Previous Page Next Page 
జీవాత్మ పేజి 26


    ఈ దశలో వుండలేక తిరుగుతూ మనవశరీరం దొరికితే బాగుండునని తపన చెందుతూ ప్రయత్నం చేస్తుంటాడు. బ్రతికి వుండగా తనకు అపకారం చేసిన వాళ్ళకు ప్రత్యుపకారం చెయ్యటానికి, కామవాంఛను తీర్చు కోవటానికి, క్షుత్పిపాసలు పోగొట్టుకోవటానికి మనుష్యులను పట్టుకుని పీడిస్తూ వుంటాయీ జీవులు. అయితే ఆ అవకాశం అందరికీ రాదు.
    
    మరికొంతమంది ఈ భూమిక దాటి సుదూరంగా వున్న నరక లోకానికి వెడతారు.
    
    భూమి నుండి అది ఎనభై ఆరువేల యోజముల దూరంలో వున్నట్లు పురాణాలలో చెప్పబడింది. భూమిని ఆవరించి భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములున్నవి.
    
    నరకలోకం భువర్లోకంలోని అడుగుభాగం, భూమికి దక్షిణంగా వుంటుంది. ఆ పక్కనే నైరుతి దిక్కున ప్రేతాలయం వుంటుంది. నరకంలోనికి ప్రవేశించైనా జీవులు తాము ఏ పాపములైతే చేశారో ఆ పాపములను బట్టి అక్కడ శిక్షలు పొందుతూ వుంటారు.
    
    ఉదాహరణకు స్త్రీలను హింసించి, తగలబెట్టి చంపినవారికి కొన్ని వందల సంవత్సరాలపాటు అదే హింసా, దహనబాధ అనుభవించక తప్పదు. మానవశరీరం ఒక పరిమితి దాటితే బాధను భరించలేదు. స్మృతి తప్పటమో, మరణించటమో జరుగుతుంది.
    
    కానీ ప్రేతాత్మ బాధలననుభవించే యాతనా దేహం. దానికి చావు లేదు. ఎంత బాధయినా అనుభవించి తీరాల్సిందే.
    
    స్మృతి తప్పటమో, చావటమో అన్న స్థితి ఉదయించదు. పాపానుభావం పూర్తయిందాకా ఈ నరకయాతనను అనుభవించక తప్పదు.
    
    ఇనుప ముక్కుల కాకులు, తప్తతైల కటాహాలు, ఇంగలమున కాగిన మంగలములు పాపులకు ఎదురయ్యే సుసత్యాలు. రౌరవము, మహా రౌరవము, కాల సూత్రము, కుంభీపాకము, అంధలే మిశ్రము, సంహారము మొదలైనటువంటి నరక విభేదాలు.
    
    యమధర్మరాజు దండధరుడై, దంష్ట్రా కరళావదనుడై, క్రోధ రక్తాంత చనుడై దుష్టుల భరతం పడతాడు.
    
    ఈ బాధలన్నీ అనుభవించిన తరువతః పుణ్యమేమైనా వుంటే జీవుడు పర్లోకపు పైభాగానికి వెడతాడు.
    
    ఈ బాధలను అనుభవించనవసరం లేని జీవుడు నరక భూమికకు కుండానే సరాసరి పైకి వెడతాడు.
    
    ఈభూమికలో లలితకళాత్మకామిన అనుభూతులెక్కువగా వుంటాయి. సంగీతమో, నాట్యమో, విద్యాధరులు, గంధరవులు, అప్స రసలు, విందులూ, వినోదాలు, విహారాలు- అంతా ఆనందమాయ మయిన లోకమిది.
    
    తాను చేసుకున్న సుకృతం పూర్తయినదాకా జీవుడీ లోకంలో వుంటాడు. చాలా తక్కువగా పుణ్యం చేసినవాళ్ళు భువర్లోకంలో కొంచెం క్రింద పిశాచ లోకంలో నివసిస్తారు.
    
    వీరి శరీరాలు ప్రేత శరీరాలు కావుగానీ సౌందర్యవంతమైన దివ్య శరీరాలు కూడా కావు. జుంజోరు వెంట్రుకలతో, బండి కందెన చాయ కాయములతో, గచ్చకాయల వంటి కనుగ్రుడ్లతో, గాడిద గొంతుల వంటి వికృత కంఠస్వరములతో ఉంటూ కర్మానురూపమైన ఫలితములను అనుభవిస్తారు.
    
