Previous Page Next Page 
కాలనాగు పేజి 25

    భెంచిమీద నిటారుగా పడుకోబెట్టి పరిక్ష చేశాడు.

    'సరే! చికిత్స ప్రారంభిద్దామా?"

    "ఏమిటి యీ జబ్బు !"

    "పేరేదై తేనేంలే! నరాల జబ్బు! దీనికి హొమియోలో అయితే ఆర్నెల్లు, అల్లోపతిలో అయితే బాగయ్యేదాకా "ట్రీట్" యివ్వాలి _'నవ్వేడు దేవనాథ్.

    'డాక్టర్!' బాధగా పిలిచాడు ధర్మరాజు "అన్నాళ్ళు నేనీ బాధని అనుభవించాలా?' అడిగాడు రుద్ద కంఠంతో.

    "అక్కర్లేదు. పది లేదా నెలరోజుల్లో నయమవుతుంది!"

    "ఎలా ?"

    "చెప్పాగా, సూది వైద్యం_ఆక్యుపంక్చర్_' అని ఎసిస్టెంట్? కేక వేశాడు. గోపాల్ వచ్చాడు. 'సర్ ని బల్ల వద్దకి తీసుకెళ్ళు.నే వస్తున్నాను అని ధర్మరాజుని గోపాల్ వెంట పంపేడు.

    పదిహేను నిమిషాలు అక్యుపంక్చర్  పేషెంట్స్ ని పలికరించి మిషన్ కి ఇద్ద రేసి చొప్పున రెండు బల్లలమీద పేషెంట్స్ ని పడుకోబెట్టాడు పది బెంచీలు నిండి పోయాయి. ఇపుడే వస్తానంటూ లోపలకి వెళ్లేడు.

    ధర్మరాజు ఒక్కడే ఆ ఏపార్ట మెంటులో బల్లపై పడుకున్నాడు. చొక్కా విడదీసి, డ్రాయర్ తో పడుకున్నాడు. బోరగలిపడుకో !" అన్నాడు డాక్టర్.

    తర్వాత నీదిల్స్ వేయటం ప్రారంభించాడు.

    'డాక్టర్_'

    "ఏమిటి ధర్మా!"

    'నువ్వు ఒక్కో సూది గుచ్చుతూ వుంటే ఎలా వుందో తెలుసా చేతబడి చసిన బొమ్మకి సంధి స్టానాల్లో ముల్లులు గుచ్చుతున్నట్టుగా వుందో నాకో అనుమానమోయ్. ఎవరైనా నాకు చేతబడి చేశారోమోనని భయవుంది'

    పకపక నవ్వేడు డాక్టర్.

    "ఏమిటి నవ్వుతూనే ?'

    నీలాటివాడుకూడా వాటిని నమ్ముతున్నాడంటే చిత్రంగా వుంది సుమా! అయినా బాధ మనిషిలో ఎన్నెని ఊహలు పుట్టిస్తుంది" నీడిలో వేస్తూనే వున్నాడు డాక్టర్ దేవనాథ్.

    'డాక్టర్! ఎన్ని నీడీల్స్ వేశావు!"

    "ఎంచుకోలేదు ధర్మా! గోపాల్ ని అడుగు తీసేప్పుడు చెబ్తాడు!" మొత్తం నీడిల్స్ వేసి,బ్యాటరీ కనెక్షన్స్ యివ్వటం ప్రారంభించాడు ఆయన. క్లిప్స్ వేయటం పూర్తయింది.

    "ఊఁ ఇక చూస్కో ! నీ నొప్పులు ఎగిరిపోతాయి. యు ఫీల్ రీలక్స్ డ్ ఆఫ్టర్ డి ట్రీట్ మెంట్ " కనేక్షన్స్ యిచ్చాడు. భ్యాటరీనుంచి విద్యుత్ తీగల ద్వారా ప్రవహించి నీడిల్స్ చేరుకుంటున్నది "జామ్స్" అని నరాలు టెన్షన్ ని సంతరించుకుంటున్నాయి. "లోడ్ చాలా! చూడు ఎక్కువా!ఎలా! అడుగుతూ సర్దేడు.

    శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్లుగా వుంది.

    "కదలక! మళ్ళీ వస్తాను"

    కళ్ళు మూసుకున్నాడు ధర్మరాజు.

