ఆ రోజు వరదరాజుల్ని కలుసుకోవడం అతను చెప్పిన బ్లూ ఫిల్మ్ సంగతి గౌతమ్ నమ్మలేదు. ఓ నాటి ప్రాణ స్నేహితుడు కాబట్టి నమ్మినట్లు నటించాడు, ఆ తర్వాత నాలుగయిదు సార్లు ఇరువురూ కల్సుకున్నారు. పాత సంగతులు ముచ్చటించుకున్నారు.
"నీవు చేసే ఉద్యోగం లాంటిది ఆఖరికి వందరూపాయలొచ్చినా చాలు ఏదో ఒక చిరుద్యోగం చూపించి పెట్టారా వరదాయ్" అని సిగ్గువిడిచి నోరు తెరిచి అడిగాడు గౌతమ్.
"రోజులన్నీ ఒకేలాగా వుండవురా గౌతమ్, ఏదో ఒకరోజు గొప్పవాడివి అవుతావు. గొప్ప పదవిలో వుంటావు" అన్నాడు వరదరాజులు.
"అదేమో నాకు తెలియదు. న చదువు పూర్తి అయిన రోజు మొదలు ఈరోజు వరకు రోజులన్నీ ఒకేలాగా అఘోరిస్తున్నాయి. ఆడజన్మలో కొన్ని రకాల భాధలు వున్నాయి. మగవాడికి ఏవి వుండవంటారు కదా! అది చాలా తప్పు తెల్లారి లేచేసరికి మగాడి ముఖం ముళ్ళ పందిని గుర్తుకు తెచ్చేలా తయారవుతుంది."
"నీవు చెప్పేది గడ్డం సంగతేనా! మన మగవాళ్ళపరువు పోగొడుతూ మన ముఖాలని ముళ్ళ పందితో పోల్చావు
10)
కదరా నాయనా! గడ్డం మీసం లేంది మగడు ఎలా అవుతాడు! నీ గడ్డం నా కడ్డం అని ఏ అందాల భరిణో అంటే అర్ధం వుంది." గడ్డము లేకపోతె...
"నేనా వుద్దేశ్యంతో అనలేదు. బ్లేడు కర్చు గురించి ణా బాధ."
"నీ పీనాసి తనం మండిపోను. బ్లేడు కర్చు అనుకునే బదులు నీ ముఖం నీ యిష్టం. పెరిగినన్నాళ్ళు పెరగనియ్యి. నారు పోయ్యాలా నీరు పోయ్యాలా ఎరువేయ్యలా!గడ్డం నీకేం అడ్డం రా నాయనా! ఎవరన్నా అడిగితె మొక్కు అని చెప్పు. ఏం మొక్కు అని అడిగితే జాబ్ వచ్చిందాకా గడ్డంకి కత్తి అన్చనని ప్రతిజ్ఞ చేశానని చెప్పు." వరదరాజులు నవ్వుతూ వుచిత సలహా యిచ్చాడు.
"క్రాఫునేమి చెయ్యను?" గౌతం అడిగాడు.
"పెరిగినన్నాళ్ళు పెరగనియ్యి. బాగా పెరిగిన తరువాత జడో ముడో వేసుకుంటే సరిపోతుంది. అదో ఫేషన్ అయి అందరు మగవాళ్ళు నిన్ను ఆదర్శంగా తీసుకుని నీ వెను వెంట బయలుదేరి.....
"చాల్లేరా నేను సీరియస్ గా చెపుతుంటే నీవేమో చచ్చు సలహాలు కుళ్ళు జోకులు వేస్తున్నావు. అన్నయ్య గాని నాన్నగారు కాని అయిదో పదో చేతిలో పెడితో ఆ డబ్బుతో దుబ్బు క్రాపుని వదుల్చుకుని కాస్త మనిషిలా కనపడుతున్నాను. పెద్ద చింబోతులాగా తయారయానంటే యిచ్చేవాడు కూడా ఉద్యోగం యివ్వడు. నా భాధనర్ధం చేసుకుని చిన్నదో చితకదో ఓ చిరుద్యోగం చూసి పెట్టరా రాజులూ!" భాదపడుతూ అడిగాడు గౌతం.
"సరే చూస్తాను." అని వరదరాజులు మాట యిచ్చాడు.
అలా వరదరాజులు మాట యిచ్చిం తరవాత రెండు సార్లు గౌతం అతని రూంకి వెళ్ళాడు. రూం తాళం వేసి వుంది. ఆ తర్వాత యిప్పుడే వరదరాజులు కనపడటం, వరదరాజులు కంటపడిన సంతోషంలో పరిసరాలు మరచి పోయి, "వరదాయ్!" అని కేక వేయబోయాడు గౌతమ్ చెవి పక్కనే కారు హరన్ బొయ్యి మనటంతో అది బజారు అని తెలివి తెచ్చుకున్నాడు.
వరదరాజులు రోడ్డుకి అటు పక్కన వున్నాడు. గౌతం ఇటు పక్కన వున్నాడు. మధ్యలో అటూ యిటూ పోయే కార్లు, రోడ్డుదాటి అటు వెళ్ళటం ఉత్తమమైన మార్గం అనుకున్నాడు గౌతం.
తను పక్కకి చేరే లోపల తన దృష్టి పధం నుంచి వరదరాజులు మాయం అవుతడేమోనని గౌతం ఓ కంట అతన్ని చూస్తూ కొద్ది ప్రయత్నం మీద రోడ్డుమీద పరుగులెత్తే వాహనాలని తప్పించుకుని అటు పక్కకి చేరాడు గౌతమ్.
గౌతమ్ అటు చేరంగానే వరదరాజులు దగ్గరకు వెళ్ళలేదు. అల్లంత దూరానే ఆగిపోవాల్సి వచ్చింది. కారణం వరదరాజులు హోటల్ ఇంద్రభావన్ లోకి వెళ్ళటంచూశాడు. సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయాడు.