Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 26

 

    "హోటల్లో కాఫీ తాగాటానికో టిఫిన్ తినటానికో వరదాయ్ వెళ్ళి వుంటాడు. ఇప్పుడు తనని చూస్తే వురుకోడు. కాఫీ తాగుదాం పద అని జబ్బ పుచ్చుకుని మరి లక్కెళతాడు. తనవల్ల వాడికి అనవసరం కర్చు కాకూడదు తను వాడికి కాఫీ టిఫిన్లు యిప్పించే స్టితిలో లేదు. అలాంటప్పుడు వాడు కస్టపడి సంపాదించుకున్న డబ్బులో తను వేస్టుగా వేలు పెట్టకూడదు. ఈ రాజులుగాడు తనకి ఏదో ఒక చిల్లర మల్లర ఉద్యోగం యిప్పించినా చాలు. వాడికి జన్మంతా రుణపడి వుంటాడు...."


    హోటల్ ఇంద్రభవన్ పక్కగా నుంచుని గౌతమ్ ఆలోచిస్తున్నాడు. తను పరధ్యాన్నంగా వుంటే వరదరాజులు హోటల్లో నుంచి బయటికి వచ్చి అటునుంచి వెళ్ళిపోతే వాడిని పట్టుకోవడం చాలా కష్టం. ఎన్నిసార్లు రూముకి వెళ్ళినా దొరకటం లేదు. హోటల్ లోంచి రాంగానే పట్టుకుందామంటే ఎరా! నన్ను చూసి బయటనే వుండిపోయవా! నా దగ్గర నీకు ముఖ మాటం ఏమిటి! పద కాఫీ తాగుదువుగాని అని లక్కెళతాడు, కాబట్టి వరదరాజులు హోటల్ లోంచి బయటికి వచ్చి కాస్తా దూరం వెళ్ళిం తరువాత అప్పుడు వెళ్ళి మాట్లాడించాలి. వరదాయ్ ని అప్పుడే చూసినట్లు ఫోజు పెట్టాలి. నా ఉద్యోగం ఏం చేశావురా! మీ సెట్ ఏమన్నాడు! అని అడగాలి. లేకపోతే తను వాడితో కలిసి వెళ్ళి ఉద్యోగం ఏదైనా పరవాలేదు చేస్తానని అడగాలి.

 

    గౌతమ్ హోటల్ వైపు చూస్తూ అలా ఆలోచిస్తూనే వున్నాడు.

 

    హోటల్ ఇంద్రభవన్ కి వెళ్ళిన వరదరాజులు బయటికి రాలేదు.

 

    సమయం గడిచి పోతున్నది.

 

    తను చాలాసేపు నున్చున్నానన్న అనుమానం గౌతంకి వచ్చింది. చేతికున్న డొక్కు వాచిలో టైము చూసుకున్నాడు. అరగంట అంటే అతను అక్కడి నుంచుని సరిగ అరగంట అయింది.

 

    "అరగంట సేపు హోటల్లోనా! కాఫీ టిఫిన్ పూర్తీ చేయడానికి పదినిమిషాలు చాలు చపాతీ తింటున్నడా! ఉహూ మసాలా అట్టు అయి వుంటుంది. అట్టు అర్దరిచ్చిం తరువాత కాల్చి తెచ్చేసరికి కావల్సినంతా ఆలశ్యం కానే అవుతుంది. చదువుకునే రోజుల్లో వరదాయ్ అంటుండేవాడు, నాతో వరదరాజులు పందెంకాయి. అయినా సరే నేను పట్టుమని గంట చదవలేను. హోటల్ కి తీసుకుకెళ్ళి పందెంకాయి. నువ్వన్నా అరిపోవాలి హోటల్ వాడన్నా బాగుపడాలి. అనేవాడు. మధ్యాహ్నం భోజనం చేయలేదేమో అవార టిఫిన్ తింటున్నాడెమో!

 

    గౌతం ఆలోచనలు అలా సాగుతున్నాయి. వరదరాజులు మాత్రం హోటల్లోంచి బయటికి రాలేదు. అతని దృష్టి మాత్రం హోటల్ మీదనేవుంది. కనుక వరదరాజులు హోటల్లోంచి బయటికి వచ్చినట్లయితే గౌతం కల్లబ్దాల్సిందే. వరదరాజులు నల్లపుసెం కాదు. కంటపడకుండాపోవడానికి. హోటల్లోకి వెళ్ళిన వరదరాజులు హోటల్లోంచి బయటికి రాలేదు. అంతవరకూ ఖాయం. మరి యింతసేపు లోపలేవున్నడా? వుంటే ఏం చేస్తున్నట్లు?

 

    గౌతంకి అర్ధంకాలేదు.

 

    సరిగ గంట వెయిట్ చేసి అతను యిహ ఆగలేక హోటల్లోకి వెళ్ళాడు. జేబులో రుపాయివుంది. దర్జాగా కాఫీ తాగి చిల్లర డబ్బులు తీసుకుని రావచ్చని అనుకున్నాడు.

 

    పేరుకి హోటల్ ఇంద్రభవన్. జనంమాత్రం లేరు. గౌతం ఖాళి టేబుల్ ఓ మూలగా వున్న చోట చూసుకుని కూర్చున్నాడు. సర్వర్ దగ్గరకు వచ్చేలోపల నలువైపులా కలయచుశాడు. వరదరాజులు అనే శాల్తి అక్కడ కనిపించలేదు.

 

    హోటల్లో వరదాయ్ లేడు. వాడేమి ఆడపిల్ల కాదు యిక్కడ మాయం కావటానికి బయటికివెళితే తను చూడలేదేమో! దృష్టి అంతా హోటల్మీదనే వుంచాడే! మరి వాడు హోటల్లోంచి బయటికివస్తే తనకంటబడలికదా! అలా జరగలేదే....?

 

    జేబులోవున్న ఒకే ఒక్క రూపాయి బిళ్ళని పైకి తీసి ఎదుటి టేబుల్ మీద బొమ్మ బోరుసువేస్తూ ఆలోచిస్తున్న గౌతమ్ దగ్గరకు సర్వర్ వచాడు.

 

    "ఏం కావాలి?" సర్వర్ అడగటంలో రూపాయి బిళ్ళని టేబుల్ మీద వుంచి తలపైకి ఎత్తాడు అతను.

 

    సర్వర్ చూపు రూపాయిబిళ్ళమీద వుండటం చూసి తన దగ్గర రూపాయి మాత్రమే వుందనుకుంటాడనుకుని
చటుక్కున రూపాయిబిళ్ళ తీసుకుని జేబులో వేసుకున్నాడు. "ఏమున్నాయి?" అన్నాడు పెద్ద టిఫిన్ తినే వాడిలాగా ఫోజుపెట్టి.

 Previous Page Next Page