Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 27

    అది హాలు నలుగురూ తిరుగుతుంటారు. అమల (రోజా)ని ముట్టుకోవటానికి లేదు. పైగా పిచ్చిపిల్ల అరిచినా అరుస్తుంది. రోజాని చూస్తుంటే మతిపోతున్నది. అంతులేని కామం బుస్సున పొంగినట్లయింది. శంకరం అక్కడే వున్న షల్ఫ్ లోని పుస్తకాలు సర్డుతున్నట్లు నటిస్తూ తగ్గు స్వరంతో ప్రేలాపన మొదలుపెట్టాడు.

    "నా స్వీట్ రోజా! నీ బుగ్గలు కొరకాలనిపిస్తున్నది. అంతేకాదు నీ శరీరాన్ని కప్పిన ఈ వెధవ బట్టలు లాగిపారేసి నిన్ను......" శంకరం బూతువాగుడుతో తృప్తిపడుతున్నాడు అమలని చూస్తూ.

    అమల తల సిగ్గుతో కుదించుకుపోయింది. అమాంతం లేచి వెళ్ళిపోతే పిచ్చిది కాదని తెలుస్తుంది. ఎలా వాడి నోరు మూయించటం? అనుకుంది ఓ ఉపాయం తట్టింది.

    "అమ్మో అబ్బో" అంది బాధపడుతున్నట్లు నటిస్తూ.

    "కాస్త మోటుగా ప్రవర్తించానా?" శంకరం మరో అర్ధంతో అన్నాడు.

    "నీ శార్ధం, నీ రోగం కుదర్చటానికే ఈ ఎత్తు. అమల అనుకుంది మరోసారి "బాబోయ్ నెప్పి నెప్పి" అంది.

    "బాగా నెప్పిగా వుందా హిహ్హిహ్హీ." అన్నాడు శంకరం
 
    వీడితో యిలా కాదనుకుంది అమల. "ఏయ్ దేభ్యం యిలారా!" అంది.

    శంకరం మహానంద పడిపోయాడు. రోజా దగ్గరకు రమ్మని పిలిచింది. ఏ చెయ్యో కాసేపు ముట్టుకోవచ్చు అదీ ఆశ.

    "ఎందుకు రోజా!" ప్రేమగా అడిగాడు శంకరం.

    "ఎందుకా! ఎందుకబ్బా! ఆ...... గుర్తొచ్చింది. అడవి కెళితే నా కాల్లో ముల్లు విరిగింది కదా!"

    "అడవికి వెళ్ళావా?"

    "నీకేం తెలిసిచావదు. సినిమా చూడటానికి పొద్దున అడవికి నడిచి వెళ్ళాకదా! అప్పుడు నా కాల్లో బంగారపు ముల్లు విరిగింది. బలే నెప్పి పుడుతుందిలే, వింటున్నావా దేభ్యం?"

    "ఆ.....వింటున్నా వింటున్నా!"

    "నీవేమో యిలా కింద కూర్చో వడిలో కాలుపెడతాను. కాలులో ముల్లు వెతికి తీసి ఆ బంగారు ముల్లుని నా చేతిలో పెట్టాలి. కాలిలో ఎక్కడుందో ఏమిటో" అంది అమల.

    అదివిన్న శంకరం ఎగిరి గంతేసినంత పని చేశాడు.

    "రోజా కాలు రోజాయే తన ఒడిలో పెడుతున్నది. ముందు అరికాలు చూసి లేదని చెప్పి కాలంతా వెతకాలి అనాలి. వెతుకు బాగా వెతుకు. బంగారు ముల్లు తీసి యివ్వు అంటుంది ఆ పిచ్చిది. కాలుమీద వెతుకుతున్నట్లు నటిస్తూ తన చేతిని అలాఅలా పైకి పోనివ్వాలి. ఆ పైన వుండేది బంగారు ముల్లుకాదు. బంగారు.....

    "ఏయ్. ఏంటి ముల్లుతీయవ్?" అంది అమల వాడి దురుద్దేశ్యం గ్రహించినదై.

    శంకరం గబుక్కున కింద కూర్చున్నాడు. అమల కాలు లాక్కుని తన ఒడిలో పెట్టుకున్నాడు.

    అమల అయిడియా వేరు. శంకరం కాలులో ముల్లు వెతుకుతున్నట్లు నటిస్తుంటాడు. సమయం చూసి అదే కాలుతో వాడి ముఖంమీద వీలయినంత బలంగా లాగిపెట్టి తన్నాలి. ఆ దెబ్బతో శంకరం మూతిపళ్ళు రాలటమే గాక ముక్కు అదిరిపోవాలి. జన్మలో తనజోలికి రాకుండా వుండాలి. లేకపోతే గాడ్డెవెధవ. తిన్న యింటి వాసాలు లెక్కపెట్టే నయవంచకుడు. తను పిచ్చిదనుకుని, పిచ్చిదానికి బూతుమాటలు అర్ధం కావని అనుకుని అనరాని మాటలు అంటాడా! అనే మాటను ఏ ఆడది విన్నా తల పగలగొట్టుకు చస్తుంది. తన ఖర్మకాలి పిచ్చిదానిలా వుండబట్టి ఆ బూతులన్నీ పడింది.

    తన్నటానికి సమయం కోసం చూస్తూ అమల ఆలోచిస్తున్నది.

    "అందమైన ఈ పాదాలని ముద్దుపెట్టుకోని ఈ జన్మదేనికి!" అనుకున్నాడు శంకరం.

    శంకరం చెయ్యి కాలిగిలకదాటి పైకి రాబోతున్నది.

 Previous Page Next Page