    డాక్టర్ పేషెంట్స్ వద్దకి వెళ్ళిపోయాడు_"

    ఇరవై అయిదు నిమిషాలు గడిచాయి.

    గోపాల్ వచ్చి బ్యాటరీ ఆఫ్ చేసి, కనక్షన్స్ తీసి, ఒక్కో నేదిల్ తీస్తూ స్పిరిట్ దూదితో ఆ స్పాట్ ని అద్దేస్తున్నాడు. రెండు నిమిషాల్లో తీసేశాడు అన్నీ. "మీరు వెళ్ళచ్చు!" అన్నాడు గోపాల్.
 
    లేచి నుంచున్నాడు ధర్మరాజు.

    నోప్పులన్నీ ఒక్కసారిగా చేత్తో తీసేసినట్టుగా రిలీఫ్! ఎంత హాయిగా వుంది. చికిత్స  చేయించుకోవాలి అనుకున్నాడు.

    డాక్టర్ తో మాటాడి ఇంటికెళ్ళాడు

    ఆయనటు వెళ్ళగానే వచ్చాడు ఆదిత్య.
   
   
                                                                           25


    "ఎవరో ఒక టీచర్ వుండేవాడట. అతను రోజూ క్లాసులో స్టూడెంట్స్ చావబాదే వాడట! అతనికి ఆదివారం అంతే ఎలర్జీ సెలవులంటే మహా ఎలర్జీ _ఎందుకో తెలుసా?"

    అడ్డంగా తాలాడించేడు నాగరాజు

    చిదానందయోగిలా నవ్వేడు అతను

    "ఊహూ నీకు తెలీదు. నీకు మాత్రమే తెలీదు. మిగతా అందరకీ తెలుసు. అందుకే నే చెప్పాను_"
    "ఎందుకండీ గురువుగారూ!"

    "మొద్దుబుర్ర!" తలపై ఓ మొట్టికాయ వేశాడు వైద్యనాథన్ నవ్వుతూ.

    "కన్నతల్లి కొట్టినా కడుపునిండా పెడుతుందిట! అలాగే తిట్టినా, కొట్టినా, మొట్టికాయ వేసినా నాకేం పర్లేదు ఐ వంట సంధ్య_"

    "సరే! ఇపుడు ఆ యింట్లో ?"

    'నీ ముఖం_ ధర్మరాజు  యింట్లో_"

    'ధర్మరాజుకి కీళ్ళ నొప్పులు_డాక్టర్ వద్దకి వెళుతున్నా రోజులో ఇరవై మూడు గంటలు అరవై నిమిషాలు నిమిషానికి అరవై సెకన్లు సెకండు కి' ఇరవై మూడు గంటలూ యమబాద అనుభవిస్తున్నాడు. డాక్టర్ చికిత్స చేసిన ఆ కొద్దిసేపు, ఆ తర్వాతా కొద్దిసేపు అతనురిలాక్స్ అవుతున్నాడు"

    "వెరీగుడ్! ఇంకా తీవ్రం చేద్దామా?"

    "ఊఁ"తన ఎదురుగా వున్న బొమ్మకి మరికొన్ని ముళ్ళు కుచ్చేడు వైద్య నాదాన్ 'కడుపులో కుచ్చానా? మరికాస్త కింద గుచ్చితే_ యూరిన్ ట్రబుల్ వస్తుంది బొమ్మని తీప్పేసి కుచ్చితే కుడ్నిప్ ట్రబుల్ వస్తుంది" అన్నాడు
    'గురూ! నీ యిష్టం వరాలిచ్చే దేవతని వరమిమ్మని అడుగుతాం. ఇంకా ఇంకా వరాలు ఇస్తానంటే వద్దంటామా?'

    "ముర్ఖుడా! ఇది వరం కాదు శాపం! వాళ్ళకి నరకం! నాకు పాపం! ఈ పాపం చేసినందుకు నేనెంతో తపస్సు చేయాలి, దాన్నంత దేవి పాదాల ముందు పోయాలి."

    లెంపలు వేసుకున్నాడు ఆ తీవ్రత చూసి

    'తప్పు గురుగారూ' అన్నాడు నాగరాజు

    'వెళ్ళు!' అన్నాడు వైద్యనాథన్'

 Previous Page Next Page