Previous Page Next Page 
కాలనాగు పేజి 24

    'చదువకపోతేనేం?'

    'మనిషి బతక్క పోతేనేం-'  విసుగ్గా అంది.' ఏంటమ్మా ఈ ప్రశ్నలు? ఇరవై నాల్గు  గంటలూ యింట్లోనే కూర్చొనే?'

    'కూర్చోకు_ తీరిగ్గా ఊరంతా షికార్లు కొట్టు. నలుగురూ నా గురించి కబుర్లు చెప్పుకోవడం కాక యిమ్కేం పంలేదా?'

    "అవ్వ! ఎలా మాట్లాడ్తవే? నలుగురూ  నవ్వరూ?"

    "నవ్వనీ! నవ్వితేనేం? ఏం పోయింది!" "పరువు- మర్యాద_"

    "మనం పరువు తక్కువ పన్లు చేస్తే_ మర్యాదహినంగా ప్రవర్తిస్తే_ అప్పుడు  తలొంచాలి. లేనపుడు భయమెందుకు? సిగ్గెందుకు? జమ్కేమ్దుకు?" నిర్భయంగా అడిగింది సంధ్య.

    "అమ్మా! లోకం చెడ్డగా వుంది. దుష్టుడిని చూసి దూరంగా వుండమన్నారు. ,మనం మన జాగ్రత్తలో వుండాలి. సంద్యా! ముల్లొచ్చి పైన బడ్డాక అరిటాకు చేయగలిగిందేవుంది? చిరిగిపోతుంది. అంతే! అలా జరక్కుండా చూసుకోవాలి తల్లీ_" అంది కనకదుర్గమ్మ.

    ఈ లాజిక్ కి జవబు చెప్పలేదు సంధ్య. అందుకే తను మౌనం వహించింది. తల్లి వైపు నిశితంగా చూసింది.

    'సంద్యా! నీవు కలుసుకునే ఆ అబ్బాయి ఎవరమ్మా?'

    'అదే! నువ్వూ పార్కులో _ లై బ్రరీలో_'

    'అమ్మా! ఎవరు చెప్పారు నీకు?''ఎవరు చెబ్తేనేం? నిజమా కదా?'

    'నిజమే! అయితేనేం?'

    అ జావాబుకి అవాక్కయి పోయింది కనక దుర్గమ్మా.

    అది చూసి మెల్లిగా నవ్వింది సంధ్య.

    'అమ్మా! అతను ఆదిత్య! మనూరే! మీకు తెలుసు. ధర్మరాజు గారి అబ్బాయి. మేం ప్రేమించుకున్నాం... పెళ్ళి చేసుకుంటాం...'

    డబ్బున ఏదో పడిన శబ్దం

    చప్పున లోపలకి వెళ్ళింది కనకడుర్గంమా.

    వంటింటిలో ఓ మూలనున్న దేవుడి ముందు నిరంతరం వేలుగుతొన్న దీపపు సిమ్మే వోరగా బడింది. పైన దందేనికి వేలాడుతున్న కనక దుర్గమ్మా ఒపట్టుచేర జారి ఆ దీపంపై పడింది. చీర బాగ్గున అంటుకుంది కాలిపోతున్నది.

    అది చూసిన విశ్వేశ్వరం డబ్బున పడిపోయాడు.

    ఆయనకి స్ప్రుతి తప్పింది
   
    చప్పున పట్టుచీరని లాగేసి ఆర్పేసింది  కనకదుర్గమ్మ.

    ఆమెని అనుసరించి వచ్చిన సంధ్య తండ్రి ముఖాన నీళ్ళు చిలకరించింది. నిముషం తర్వాత అయన కళ్ళు విప్పేడు.

    'మంట ఆరిపోయిందా?' నీరసంగా ప్రశ్నించాడు. తలూపింది సంధ్య.

    'అది మీ అమ్మా పెళ్ళి చీర!'

    చీరని అర్పి, మడత పెడుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది కనకడుర్గంమా ఆమెకి  ఏదో అమంగళం జరిగినట్లుగా అనిపిస్తోంది.

    సంధ్య ఏమీ అనలేదు.

