నేను ఇలా మోడులా మిగిలిపోతానని వారానాడు ఎడురుచుడలేదు. భవిష్యత్తులో నా పెళ్ళికి నా సంసారానికి ఈ పాప అడ్డు వస్తుందని ఆ పని చేశారు. అంతే కాదు నా మిగతా ముగ్గురు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అవవన్న భయంతో ఆ స్వార్ధంతో ఇన్నాళ్లూ నానించి ఆ నిజం దాచిపెట్టారు. ఆఖరి చెల్లెలు పెళ్ళి అయ్యాక, ఇంక నేనెలాగు పెళ్ళి సంసారానికి నోచుకోలేదని అర్ధం అయ్యాక నాన్నగారు చనిపోయేముందు ఈ రహస్యం చెప్పి ప్రాణం వదిలారు. ఆ తరవాత అమ్మని ఎంత నిందించానో - ఏం అనుకుంటే ఏం లాభం. ఒక్క రోజన్నా ఆలస్యం చెయ్యకుండా అనాధశరణాలయం వెళ్ళాను. పాపని దత్తు తీసుకుంటున్నట్లు కాగితాలు, పర్మిషన్లు అన్ని రూల్స్ ప్రకారం జరిగి పాప నా దగ్గరికి రావడానికి ఆర్నెల్లు పట్టింది. ఆ ఆర్నెల్లలో సరోజ గడిపిన, గడుపుతున్న నికృష్ట జీవితం చూసి ఎంత బాధపడ్డానో ఎలా చెప్పగలను రూపా" సుమతి గొంతు వణికింది.
"ఆంటీ! అసలు ఇదంతా ఎలా......ఎందుకు జరిగింది. రామనాధంగారు మిమ్మల్ని ఎందుకు పెళ్ళాడనన్నారు?" కుతూహలంగా అడిగింది రూప. "ఆడదాన్ని అనుభవించడానికి ఏం రూల్సు లేవు గాని, ఒక పెళ్ళి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వీలులేదుగా" హేళనగా అంది సుమతి.
"అంటే రామనాధంగారప్పటికే వివాహితులా" రూప ఆశ్చర్యంగా అంది. పెళ్లెం ఖర్మ ఇద్దరు పిల్లలు కూడా వున్నరప్పటికి. "మరి మీకెలా తెలియలేదు?" ఆశ్చర్యంగా అడిగింది రూప. "అయన చెప్పలేదా? అంతా చెప్పండి ఆంటీ" ఆరాటంగా అడిగింది రూప.
"చెప్పడానికి ఏముంది రూపా! మోసపోయిన ఆడవాళ్ళ కధలన్నీ ఒక్కలాగే వుంటాయి. నేను నీలాగే బి.ఎ. చదువుతూ వుండేదాన్ని. మా నాన్నగారు లాయరు. ఆయనకి నల్గురం ఆడపిల్లలమే. పెద్దదాన్ని నేను. మా యింట్లో మా నాన్నగారి దగ్గర జూనియర్ గా వుండేవాడు రామనాధం. ఇప్పుడు సురేష్ ఎలా అందంగా చలాకీగా వున్నాడో అచ్చు రామనాధం అదే వయసులో అలాగే వుండేవాడు.
"అతను మా ఇంట్లో కారు షెడ్డులో రూములోనే వుండేవాడు. మా ఇంట్లోనే భోజనం ఆది. ఇద్దరు వయసులో వున్న స్రీ పురుషులు ఒకచోటా చనువుగా కల్సి మెల్సి తిరుగుతుంటే ఆ చనువు స్నేహం, ఆకర్షణ, ప్రేమగా మారడానికి ఎన్నాళ్ళో పట్టదు. ఇరవై మూడేళ్ళున్న రామనాధం అప్పటికే వివాహితుడని ఇద్దరు పిల్లల తండ్రని ఎలా అనుకుంటారు ఎవరన్నా? అతను చెప్పలేదు. మేం అడగలేదు. అతని పట్ల సుళువుగానే ఆకర్షితురాలినయ్యాను. ఆ అవకాశం అతను వృధా పోనివలేదు. ఫలితం- ఏది జరగకుడదో అది జరిగింది. అది తెలిశాక భయపడి చెప్పకుండా ఉడాయించాడు రామనాధం. నేను ఎంత దాచినా దాగనిది ఈ వ్యవహారం. అమ్మ, నాన్నలకి తెలిసేవేళకి పరిస్థితి చెయ్యి దాటింది. నాన్నగారు నెత్తి నోరు బాదుకుని రామనాధం ఊరు పరుగెత్తారు. తిరిగి వచ్చిన అయన చెప్పిన కబురు విని మేం అందరం నిశ్చేష్టులయ్యాం. రామనాధంకి అప్పటికే పెళ్ళయిందట. ఇద్దరు పిల్లలట. మేనరికమే చేసుకున్నాడట, అతని బామ్మగారు చచ్చిపోతూ మనవడి పెళ్ళి చేయించిందట. బి.ఏ. చదివేటప్పుడే- ఆ పిల్ల అనాకారిట. భార్య కనక సంసారం చేసి ఇద్దరు పిల్లల్ని కన్నాడట అప్పటికే.
ఆ వార్త విని అమ్మ నాన్న నెత్తి బాదుకున్నారు. నన్ను తిట్టారు. ఏం చేస్తే ఏం లాభం. అప్పటికి ఎబార్షన్ టైము కూడా దాటింది. రామనాధం చేసిన మోసానికి తట్టుకోలేకపోయాను. పెళ్ళయి అది దాచి పెళ్ళాంకంటే అందగత్తెను కనక అనాయకంగా వచ్చిన దాన్ని అనుభవించి వెళ్ళాడన్న మాట తలుచుకుంటుంటే ఒళ్ళు భాగ్గుమండేది. అమ్మ నాన్న వున్న వూర్లో అందరికి తెలుస్తుందని దూరంగా పిన్నిగారి వూరు తీసికెళ్ళి ఆ బరువు దించారు. పిల్ల పోయిందని చెప్పారు తెలివి వచ్చాక నాకు. నిజమనుకున్నాను. ఆ సంఘటనతో అదో రకం విరక్తిలో పడి పెళ్ళికి ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. బి.ఎల్. చదివి నాన్నగారి ప్రాక్టీస్ అందుకున్నాను. మిగతా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేవరకు అమ్మ నాన్న ఆఖరి వరకు పెళ్ళి చేసుకోమని కోరారు. ఆఖరికి విసుగెత్తి వురుకున్నారు.
నాన్న పోయేటప్పుడు పశ్చాత్తాపంతో తను నా మంచికోసం చేసినపని చెప్పారు. అపుడు వెళ్ళి సరోజని తెచ్చుకున్నాను. ఇది కధ....రూపా! నీవు వచ్చిన మొదటి రోజున నీ కధ వినగానే నా కధ గుర్తుకు వచ్చింది. నీ ధైర్యానికి చాలా అనందం కల్గింది. నికందుకే సహాయపడాలని, ఏమైనా నిన్ను ఆదుకోవాలని, నా సరోజ పడిన కష్టం మరో బిడ్డ పడకూడదని నీ తరపున నిలబడ్డాను" అంది సుమతి నిట్టూర్చి.
రూప కేసు తీర్పు ఆనాడే. కోర్టు కిటకిటలాడుతోంద
ప్రెస్ రిపోర్టర్లు జడ్జిమెంటు కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. సుమతి, రూప, విశ్వనాధం, పద్మావతి ఆరాటంగా కాకపోయినా కుతూహలంగా ఎదురు చూడసాగారు.
సురేష్ , రామనాధంగారల మొహాలు కళతప్పి వున్నాయి. పదిన్నరకి జడ్జిగారు వచ్చి సీటులో కూర్చున్నారు. మరొక కేసు ఏదో జడ్జిమెంటు చదివాక రూప కేసు జడ్జిమెంటు చదివారు.
"ఈ కేసులో వాది కుమారి రూప, ప్రతివాది సురేష్ కుమార్ల తరపున ప్రాసిక్యూషన్ లాయర్ శ్రీమతి సుమతి, డిఫెన్స్ లాయరు శ్రీ రామనాధంగార్ల ఆర్గ్యుమెంటు , వాది , ప్రతివాదుల తరుపు సాక్ష్యాలు పరిశీలించడం జరిగింది. ప్రతివాది సురేష్ కుమార్, కుమారి రూప ఇద్దరూ కల్సి తిరిగినట్లు ప్రేమకలాపాలు జరిపినట్లు సాక్షుల సాక్ష్యాల వల్ల తెలుస్తోంది. ప్రతివాది కుమారి రూపని పెళ్ళడతానని ముందు చెప్పలేదు, అలా రుజువు పరచడానికి కుమారి రూప దగ్గిర సాక్ష్యాలు ఏమీలేవు. అయినా సురేష్ కుమారే కోర్టులో ఆమెతో కలిసి ప్రేమకలాపాలు జరిపినట్టు అంగీకరించాడు. కుమారి రూపతో అతను పూర్తిగా బలవంతం మీద కాక ఆమె కూడా ఇష్టపురకంగానే కొంతవరకు అంగికరిచినందువల్ల ప్రేమ కలాపాలు జరిపాడు.
