Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 27

 

                                                    16

 

    సీతని చూడటానికి ఎవరైనా వస్తే ముందే రామచంద్రం పక్కింటి రాధామ్మగారితోనో, ఎదురింటి అలివేలమ్మతోనో రమ్మని చెప్పేవాడు. అది పెళ్ళిళ్ళ సీజను కావటంతో రాధమ్మ, అలివేలమ్మ పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయారు. సాయంత్రం సీతని చూడటానికి పెళ్ళివారు వస్తున్నారు. పెద్దవిడిగా ఏ అడదిక్కుని పిలవాలో రామచంద్రంకి తెలియలేదు. చాలామందితో పరిచయం వున్నా పిలిచేంత చనువు లేదు. పిలిస్తే వాళ్ళు విసుక్కుంటారేమోనని భయం.

 

    "సమయానికి ఎవరూ లేరమ్మా! ఏం చేయాలి? అన్నాడు రామచంద్రం చేతులు నలుపుకుంటూ.

 

    "ఎవరూ లేకపోతెనేమి నాన్నా! ఇదువరకంత వాళ్ళొచ్చి చేశారు" అంది సీత.

 

    "అదికాదు సీతా" ఏదో చెప్పబోయాడు రామచంద్రం.

 

    "మీరేం దిగులు పడకండి నాన్నా " స్థిరంగా అంది సీత.

 

    సీత ధైర్యం రామచంద్రంకి శక్తి వచ్చింది. దేముడి మీద భారం వేసి మిన్నకుండిపోయాడు.

 

    నాలుగున్నర దాటాక పెళ్లివారు సీతని చూడటానికి వచ్చారు. వాళ్ళోచ్చేసరికి సీత బజారు నుంచి స్వీటు, హాటు తెప్పించి వుంచింది. కాఫీ డికాషన్ తీసి ఉప్మా చేసింది. ముందుగది సర్ది చాప ఓ పక్కన వేసి కుర్చీలు వేసి రౌండ్ టేబుల్ మీద గాజుపాత్రకి గుప్పెడు ఊదు కడ్డిలు వుంచింది. గుమ్మాలకి కర్టన్లు మార్చింది. తనూ తయారయింది. ఉన్నంతలో మంచి చీర కట్టుకుంది జడలో జంట గులాబీలు తురుముకుంది.

 

    పెళ్ళిచూపులకి వచ్చినవాళ్ళు నలుగురు. పెళ్ళికొడుకు సుందరమూర్తి, అతని అక్క, బావ ఓ స్నేహితుడు.

 

    వాళ్ళు రావడంతోనే జయ చేత కాఫీ ఫలహారాలు పంపింది సీత.

 

    కాసేపటికి "అక్కని రామ్మనమ్మా?' అని జయతో చెప్పాడు రామచంద్రం.

 

    నెమ్మదిగా వచ్చి చాపమీద కూచుంది సీత.

 

    సీతని చెయ్యిపట్టుకుని నడిపించుకు రావటానికి సీత బదులు మాట్లాడటానికి, సీతకి సలహాలివ్వటానికి సీతని మించిన పెద్దవాళ్ళు ఆ ఇంట్లో ఎవరూలేరు. ఆ సమయంలో ఎవరూ రాలేదు. పెళ్ళిచూపుల తతంగంలో ఏ ఆడపిల్లా తనంతట తానుగా తయారయి, వచ్చి కూచొదు ఆ సమయంలో సిగ్గు బిడియం అవరించాగా కన్నతల్లో, తల్లిలాంటి ముత్తయిదువో తోడుండాలి. ఉంటారు కూడాను, సీత దురదృష్టం సీతే తల్లి, సీతే ఓ ముత్తయిదువ సీతే పెళ్ళికూతురు, అప్పుడు అన్ని సీతే అయింది. అచారా వ్యవహారాలూ, సంప్రదాయాలు గల ఈ దేశంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. భగవాన్ " అనుకుంది సీత చాప మీద కూర్చున్నాక.

 

    పెళ్ళివారు కొన్ని ప్రశ్నలు అడిగారు సీతని.

 

    "నువ్వేమయినా అడుగుతావా?" సీతని అడిగారు.

 

    "ఉహూ" అంది సీత.

 

    తన పక్కన ఎవరూ లేరని సీత సిగ్గుపడుతూ తల వంచుకు కూర్చోలేదు. అలా అని తల ఎత్తుకుని లేదు. మధ్య మధ్య సుందరముర్తిని, మిగతా వారిని చూస్తూనే వుంది.

 

    "ఇంకా లోపలికి వెళ్ళమ్మా" అంది సుందరమూర్తి అక్కయ్య లేచి లోపలికి వచ్చేటప్పుడు సుందరముర్తినోసారి చూసింది. అతను తననే చూడటంతో టక్కున మొహం దించుకుని వచ్చేసింది సీత.

 

    రామచంద్రం వాళ్ళతో మాట్లాడేటప్పుడు రాజు అక్కడే వున్నాడు. కుర్రాడు కాబట్టి ఏమి మాట్లాడలేదు. కొద్దిసేపు ఆగి లోపలికి వచ్చాడు. వాళ్లింకా మాట్లాడుకుంటూనే వున్నారు ముందు గదిలో.

 

    'అక్కా! అతనెలా వున్నాడు?" అడిగాడు చాలా నెమ్మదిగా.

 

    "సీత ఏం జవాబు చెపుతుంది" ఎందుకు అన్నట్లు చూసింది.

 

    "అక్కా వాళ్ళకి నీవు నచ్చవుట, వ్యవహారంలోకి దిగారు చెప్పాడు రాజు.

 

    ఉలిక్కిపడింది సీత.

 

    ఏ పెళ్ళివారు అప్పటికప్పుడు నిర్ణయం చెప్పటం, కట్నకానుకలు మాట్లాడుకోవటం ఇంతవరకు జరగలేదు.

 

    "చాలా మామూలుగా వున్నాడు అతను,'  రాజు అన్నాడు .

 

    'అవును' అనుకుంది సీత.

 

    'మరి నీకు నచ్చాడా " అక్క అభిప్రాయం తెల్సుకోవడానికి రాజు ఆతృత పడ్డాడు రాజు.

 

    అంతవరకు నోరు మూసుకున్న జయ "అక్క పక్కన ఆ అబ్బాయేం బాగుండడు. విడిగా చూస్తే ఫరవాలేదు కానీ...."అంటూ దీర్ఘం తీసింది.

 

    "రూపక్కా, రవి బావ జంట చక్కగా కుదిరింది. నీ పక్కన అతను పిలగా కనిపిస్తాడు. మాంచి హైటు తగిన లావూ వుంటే గాని ప్రక్కన ఎవరూ బావుండరు"అన్నాడు రాజు.

 

    వీళ్ళకేం జవాబివ్వాలో సీత కర్ధంకాలేదు. తనని చూసేందుకు వచ్చిన అతను సామాన, రూపురేఖలతో ఉన్నాడు అతను చేసే జాబ్ ముందే తెలుసు ఓ కంపెనీలో క్లర్క్ఆస్తి అంటూ పెద్దగా లేదు. చిన్న ఇల్లుందట.    

 Previous Page Next Page