజడిని రాజేష్ గమనించాడు అనంగీకారం ఆ పసిపిల్ల మొహంలో స్పష్టంగా కనిపించింది - అతనే చొరవచేసి "పూజా... అంకుల అని పిలమ్మా.....డాడీ అనద్దు. ఏం..." అన్నాడు చనువుగా దగ్గిరకి తీసుకుంటూ - పూజ సిగ్గుపడి అతన్ని వదిలించుకుని నాయనమ్మ దగ్గిరకి పరిగెత్తింది. ఫ్రమ్ టుడే వుయ్ ఆర్ ఫ్రెండ్స్ ఒకే..." అన్నాడు మళ్ళీ- పూజాతప్పమ్మా అంకుల్ పిలుస్తుంటే అలా వచ్చేయచ్చా బాడ్ మానర్స్..... సే హలోటూ అంకుల్...." మందలిస్తున్నట్టు అంది వరలక్ష్మి.
    పూజ బలవంతంగానో "హలో అంకుల్ అంది. ఇంత సేపూ అర్చన ప్రేక్షకురాలిలా వుండిపోయింది. చంటిపిల్ల అనుకున్న పూజ ఆ క్షణంలో ఎంతో ఎదిగిపోయి నట్లనిపించింది. చిన్నపిల్ల దగ్గిర అబద్దంఆడడం ఎందుకు "కొత్త డాడీ" అని చెప్పేస్తే సరి, పిల్లలదేం వుంది. రేపటినించి అదే డాడీ అనిపిలుస్తుంది...అని చాలా తేలిగ్గా కొత్తడాడీ అని చెప్పేసింది కాని అంత చిన్నపిల్లా....అంత చిన్న మనస్సు అనుకున్నది పెద్దదిచేసి అరాలుతీసి ప్రశ్నలడిగి, నిలేస్తుందాని ఎదురు చూడని అర్చన పూజని చూసి తెల్లపోయింది. ఈనాటి పిల్లలకి ఎంత తెలివి తేటలు.... తన డాడి కాదు అన్నది దీనికి అర్ధమైపోయింది. పూజ, రాజేష్ ని డాడిగా అంగీకరించదేమో.....అర్చన మనసులో ఒక్కక్షణం అలజడి రేగింది.
    పూజని ఆడుకోమని బయటికి పంపాక వరలక్ష్మి వాతావరణం తేలిగ్గా మార్చడానికి నవ్వుతూ....."చిన్నపిల్ల...... రెండు రోజులు అలవాటయిది అదే సర్దుకుంటుంది." అంది.
    "అంకుల్ అనే పిలవనీయి అర్చనా.... ఎలా పిలిస్తే ఏం వుంది. "రాజేష్ తానేం ఫీలవలేదని అర్చనకి నమ్మకం కల్గించడానికి తేలిగ్గా అన్నాడు......రాజేష్ గదిలో బట్టలు మార్చుకోడానికి వెళ్ళగా చూసి "దీని కింత తెలుస్తుందని నేననుకోలేదు...." అర్చన తనలో తను అనుకున్నట్టు అంది. "ఈ కలం పిల్లలమ్మా స్కూల్లో వాళ్ళు మాట్లాడుకొని విషయాలుండవు..... మరీ చంటిపాప కాదుకదా.....డాడి అంటే తెలియదా దానికి మరి." సదాశివంగారు అన్నారు.
    "అందులో ఈ మధ్య వాళ్ళ నాన్న చాలాసార్లు వచ్చిపోతున్నాడు కదా.....అది డాడి డాడి అంటూ తిరిగేది వాడి వెనకాతలమరి...." వరలక్ష్మి అంది.
    "ఆయన చాలాసార్లు వస్తున్నారా.....పూజని......పూజని బాగా పలకరిస్తున్నారా.....పూజ ఆయనతో చనువుగా వుంటుందా...." అర్చన అపనమ్మకంగా అంది.....ఆ క్షణంలో పూజని యిక్కడ వుంచి తను పొరపాటు చేసేనేమో అనిపించింది.
