రూమ్ లోకి వెళ్ళగానే అన్నాడు రణదీఫ్
"అంకుష్! ఇక్కడనుండి మనము వేసే ప్రతి అడుగూ ఆలోచించి వేయాలి గుర్తుంచుకో. తొందరపడోద్దు ముందు ఫోన్ అందుకో."
రిసీవర్ని అందుకుని రణదీఫ్ కిచ్చాడు అంకుష్.
లాయర్ నీలకంఠన్ నెంబర్ కి డయాల్ చేశాడతాను.
* * * *
ఆఫీసు రూమ్ లో ఏదో ఫైలుని తిరగేస్తున్నా లాయర్ నీలకంఠన్ ఫోన్ మ్రోగగానే రిసీవర్ని అందుకున్నాడు.
"కేన్ ఐ స్నిక్స్ టూ లాయర్ నీలకంఠన్ ."
"ఏస్... స్పీకింగ్ "
"గుడ్ మార్నింగ్ సార్! నా పేరు రణదీఫ్. రణదీఫ్ కేవల్కర్."
ఏదో క్లయింటు దగ్గర్నుంచి వచ్చిన ఫోను అనుకున్న నీలకంఠన్ రణదీఫ్ కేవల్కర్... కేవల్కర్ అన్న పదం వినగానే ఉలిక్కిపడ్డాడు.
"సరిగ్గా నేలరోజుల క్రితం మీరు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఒక ప్రకటన యిచ్చారు. ఆ విషయమై మీతో మాట్లాడాటానికి వచ్చాను. మిమ్మల్ని కలుసుకోవాలి" జాగ్రత్తగా అన్నాడు రణదీఫ్.
"మీరిప్పుడు ఎక్కడినుంచి మాట్లాడుతున్నారు?" అడిగాడు లాయర్ నీలకంఠన్ .
"సికింద్రాబాద్ ఏరియా నుంచి..." కావాలనే అబద్దం చెప్పాడు రణదీఫ్.
"మీరో గంటలో రాగలిగితే నేను మీకోసం రెడీగా వుంటాను" చెప్పాడు నీలకంఠన్ .
"ఓ.కేసార్! ఇప్పుడు తోమిదిన్నర అయ్యింది. సరిగ్గా పదిన్నారకు మీ ఎదుట వుంటాను"ఫోన్ పెట్టేశాడు రణదీఫ్ కేవల్కర్.
మరో మదిహేను నిమిషాలకు ఇద్దరూ టిఫ్ టాఫ్ గా య్తయారయ్యారు
"అంకుష్! మన ప్లాన్ ప్రకారం నువ్విప్పుడు శుశ్రితా హాస్పిటల్ కు వెళుతున్నావు. ఎక్కడా, ఎవరికీ, ముఖ్యంగా ఆ కాశీచరణ్ కి ఏ మాత్రం అనుమానం రాకుండా మేనేజ్ చెయ్యి.సరిగ్గా పన్నెండు గంటలకు యిక్కడకు వచ్చీ" రూమ్ లోంచి బయటి కేల్తున్నప్పుడు అన్నాడు రణదీఫ్.
రోడ్డుమీదకు వచ్చివారు చెరో ఆటో ఎక్కారు.
* * * *
ఉదయం సరిగ్గా 10గంటలు... శుశ్రిత హాస్పిటల్ లోకి అడుగుపెట్టాడు అంకుష్ కేవల్కర్. అతని చేతిలో వున్న ప్లవర్ బోకే అందంగా మెరుస్తోంది. తన దగ్గరగా వచ్చిన ఆకారాన్ని చూసి ఏదో రాసుకుంటున్నా రిసేప్షనిస్ట్ తలెత్తి చూసింది.
"ఏస్!"
"కాశీచరణ్ కలవాలి" అన్నాడు అంకుష్.
"ప్లీజ్ గోటు ఫస్ట్ ప్లోర్_ రూమ్ నెంబర్ తో నాట్ వన్..." ఆమెకు థాంక్స్ చెప్పి లిఫ్టువైపు నడిచాడు కేవల్కర్.
* * * *
డోర్ మీద చెప్పుడైతే శివానందం గానీ, మేరీ గానీ వచ్చారనుకున్నాడు కాశీచరణ్_
"ఏస్.. కమిన్.." అన్నాడు.