    అప్పుడే అటుగా వచ్చిన విశాలాక్షి అంతా గమనించింది. అన్నాగారిమాటలూ వింది. "ఈ యింటికి చేద్దరావుజులు వచ్చాయి. దేవుడిని కాదని మనిషి బతకలేదు. దైవంతో పగ బూనటం తెలివి తక్కువ. సర్వనాశం అయ్యేదాకా మీకు తెలిసిరాదు. అప్పుడు తెలిసోచ్చినా ప్రయోజనం వుండదు'

    అవాక్కై పోయారు అందరూ!
   
   
                                                                            24


    డాక్టర్ దేవనాథ్ క్లినిక్. సాయంకాలం అరుగంటల సమయం. అయన అప్పుడే ఇంటి నుంచి నర్సింగ్ హొంలోకి వచ్చారు. అయన చదివింది ఏం.ఎస్ అభిమానంగా నేర్చుకుంది హొమియోపతి. అవసరమైన వారి చికిత్స కోసం ప్రత్యెక శిక్షణ పొందింది. ఆక్యుపంక్చర్ లో ఏం.డి.

    రకరకాల రోగులు...మూడు రకాల క్యూలో కూర్చున్నారు.

    కేవలం హొమియోపిల్స్ మాత్రమే తీసుకునే వాళ్ళు ఒక భెంచి మీద కూర్చున్నాడు. సిస్టర్ వాళ్ళకి నమ్బర్లున్న చీటి యిస్తున్నది. డాక్టర్ అయన ఎసిస్టంట్ లేడీ తనూజ రాగానే వాళ్ళని వరుస ప్రకారం పంపుతుంది.

    మరో సిస్టర్ అల్లోపతిక్ చికిత్స_ కోసం వచ్చే వాళ్ళకి అలాగే నంబర్లు చ్చి ఎసిస్టెంట్  డాక్టర్ రెడ్డి రాగానే అందర్నీ వరసగా పంపుతుంది ఇప్పుడు డాక్టర్ గారి అభిమాన చికిత్స ఆక్యుపంక్చర్. ఈ సూది వైద్యం చాలామందికి రొమాంటిక్ పెయిన్స్ కి,బ్యాక్ ఏక కి, పారాపేరాలిసిక్ చక్కని సమాధానం యుస్తూ వుమ్దతంతావు తనూ, ఎసిస్టెంట్  కోడూరి శేషఫణి చూస్తున్నారు మేల్  నర్స్ గోపాల్ అందర్నీ వరసలో కూర్చోబెడతాడు. ఒక్కొక్కసారి రెండు మూడు సిట్టింగ్స్ లో నయమవుతుంది రోజువారి చికిత్స చేయిస్తాడు దేవనాథ్.

    కొత్తవాళ్ళని పరీక్షించి చికిత్స ప్రారంభిస్తాడు దేవనాథ్.

    ఆ రోజు ధర్మరాజు హాస్పిటల్ కి వచ్చేడు.

    ఆయనకి నిన్నటి నుంచి కనత దగ్గర నరాలు లాగుతున్నాయి. భుజాలు బందులు తెగ లాగుతున్నాయి.
 శరీరంలోని జాయింట్స్ అన్ని నొప్పెడుతున్నాయి. నించుంటే కాళ్ళు తీస్తాయి. చేతులు బరువెక్కినంత తీపు

    భరించుకోలేక క్లినిక్ కి వచ్చాడు.

    గోపాల్ ఆయన్ని కూడా క్యూలో కూర్చోబెట్టాడు. అయనదెం ఎమర్జెన్సీ కేసా? ఏమిటి? డాక్టర్ వద్ద రోగులందరూ సమానమే అన్నదతని రాజీలేని సిద్దాంతం. ఒక్కోసారి డాక్టర్ చెప్పినా వినడతను.

    డాక్టర్ రాగానే అయన చూపు ముందుగా ధర్మరాజు ఆయనకి బాధతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తన బాధ చెప్పుకున్నాడు.

    "కమాన్?' అంటూ  కన్సల్టింగ్ రూమ్ లోకి తీసికెళ్ళాడు. తన శవాన్ని తనే మోస్తున్నంత బాధతో నడిచాడు ధర్మరాజు.

    "పడుకో"

 Previous Page Next Page