    "ఎంతయినా కన్న తండ్రి.....రక్తపాశం ఎక్కడికి పోతుందమ్మా. అందులో ఈ రెండు మూడేళ్ళు వంటరిగా వుండినాడేమో కాస్త మారాడు. ఈ ఏడాదిలో చాలాసార్లు వచ్చిపోయాడు. పూజని బాగా చేరిన చేసుకున్నాడు వచ్చినపుడల్లా బొమ్మలు బట్టలు అవి కొనియిస్తున్నాడు." అత్తగారు అంది.
    "మీరు.... మీరు.... పూజకి చెప్పకపోవల్సింది ఆయన డాడి అని." వరలక్ష్మి, కాస్త వింతగా చూసింది. "అదేవిటి. చెప్పకుండా ఎలా...చెప్పకుండా వుంటే తెలియకుండా వుంటుందా... మేం ఎవరం అని చెప్పాలి. వాడు యింటికి వచ్చి పూజని దగ్గిరకి తీసుకుంటూ "మీ డాడిని పూజా" అంటుంటే వద్దని చెప్పమంటావా.... అందులో స్కూలుకి వెళ్ళిం దగ్గర నించి మా మమ్మీ యిక్కడెందుకు లేదు మాడాడి ఏరి అని అడుగుతూంటే దానికి చెప్పకుండా ఎలాగమ్మా వుండడం.... అయినా దాని కన్నతండ్రిని తండ్రి అని చెప్పడంలో తప్పేమిటి." ఆవిడ కాస్త అసహనంగా నొచ్చుకుంటూ అంది ఆవిడ గొంతులో కోపం గుర్తించి "నా ఉద్దేశం అది కాదండి. ఆయనతో కలిసి బతకనపుడు.....యింత యిదిగా ఎటాచ్ మెంటు పెంచుకోడం ఎందుకు అని. యిప్పుడు రాజేష్ ని తండ్రిగా చూడగలదా అని."
    "చూడమ్మా! రక్త సంబంధం చెప్పనంత మాత్రాన చెరిగిపోదు. అది రేపు పెద్దయ్యాక విషయాలు తెలియవా, అర్ధం చేసుకోదా. అప్పుడు అబద్దం ఎందుకు చెప్పావు అని నిలేస్తే తలొంచుకునే కంటే ముందునించి దాన్ని మెంటల్ గా ప్రిపేరు చేయడం మంచిది నిజం చెప్పి అని నా ఉద్దేశం" ఆవిడ తన మనసులోమాట ఖచ్చితంగా చెప్పింది. ఆవిడ అన్న మాటలో నిజం వుందని అర్ధం అయి అర్చన యింకేం అనలేదు.
    ఒకపూట వుండి వెళ్ళాలని వచ్చిన అర్చనని రాజేష్ ని ఆరోజు వుండి గాని వెళ్ళడానికి వీలులేదని వుంచేశారు సదాశివంగారు. వారి కోడలు అయివుండి యింకోరిని వారి కొడుకు స్థానంలో నిలబెట్టి వారి యింట్లోనే భర్తతో వుండడానికి కాస్త బిడియపడింది అర్చన. అది గుర్తించిన వరలక్ష్మి-"అర్చనా యిప్పుడు నీవు యింక యీ యింటి కోడలివి కాదమ్మా! కూతురిగా పుట్టింటికి వచ్చావనుకో" అంది మనస్ఫూర్తిగా వారి సహృదయతకి, సంస్కారానికి మరోసారి మనసులోనే జోహారు లర్పించింది అర్చన. "ఏమిటో యిలాంటి రత్నాన్ని బొగ్గులా పెంటమీద పారేసుకున్న మావాడిదమ్మా దురదృష్టం, అనుభవించే యోగం వాడికి లేదు" ఆవిడ నిట్టూర్చి అంది.

 Previous Page Next Page