    అత్యుత్తమమైన పుణ్యకార్యాలు చేసినవారు, మహాతపస్సు చేసిన వారు భువర్లోకం దాటి పైకి వెళ్ళిపోతారు.
    
    అందుచేత అన్ని జన్మలకంటే అత్యుత్తమమైన మానవజన్మలో ప్రతి జీవి సత్ర్పవర్తనుడై ఉండాలి. భూరి విరాళము లివ్వనవసరం లేదు. తనకు తోచినంత లేనివారికి దానం చేయాలి.
    
    మనస్సు, వాక్కు, కర్మలపరంగా శుద్దిమంతుడైతే అతను చేసుకున్న పుణ్యము వెయ్యింతలై అతని మరణానంతరము మంచి లోకాలకు తరలిపోగలడు.
    
    మానవజీవితం క్షణభంగురమైంది. ఆ తరువాత జీవితమే సుదీర్ఘ మైనది. ఇది తెలియని అమాయకులు కామ, క్రోధ, మద మాత్సర్యాదులై ప్రవర్తించి వందల వందల సంవత్సరాలు పైలోకాలలో దుర్భరమైన బాధలు అనుభవిస్తారు' అని వివరించాడతను నాకు" అంటూ ఆగాడు వరప్రసాదం.
    
    అతను చెబుతున్న ఒక్కొక్క విశేషం అభిరాంని సంభ్రమా శ్చర్యాలలో ముంచెత్తుతున్నాయి, నిశ్శబ్దంగా వున్న అ ఆగదిలో వాల్ క్లాక్ చేస్తున్న ధ్వని తప్ప దాదాపు శబ్దరహితంగా వుంది.
    
    ఆ నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు వరప్రసాదం.
    
    "టిబెట్ హిమాలయాలలో నేను చూసిన అద్భుతమైనదీ, అపూర్వమయినదీ ఓ వృద్ద భౌద్ధభిక్షువు యోగప్రక్రియ ద్వారా శరీరాన్నివిడిచి పైలోకాలకు పయనించడం అంటే మరణించడం. ఆ సంఘటన తిలకించడం నా జీవితంలో మర్చిపోలేను. దీనికి నాకు సహాయపడినది ఓ టిబెటన్ లామా.
    
    టిబెటన్ హిమాలయాల పరిసరాలలో తిరుగుతున్న నాకు, అతను తారసపడి, నా గురించి వివరాలు అడిగాడు. అప్పటివరకూ నేను చూసిన చిత్రాలు, విచిత్రాలు చెప్పానతడికి. నాలోని జిజ్ఞాస గమనించి- "అయితే నీకు యిప్పటిదాకా గోచరించని మహాద్భుతాన్ని చూపుతాను. నాతో రా" అని తనవెంట నన్ను తీసుకువెళ్ళాడు.
    
    "అది మంచుకొండలపైన నెలకొని వున్న టిబెట్ పీఠభూమిలోని ఒకానొక యోగుల ఆశ్రమం మేం ఆశ్రమంలోనికి ప్రవేశించేసరికి గుండ్రంగా కూర్చున్న టిబెటన్ లామాలు మరణిస్తున్న ఒక జీవికి ఆఖరి క్షణాల్లో జరిపే యోగప్రక్రియ నిర్వహిస్తున్నారు.
    
    శతాబ్దాలుగా యోగప్రక్రియల్లో సిద్దహస్తులైన 'పరమ గురువులు' రూపొందించిన కార్యక్రమమది. అది 'బ్రహ్మయజ్ఞం' లేక 'ఉత్తర ప్రక్రియ'.
    
    తుమ్మెదనాదంలాంటి శబ్దం 'ఝుమ్మంటూ' లయబద్దంగా ప్రతిధ్వనిస్తోంది. ఆ గుహలో అగరవత్తుల పొగ పైకి లేస్తూ ఆ పవిత్ర వాతావరణాన్ని మరింత తన్మయత్వంలోకి తీసుకెళుతోంది.
    
    ఆ మధ్యలో ఒక వృద్దుడైన బౌద్ద భిక్షువు తల ఒక వంక వెనక్కి వాల్చి, నిశ్శబ్దంగా పడివున్నాడు. అతని ప్రాణం పోలేదనటానికి నిదర్శనంగా అతని ఉచ్చ్వాస, నిశ్వాసాలు కొనసాగుతున్నాయి.

 Previous Page Next Page