అన్ని డజన్ల ప్రిస్కిప్షన్లు వస్తున్నా వాటిలో ఏ ఒక్కదానిలో 'సత్యా ఫార్మా వారి డ్రగ్స్ ప్రిస్కయి బ్ చెయ్యలేదు ఎవ్వరు.
సత్యా ఫార్మా పరమనిష్ఠతో పరమహంస నడిపిన కంపెని. పరిశుద్దమైన మందులు మాత్రమే తయారు చేసే ఫ్యాక్టరి - సత్యా ఫార్మా.
అయినా సత్యాఫార్మావారి డ్రగ్స్ ని ఏ డాక్టరు ప్రిస్కైబ్ చెయ్యరు.
ఎందుకని?
ఎందుకో తెలుసు తేజస్వికి.
మందుల ప్రభావాన్ని అవి పని చేసే తీరుని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్రిస్కిషన్లు రాయడం అనేది ఇక్ష్వాకుల కాలంనాటి పద్దతి.
ఈ రోజుల్లో ఒక మందుని ఒక డాక్టరు ప్రిస్కైబ్ చెయ్యాలంటే ముందు ఆ డాక్టరుని తృప్తి పరచాలి మెడికల్ రిప్రేజేంటేటివ్.
ఆ తృప్తి పరచడం ఎలా? కేవలం తమ మందుల గురించి సమాచారంతో లిటరేచర్ తో కాదు.
తమ కంపెని మందు తాలుకు ఫ్రీ శాంపిల్స్ ఇవ్వాలి. అందమైన పెన్నులు పెన్సిళ్ళు, డైరీలు, కాలెండర్లు, నావేల్టిను , కాంప్లిమెంట్ గా ఇవ్వాలి. డాక్టర్ గారికి లెటర్ హెడ్స్, ప్రిస్కిప్షన్ పాడ్స్ అచ్చు వేయించి పెట్టాలి. మరికొంతమంది డాక్టర్లతో డీల్ చేసే విధానం వేరేగా ఉంటుంది. సంవత్సరంలో తమ మందు ఇన్ని బాటిల్స్ రాస్తే రిఫిజిరేటర్, మరిన్ని రాస్తే దిస్పెన్సరి రీమోడలింగ్, భారీ ఎత్తున తమకు బిజినెస్ చూపిస్తే కొత్త కారు - అని ప్రలోభ పెట్టాలి. వేలంపాటే అది.
ఎవరు ఎక్కువగా తనకు లాభం చేకురిస్తే వాళ్ళకు లాభం చేకూరుస్తాడు అలాంటి డాక్టర్- సహజంగానే. లివ్ అండ్ లేట్ లివ్.
మరి అమందు బాగా పని చేస్తుందా!
వెల్. అది వేరే సంగతి.
అందరూ డాక్టర్లు, ఇలా ఉంటారా అంటే ఉండరు. నిజాయితీపరులు వుంటూనే ఉంటారు. ప్రతి వృత్తిలోను కూడా. డాక్టర్స్ లో కూడా ఈ ప్రలోభనికి లొంగని వాళ్ళున్నారు. కానీ వాళ్ళ శాతం తక్కువయిపోతోంది.
ఈ రాట్ రేస్ లోకి ఈ కట్ త్రోట్ కంపిటీషన్ లోకి పరమహంస ఎప్పుడూ దుకలేదు. దాని రిజల్టు ఇప్పుడు ప్రత్యేక్షంగా కనబడుతోంది.
నో సేల్స్! నో సేల్స్! నో సేల్స్!
నో సేల్స్ నో వేర్!
కానీ పరిస్థితులు ఎల్లకాలం ఒకేలా వుండవు. రేపు శశికాంత్ ఏవో మార్పులు చేస్తాడు కంపెనీలో. చెయ్యక తప్పదు.
కానీ ఎలాంటి మార్పులు వస్తాయి?
రాబోయే రోజు లేలా ఉంటాయి?
ఆలోచిస్తూ నిలబడిపోయాయి తేజస్వి.
పదినిమిషాల తర్వాత మళ్ళీ తలఎత్తి చూశాడు దాల్మియా, "చెప్పండి తేజస్వి! ఏదన్నా ప్రత్యకమైన పనా?"
తల;పంకించి , తను వచ్చిన పనేదో చెప్పడం మొదలెట్టాడు తేజస్వి.
12
శశికాంత్ అలా కోపంతో వెళ్ళిపోయాక, నిస్తేజంగా అక్కడే కూలబడిపోయింది సౌమ్య . అలా ఎంతసేపు నిశ్చలంగా కూర్చుండిపోయిందో తనకే తెలియదు.
తెల్లటి వెలుతురు విరిగి నల్లటి చీకట్లు ముసురుకోవడానికి ముందు పరిసరాలన్నీ దిగులుగా గ్రే కలర్ కి మారుతున్నపుడు ఎవరో కుదిపినట్లు ఒక్కసారిగా స్పృహ వచ్చినట్లయింది సౌమ్యకి.
అప్పుడు మొదటిసారిగా స్పురించింది ఆమెకి, శశికాంత్ తో తను ఎంత పరుషంగా మాట్లాడిందో.
"మీరు మనిషా? పశువా?
ఎంత పొరపాటుగా మాట్లాడింది తను! ఎంత కష్టంగా ఉంటుందో ఆయనకు దీనివల్ల. తన మీద మనసు విరిగిపోలేదు కదా?
అరచేతిలో చెమట పట్టింది సౌమ్యకి.
శశికాంత్ కి పంతం ఎక్కువ. అతను చిన్నప్పట్నుంచి కూడా అంతే.
చిన్నప్పుడు ఒకసారి , కూరలు తరుగుతున్న వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి మ్యాట్నికి వెడతాను. డబ్బులిమ్మన్నాడు శశికాంత్.
వద్దంది వాళ్ళమ్మ.
అంతే!
తన కోపం చూపించడానికి కత్తిపీటని కాలితో తన్నాడు శశికాంత్. ఆ దెబ్బకు నిలువుగా చీలిపోయింది అతని పాదం. ఆ రక్తం చూసి వాళ్ళమ్మ స్పృహ తప్పి పడిపోయింది.
తరువాత డాక్టర్లు, హాస్పిటల్, గొడవా-
అవన్నీ చిన్నతనపు చేష్టలని, శశికాంత్ మారి ఉంటాడని అనుకుంది తను.
అదంతా తన భ్రమ అని ఇప్పుడు తేలుతుంది. అతను పిసరంత కూడా మారలేదు.
అదే మంకుతనం. అదే పట్టుదల.
అదే మూర్ఖత్వం కూడా.
తను అనుకున్నది అక్షరాల జరిగితిరాలన్న తత్వం.