సెక్స్ సంబంధం మాత్రం వాది భయపడి అంగికరించనందువల్ల అది మాత్రం కొంత బలవంతం మీద జరిగినట్టు, కుమారి రూపని వివశురాలిని చేసి వశపరుచుకున్నట్లు కుమారి రూప సాక్ష్యం వల్ల తెలుస్తోంది.
కుమారి రూప ఇంకా మైనర్ అయినందువల్ల సురేష్ కుమార్ ఆమెతో అక్రమ సంబంధం కల్గి వుండడం సెక్షన్.....ప్రకారం నేరం, జరిగినదానిలో ఇద్దరూ బాధ్యులైనా కుమారి రూప నెలతప్పి అతన్నీ పెళ్ళి చేసుకోమని కోరినా అతను నిరాకరించకుండా పెళ్ళి చేసుకుని వుంటే ఈ సమస్య కోర్టువరకు రాకుండానే పరిష్కారం అయివుండేది. ప్రాసిక్యూషన్ లాయర్ శ్రీమతి సుమతి అన్నట్టు యిద్దరూ చేసిన నేరంలో స్రీ ఒకతే శిక్షింపపడడం ఆనాది ఆచారం.
కానీ ఈనాడు ఆ ఆచారం మారాలనే శ్రీమతి సుమతిగారి వాదనలో సబబు వుంది. కానీ ముందు ఒక స్రీ ఇష్టపడి పురుషునితో ప్రేమకలాపాలు జరిపి ఆ పిమ్మట పురుషుడు మోసం చేస్తే బలహీనతకి లోబడడం స్రీ తప్పు కనక ఏ న్యాయస్థానానికి ఆ పురుషుని శిక్షించే హక్కులేదు. బలవంతాన మానభంగం చేస్తేనే అది 'లా' కి విరుద్దమయి ఆ పురుషుడు శిక్షర్హుడు అవుతాడు. ఈ కేసులో కుమారి రూప మైనర్ అయినందున సురేష్ కుమార్ మైనరయిన ఆడపిల్లతో అక్రమ సంబంధం కల్గినందువల్ల అతను శిక్షర్హుడు. కోర్టు కేసు అంతా పరిశీలించాక ప్రతివాది సురేష్ వాది కుమారి రూపని పెళ్ళాడాలని కోరుతూ అతను చేసిన పనిని అదే శిక్షగా నిర్ణయించింది. ప్రతివాది సురేష్ కుమారి రూప 'పెళ్ళాడడానికిష్టపడని పక్షంలో అతనికి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తుంది కోర్టు. ఈ రెండింటిలో ఏ శిక్ష కావాలో ప్రతివాది నిర్ణయించుకోవచ్చు.
"ప్రాసిక్యూషన్ లాయర్ శ్రీమతి సుమతి తన క్లయింట్ కుమారి రూపకి పుట్టబోయే బిడ్డని అక్రమ సంతానంగా కాక సంఘంలో స్థానం కల్పించి ఆ బిడ్డకి న్యాయం జరిగేటట్టు చూడాలని కోరారు. మానవతా దృష్ట్యా కోర్టు వారి సానుభూతి అలాంటి బిడ్డ మీద వున్నా వివాహం కాకుండా పుట్టిన బిడ్డని అక్రమ సంతనంగానే సమాజం గుర్తిస్తుంది. వివాహం కాకుండా పుట్టిన బిడ్డని తండ్రి అస్తిలోను హక్కు వుండదు. ఈ న్యాయ సూత్రాలు మర్చి వేసే హక్కు ఈ కోర్టుకి లేదు. అలాంటి హక్కులు కావాలంటే రాజ్యాంగం, న్యాయ సూత్రాలు తిరగ రాయాల్సి వుంటుంది.