"ఎలా?" అడిగింది డాక్టర్ మధురిమ.
"అతని జ్ఞాపశక్తిని తిరిగి రప్పించటం ద్వారా" అన్నాడు నీలకంఠన్.
"దానికి కొంత సమయం పడుతుంది. ఐ విల్ ట్రై లెవల్ బెస్ట్" అంది డాక్టర్ మధురిమ తను కూడా ఏదో ఆలోచిస్తూ.
"ఓ.కే డాక్టర్! ఐ లవ్ ట్రై మై లెవెల్ బెస్ట్" కారిడార్లో గబగబా అడుగు లేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న లాయర్ నీలకంఠన్ వైపు చూస్తూ నిలపడిపోయింది డాక్టర్ మధురిమ.
* * * *
రాత్రి పదకొండు గంటలు దాటింది. బెడ్ లైట్ నీలికాంతిని నిండుగా పరుచుకుని వున్న గది గోడలు వింతగా మెరుస్తున్నాయి. అలసటగా వున్నా ఎందుకో నిద్ర రావడంలేదు డాక్టర్ మధురిమకు.
ఎప్పుడూ చలాకీగా, అందరితో సరదాగా, హుషారుగా వుందే తనలో అకస్మాత్తుగా ఏర్పడిన నిస్సత్తువకు కారణం ఏమిటి?
కాశీచరణ్ అర్చన రాసిన ఉత్తరం చూసిన దగ్గర్నుంచి తన మనస్సు మనస్సులో వుండడంలేదు ఎందుకని? కాశీచరణ్ అర్చన అనే అమ్మాయి ప్రేమిస్తోందా? లేక కాశీచరణ్ స్పృహాకోల్పోవడానికి ముందు ఆ అమ్మాయిని ప్రేమించాడా?
మరి తనకి అర్చన అనే అమ్మాయి అసలు పరిచయంలేదని అంటున్నాడే!
తన మనస్సు వికలమైపోవడానికి, తెలియని నిరాశ తనలో ప్రవేశించడానికి కారణం ఆ ఉత్తరమేనా?
బెడ్ మీంచి లేచి, డోర్ తెరచి బాల్కనీలో కెళ్ళింది. బయట వెండి వెన్నెల... చల్లటి గాలి... విశాలమైన గార్డెన్లో సన్నగా కురుస్తున్న మంచు. వెన్నెల్లో మంచు వర్షంలో తడవడం ఏంట బావుంటుంది?
కాలేజీలో చదువుకునే రోజుల్లో అందరి అమ్మయిల్లాగే రాబోయే భర్త గురించి ఆలోచించింది_ ఎన్నెన్నో కలలు కంది.
తనకు దగ్గరగా రాబోయిన ఇద్దరు, ముగ్గురు కుర్రళ్ళూ తన మౌనం వల్ల దగ్గరకు రాలేకపోయారు.
అందరూ దూరమైపోయాక, తను ఏకాకిగా మిగిలిపోయాక తనకు తెలిసింది తను చేసిన తప్పేమిటో?
ఆ తర్వాత తన దృష్టి అంతా ప్రోపేషన్ మీదే కేద్రీకరీంచింది. అలా తక్కువ వయస్సులోనే ఏం.డి సాధించింది. హాస్పిటల్ కు చైర్మెన్ కాగలిగింది.
కానీ_ తను ఏకాకి ఎవరి ప్రేమకూ నోచుకొని ఏకాకి అన్న భావంకలిగినప్పుడల్లా మధురిమ మనస్సు నీటిచుక్క కోసం తపించే ఎడారిలా అయిపోతుంది.
మొట్టమొదటిసారి_
కాశీ చరణ్ చూసినపుడు ఎవరో దూరపు బంధువును చూసినట్లు అనిపించడం, అతని సమీపంలో తన మనస్సు ఎంతో ఊరట చెందటం, అతని గురించే గంటల తరబడి ఆలోచించడం_
రాత్రింబళ్ళు శ్రమను లెక్కచేయకుండా అతని అరైగ్యం కోసం కృషి చేయడం తన వృత్తి ధర్మం.
మరి అర్చన విషయంలో కాశీచరణ్ చేస్తున్నది నిజమేనా? నిజమే, అబద్దమో తేలాలంటే అతను బాగుపడాలి. బాగుపడాలంటే ఏం చేయాలి?
రెండు గంటలు గడిచాయి.
మంచు వర్షానికి ముద్దలా అయిపోయింది మధురిమ. అసహనంగా లేచి నుంచుంది.
సరిగ్గా ఆ సమయంలో జ్ఞాపాకనికి వచ్చాడు డాక్టర్ కే.వి.రావు. ఫేమస్ న్యూరాలజుస్టు.
ఆ సమయంలో అయన గుర్తుకు రావడం ఆమెకు ఆశ్చర్యంగా వుంది. యాబై ఏళ్ళ న్యూరాలజిస్టూకే.వి.రావు తనకు ఏడేళ్లుగా తెలుసు.
తన వైవాహిక జీవితంలోని విషాదాన్ని తనకు మాత్రమె పరిమితం చేసుకుని బయటకు నవ్వేస్తూ బ్రతికేస్తున్న వ్యక్తి కే.వి.రావు.
లోనికి వెళ్ళి టెలిఫోన్ వైపు నడిచింది మధురిమ. అప్పుడు సమయం తెల్లవారుజామున మూడు గంటలైందన్నవిషయం కూడా ఆమె మర్చిపోయింది.
సికింద్రాబాద్ లో వున్న కే.వి.రావు కు ఫోన్ చేసింది. రెండు నిముషాలు, మూడు నిముషాలు, అయిదు నిముషాలు, రింగ్ వినిపిస్తూనే వుండి. ఎవరూ లిప్ట్ చేయడంలేదు. పడుకున్నాడేమో?
రిసీవర్ని యధాస్థానంలో పెట్టేద్దమనుకుంటున్న సమయంలో_ "హలో డాక్టర్ కే.వి.రావ్ హియర్" అంటూ అయన బొంగురు గొంతు వినిపించడంతో హమయ్య అనుకుంది మధురిమ.
"గుడ్మార్నింగ్ డాక్టర్... అయాం మధురిమ"
మధురిమ గొంతును గుర్తించటానికి ఒక్క క్షణం పట్టింది డాక్టర్ కే.వి రావ్ కి.
"హల్లో... హల్లో ఏమిటి మూడు గంటలకు మూడోచ్చిందా? సరసానికి ఈ టైమ్ బాగుండదేమో?" కే.విరావు మాటలకు నవ్వుకుంది మధురిమ.
డాక్టర్ కే.వి.రావ్ రోమాటింగ్ పర్సనాలటీయే కాదు, రోమాటింగ్ ఫిలింగ్స్ కూడా ఎక్కువ. ఎలాంటి సీరియస్ టాఫిక్ లోనైనా సెక్సీ జోక్ వేయడం అయన హాబీ. అయన గురించి, అయన ప్రతిభ గురించి తెలిసిన వారెవరూ ఆ జోక్స్ ని అంతగా పట్టించుకోరు.