Previous Page Next Page 
కాలనాగు పేజి 26

    సెలవు తీసుకున్నాడు నాగరాజు మరో నిమిషం తర్వాత అతని మోటార్ సైకిల్ అఘమేఘాల మీద వేలుతున్నట్టుగా వెళ్ళింది.

   
                                                               *    *    *    *

   
    'కూర్చో! అన్నాడు డాక్టర్ దేవనాద్ 'ఏమిటి కబుర్లు!'

    'నాన్నగారి జబ్బెమిటి?'

    'నరాల బలహీనత_ టెక్నికల్ పేరెందుకు లెద్దూ!'

    'ఎలా వచ్చింది సదన్ గా?

    ఆదిత్యా! ఆయనకి ముసలితనం వచ్చేసింది!'

    'ఈ వారం పదిరోజుల్లోనే నా?' సూటిగా అడిగాడు

    'ఏమిటి నీ సందేహం!'

    'సందేహం కాదు అనుమానం_'

    ఏదో ఒక డౌట్ పోనిద్దూ_ ఇంతకీ నీ బాధ ఏమిటి చెప్పు?

    అయన తెప్పించిన వేడివేడి తీ తాగితూ చెప్పాసాగాడు అప్పుడు రాత్రి దాదాపు తొమ్మిది గంటలు కావస్తోంది. ఆఖరి బాచ్ పేషెంట్స్ కి నీడిల్స్ వేసివచ్చి కూర్చున్నారాయన. హొమియో పేషెంట్స్ వెళ్ళిపోయారు. అల్లోపతిక్ ఎసిస్టంట్స్ చూస్తున్నారు. తాపీగా, విశ్రాంతిగా కూర్చున్నాడు డాక్టర్.

    'నా అనుమానం ఇది మాములు జబ్బుకాదని_'

    'ఆగాగు_ ఇదేమ ప్రమాదకరమయిన జబ్బుకాడు_ ఆ నొప్పుల్ని నేను యీ సిట్టింగ్ పూర్తయ్యేలోగానే కంట్రోల్ చేస్తాను'

    'అదికాదు నా వుద్దేశం-'

    'ఏమిటో చెప్పు_ విందాం-'

    'ఇది మానవాతీతమయిన శక్తి తెచ్చిపెడుతోన్న బాధ అని నా వుద్దేశం. అసలు మా యింటి మీదే ఎదో వికృత నేత్రం దృష్టి పడుతున్నా లేకపోతే యిలా జరగదు. ఆ రాత్రికి రాత్రి నాన్నగారికి చూపుపోయింది. మళ్ళీ మరుసటి రోజు రాత్రికి చూపు వచ్చింది. అది ఎంతో ఫెంటాస్టిక్ గా వుంది_'

    'పంతాస్తిక్ కాదు, మిస్టరీ కాదు_'

    'మరేంటి డాక్టర్?' ఉత్సుకతో ముందుకి వంగి అడిగాడు

    'చెప్పాన? మీ నానా అలా నాటకం అడేడేమోననినా అనుమానం?'

    "నాటకమా?" నివ్వెరపోయాడు ఆదిత్య.

    "అవును!" నవ్వేడు డాక్టర్. "మీ నాన్న చెప్పేది గొప్ప ఫాంటసీగా లేదూ? కళ్ళు కన్పించలేదన్నాడు. అలా సదన్ గా చూపు పోవడం సంభవమే! కాదనను. కానీ తిరిగి ఎలా వచ్చింది. చికిత్సలేదు. మంత్రంలేదు, యంత్రంలేదు.

    'ఎవరో అమ్మాయి వచ్చిందట! మావయ్య అందిట!

     ఈయన కళ్ళకి ఆమె అరచేయి తాకించిందట!

    ఆ అరచేతిలో గరుడరేఖ వుందిట! అదో వింత గరుడరేఖ అని చెప్పిందట. ఎంత అద్భుతంగా వుంది!"
    అలోచిస్తున్నాడు ఆదిత్య

    "అద్బుతం సరే ఆదిత్యా! ఎంత అసంబద్దంగా వుందో చూడు!" 
   
    అతనేం అన్లేదు

    "నే ననుకోవడం_"డాక్టర్ కొద్దిగా అగేడు ఎపెక్ట్ కోసమో అన్నట్టుగా" ఆ అమ్మాయిని నీ కిచ్చి చేయాలని అనుకుని యిలా వాటకం ఆడేడేమో! అన్నాడు.

    "నాటకం ఎందుకు?"

    "నువ్వేవరికైనా ప్రేమిమ్చినావా?

    సిగ్గుపడ్డాడు ఆదిత్య.

    'సర్లేదు సీక్రెట్ గా వుంచుతాన్లే!'

    తల దించుకుని నెమ్మదిగా 'అవును'అన్నాడు ఆదిత్య

    "తలెత్తి ధైర్యంగా చెప్పవోయ్! ప్రేమించటం మీ య్తువకుల జన్మహక్కు తెలుసా? కాలరేగరేసి చెప్పాలి ప్త్రేమిస్తున్నాని అందునా ఆ ప్రేమ వన్ వే ట్రాపిక్ కాకపోతే యింకా చెబ్తున్నాట్టుగా అన్నాడు డాక్టర్.

    చిరునవ్వు నవ్వేడు ఆదిత్య.

    'అంచేత_ నిన్ను ఆ అమ్మాయిని చేసుకోవద్దు అనలేక యూ ట్రిక్ చేసి వుండొచ్చు_'

    'ఆడే_ ఎందుకని? అర్ధం కావటం లేదు'

    "నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ వి. త్వరలో ఎంప్లాయ్ ని కూడా కాబావుతున్నావ్. నిన్నెలా అడ్డుబట్టి ఆపేది అందుకే ఓ అమ్మాయిని. అందునా నీ ప్రెండ్ ని_ నీ లవర్ ని- నిన్ను పెళ్ళి చేసుకుంటానన్న చిన్నదాన్ని_నువ్వు అందుకు అంగీకరించిన అమ్మాయిని సృష్టించలేదు.

    అంతేనా? ఆ అమ్మాయితో అద్బుతశక్తి కల్పించాడు. తనకో మారవ్యాధిని తెచ్చుకున్నాడు. దాన్ని ఆ అమ్మాయి  హస్తవాసితో  తగ్గించుకున్నాడు ఇప్పుడు చెప్పు. సింపతీ అంతా యీ అమ్మాయి వుండదూ.

    ఇద్దరమ్మాయిలు పోటీకొస్తే మీ అమ్మా ఓటేవరికి_

    నిస్సందేహంగా సరాలకి. అవునా!

    "అందుకే యిది నాటకం అంటున్నాను_"

    కొన్ని నిమిషాల సేపు అవాక్కాయిపోయాడు ఆదిత్య. అతనికి ఆ మాటలు నమ్మాలని ననిపిస్తున్నది_

    "అస్సారే! మీ యింట్లో బ్రాత్రూ ఇన్స్డెంటేమిటి?"

     చెప్పాడు ఆదిత్య.

    అది విని నివ్వెరపోయాడు డాక్టర్ దేవనాథ్.
   
   
                                                                            26


    సాయం సమయం! సూర్యకాంతులు మెల్లమెల్లగా తగ్గిపోయి చంద్ర దీదితులు వేదజల్లూతూ వుండే వేళకి మధ్య సమయం. కోవెల్లో ఆదిత్యకోసం వేచి చూస్తూ వుంది సంధ్య.

    దాదాపు పదిహేను రోజులుగా అతనికి ఫోన్ చేసి చెప్పింది. సాయంకాలం ఆరింటికి కోవెలలో కాచుకుని వుంటానని చెప్పింది. అతనోస్తాననిచెప్పాడు. ఆరు కాకాముందే వచ్చి కాచుకుని వుంది సంధ్య.

    ఆ రోజు ఉదయమే అతనికి ఫోన్ చేసి చెప్పింది. సాయంకాలం ఆరింటికి కోవెల్లో కాచుకుని వుంటానని చెప్పింది. అతనొస్తానని చెప్పాడు. ఆరు కాకముందే వచ్చి కాచుకుని వుంది సంధ్య.

 Previous Page Next Page