వెంటనే తెరుచుకున్న తలుపుల్లోకి లోనికి అడుగిడిన అపరిచితుడి వైపు ఆశ్చర్యంగా చూశాడు కాశీచరణ్.
"ఐయామ్ అంకుష్... ఫ్రమ్ బెంగుళూర్... మిమల్ని పరామర్శించడాని కొచ్చాను_ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ..." అంటూ ప్లవర్ బోకేను కాశీచరణ్ అందించాడు అంకుష్.
మర్యాద కోసం ప్లవర్ బోకేను అందుకున్నా_ఎవరీ అంకుష్? తనని చూడటానికి బెంగుళూరు నుంచి ఎందుకు వచ్చాడు? మనసులో మోదుల్తున్న ప్రశ్నలతో ప్లవర్ బోకేను పక్కన పేట్టి, కూర్చోమన్నట్టుగా కుర్చీని చూపెట్టాడు కాశీచరణ్.
ఏమేం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అని రాత్రంతా బస్సులో రణదీఫ్ అంకుష్ తో చెప్పాడు_ ఆ డైలాగులన్నీటినీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నాడు అంకుష్.
"నేనెవరోనని ఆశ్చర్యపోతున్నారు కదూ... సహజమే... మొదట్లో మీ విషయం నాతో భయపడింది_ తను బయలుదేరడానికి సన్నద్దమైన రోజు ఉదయం నాతో చెప్పింది_ పెద్ద వాళ్ళు ప్రేమను వ్యతిరేకిచోచ్చు... నేనెందుకు వ్యతిరేకిస్తాను... సో" ఏదో చెప్పబోతున్న అంకుష్ కళ్ళలోకి సూటిగా చూశాడు కాశీచరణ్.
"నా చెల్లెలు అర్చన గురించి కాశీచరణ్ తో చేబుతున్నాను. కాశీచరణ్ మీరేగదా?" అమాయకంగా అన్నాడు అంకుష్.
"కాశీచరణ్.. నేనే... గానీ..."
"ప్రేమ విషయంలో మేహమాటపడటం సహజమే. తను కూడా నాతో రావాలనుకుంది. లీవ్ దొరకలేదు. మిమల్ని చూసి, మీఆరోగ్యం ఎలా వుందో కనుక్కోమని పంపింది_ అంటే! మూడు రోజుల క్రితం ఉత్తరం కూడా రాసిందనుకుంటాను మీకు..."
అతనికి ఏం చెప్పాలో. ఎలా చెప్పాలో అర్ధంకాలేదు కాశీచరణ్ కు.
ఆ అర్చన ఎవరో నాకు తెలీదు_ నేనా మేను ప్రేమించలేదు. దయచేసి నన్ను వదిలేయండి_ ఎలుగెత్తి అరవాలనిపించింది అతనికి.
అకస్మాత్తుగా అస్వస్తతకు గురి అయినవాడిలా దిగాలుగా అంకుష్ వైపు చూశాడు అతను.
"మిస్టర్ కాశీచరణ్! నేను ఈ రాత్రి బస్సుకి బెంగుళూరు వెళ్ళిపోతున్నాను_ అర్చనకు ఏం చెప్పమంటారు?" నెమ్మదిగా అడిగాడతను.
అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ పెదవి విప్పాడు కాశీచరణ్_ "చూడండి అంకుష్! ప్రాంక్ గా చెప్పాలంటే నాకు అర్చన అనే యువతి ఎవరో తెలీదు_ కనీసం పరిచయం కూడా లేదు. పరిచయమే లేనప్పుడు ఈ ప్రేమ ఏమిటి? ఈ లెటర్ ఏమిటి? ఆమెకు నేనేం రిప్లయ్ యివ్వగలను...మీరే ఆలోచించండి."
సడన్ గా లేచి నిలబడ్డాడు అంకుష్.
"మీరు అర్చనను మామూలు వ్యక్తిలా వున్నప్పుడు ప్రేమించారు. ఇద్దరూ పెళ్ళిచేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు మీరు కోట్లాది రూపాయల ఆసక్తి వారసాలు. అందుచేత మీ అభిప్రాయం మారిపోవడంలో తప్పు లేదు.