Previous Page Next Page 
యోధుడు పేజి 25

    నిజానికి ఎలాంటి జోక్స్ వేసినా, అవి సరదాగా అవతల వారిని ఆనందింపజేయడానికే తప్పు_ అయన మనస్సులో ఏ దురుద్దేశం వుండదని అందరికీ తెలుసు.

    చాలామందిపేషెంట్స్ మొదట్లో ఆయన్ని అపార్ధం చేసుకోవడం. ఆతర్వాత అయన ప్రాక్టికల్ జోక్స్ కి అలవాటు పడిపోయింది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరికయినా హుషారుగా వుంటుంది ఆఖరికి మూడీగా మధురిమకు కూడా.

    "ఏం చేస్తున్నారు డాక్టర్?" అడిగిందామె.

    "చెప్పెకో చూద్దాం" కావ్విస్తూ అన్నాడాయన.

    "టెలిఫోన్ మోతకు హడావిడిగా లేచుంటారు...అవునా?" అన్నది నవ్వుతూ.

    "కాదు.ఒంటిగంట వరకు నిరీక్షణ. అ తర్వాత నుంచి నిరాశ.... ఈ వయస్సులో నిరాశ అవరిస్తే ఎలా వుంటుందో చెప్పు."

    "ఒంటిగంటవరకూ ఎవరికోసం నిరీక్షించారు?"

    "అబద్దం చెప్పమంటావా నిజం చెప్పమంటావా?"

    "మీరేం చెప్పినా బాగుంటుంది."

    "ఇన్నాళ్ళకు నా గురించి కరేక్టగా ఎసేస్ చేయగలిగావు మధురిమా! అయితే నిజమే చెప్తానులే. రెండ్రోజుల్లో డిల్లీలో  కాన్ఫరెన్స్ వుండి. పేపర్ చేస్తున్నాను" నిజం చెప్పాడాయన.

    "మరి అబద్దం ఏం చెప్దామనుకున్నారు?" నవ్వును బిగపట్టుకుంటూ అడిగిందామె.

    "ఒంటిగంటవరకూ రేఖ వస్తానంటే నిరీక్షణ. రానని రాలేనని చెబితే నిరాశగా వున్నాను. ఇదీ అబద్దం."

    "ఇంతకీ అ అద్దాలమెడ రేఖ ఎవరు?"

    "ఇంకెవరూ! బాలీవుడ్ బ్యూటీక్వీన్ రేఖ. రేఖకి నలబై ఏళ్ళు వచ్చినా, చాలా సెక్సీగా వుటుందమ్మయ్" అన్నాడు అయన.

    కొన్ని క్షణాలపాటు ఆగకుండా నవ్వింది మధురిమ అయన మాటలకు.

    "నీ నవ్వు వినిపించడానికి కేనా ఫోన్ చేశావ్?"

    "కాదు సార్! చిన్న కేసు."

    "చెప్పు!" చెప్పింది మధురిమ.

    "అ పేషెంట్ కి పూర్తిగా స్పృహాపోయిందా?"

    "లేదు సార్! గతం మర్చిపోయాడు."

    "పేరూ, ఊరూ చెప్పాగలుగుతున్నాడా కనీసం?"

    "లేదుసార్!"

    "పేషెంట్ ను ఒక్కసారిగా చూస్తేగాని చెప్పలేం మధురిమా! సాయంత్రం హాస్పిటల్ కి వస్తాను సరేనా?"

    "ఓ.కే డాక్టర్, థాంక్యూ!"

    "థాంక్స్ చెప్పేసి తప్పించుకుంటే కుదరదు మధురిమా! ఫీజీవ్వాలి" అన్నాడాయన నవ్వుతూ.

    "నా దగ్గర మీరేప్పుడూ ఫీజు అడగలేదు కదా సార్" అంది మధురిమ.

    అదే_ ఎప్పుడూ అడగలేదు కాబట్టే ఇప్పుడు అడుగుతాను. ఫీజెంతో  పేషెంట్ ను చూశాక చెప్తాను, సరేనా?" ఫోన్ పెట్టేశాడు డాక్టర్ కే.వి.రావు.

    కాశీచరణ్ ని మొదట కే.వి.రావుతో టెస్ట్ చేయించాలని ఆ తరువాత మిగతా విషయాల గురించి అలోచించాలనుకుంది బెడ్ మీద పడుకుంటూ మధురిమ.
   
                                                        *    *    *    *
   
    ఉదయం 8.20నిముషాలు. హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్! అప్పుడే బెంగుళూరు నుంచి వచ్చిన ఎక్స్ ప్రెస్ బస్సు బస్టాండు లోకి ప్రవేశించింది.

    బస్సులోంచి ఒక్కొక్క ప్రయాణీకుడూ దిగారు. చివరగా అందులోంచి దిగారు. వారు రణదీఫ్ కేవల్కర్, అంకుష్ కేవల్కర్.

    ఒకచేత్తో సూట్ కేసు, భుజానికి లగేజీ బ్యాగ్ తో రణదీఫ్ కేవల్కర్ ముందుకు నడిచాడు.

    "ఎక్కడి స్టేషన్" చెప్పి ఆటోలో కూర్చున్నాడు రణదీఫ్ కేవల్కర్.

    "బస్సు దిగింది ఇప్పుడేగా! రైల్వేస్టేషన్ కెందుకూ!" పక్కన కూర్చుంటూ అడిగాడు అంకుష్.

    ఆటో ముందుకు దూసుకుపోతోంది.

    "దేనికయినా ఎక్స్ సీరియన్స్ వుండాలి. అనవసర ప్రశ్నలు వెయ్యలు" సిగరెట్ వెలిగించి ఆటోలోంచి నలువైపులా చూస్తూ అన్నాడు రణదీఫ్.

    ఇరవై నిముషాల తర్వాత ఆటో నాంపల్లిస్టేషన్ రోడ్డులో ఆగింది. ఆటో చార్జీ చెల్లించి ముందుకు నడిచాడు రణదీఫ్.

    "ఇక్కడ చిన్నా చితకా కలపి దాదాపు ఇరవై హొటల్స్ వున్నాయి.ఎలాగో మనం దిగేది మారు పేర్లతోనే. కానీ రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలుసు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి చోట వుంటే మనం ఒక హొటల్లోంచి యింతో హొటల్లోకి తెలివిగా తప్పించుకోవచ్చు" హొటల్ స్వాగత్ లోకి దారితీస్తూ చెప్పాడు రణదీఫ్.

    హొటల్ రూమ్ లో డిగి లగేజీ పెట్టేసి, ఇద్దరూ మళ్ళీ రోడ్డుమీదకు వచ్చి ఓ సెలూన్ లో దూరారు.

    అరగంట తర్వాత ఆ సెలూన్ లోంచి బయటకు వచ్చారు. అంతకు పూర్వం హిప్సీ కక్రాఫింగ్ , పెద్ద పెద్ద మీసాల్లో వున్న వారి రూపురేఖలు ఒక్కసారిగా మరిపోయాయి. పల్చటి జుట్టు. సన్నపాటి మీసంతో రణదీఫ్, బోడిగుండు, పూర్తిగా మీసం తీసేసిన అంకుష్ హొటల్లోకి అడుగుపెట్టారు.
 

 Previous Page Next Page