"ఇక ఆఖరికి మిగిలింది ఒక్కటే. రాత్రికి రాత్రి ఎంతవీలైతే అంత అప్పుజేయడం ఆ ఫ్యాక్టరీమీద. రెండుమూడు రోజుల్లో ప్రతిపక్షాల గొడవ ఎక్కువ అవుతుంది. మీ మీద ప్రభుత్వం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. వెంటనే లాభనష్టాలలెక్కలు, అస్థి అప్పులపట్టికవేసిఎందుకు ఫ్యాక్టరీ దివాలాతీసిందో ఓ అనుభవజ్ఞుడయిన ఆడిటర్ తో రిపోర్ట్ రాయిఅమ్చి కోర్టులో లిక్విడేషన్ ఫైల్ చేయించండి....."
"కార్మికులు ఈ విషయాన్ని గమనించరంటారా?" అనుమానంగా ఒకతను అడిగాడు.
"పూర్ లేబర్......వారికి కేకలేయడం, ఘోరావ్ లు చేయటం, సమ్మెలు చేయటం తప్ప మరేం తెలియవు....."
"అంతేనంటారా?...."
"కాకపోతే.....వాళ్ళకి తెలివితేటలు, సామర్థ్యం వుంటే ఒకటి చేయవచ్చు.....కాని వారికవి ఉండవని నా నమ్మకం.....అవి ఉన్నా, రికన్ స్ట్రక్షన్ కి ఫైనాన్స్ చేసేందుకు బ్యాంకులు ముందుకు రాకుండా బేడ్ గా మీరు ప్రచారం చేయించండి. ప్రభుత్వ ఆర్ధికసంస్థలు అంత తొందరగా ముందుకు రావు."
"అలా చేసి ఫ్యాక్టరీ ప్రభుత్వపరమైతే వారిరోగం కుదురుతుంది. అది బాగానే ఉంది కాని, 'సాహితి' ఫైనాన్స్ కార్పోరేషన్ మాట....."
"అవును. నేనూ ఈ మధ్యనే ఆ సంస్థ గురించి వింటున్నాను. దాన్ని నడిపేది ఓ ఆడపిల్ల. ఆమె వచ్చి ఫ్యాక్టరీ నిలదొక్కుకునే అవకాశాలు పరిశీలించి పైనాన్స్ చేయవచ్చు. అంతగా వీళ్ళెవరైనా ఆమెను తేగలిగినా మోసపుచ్చో. భయపెట్టో ఆమెను అడ్డుకోవచ్చు డోంట్ వర్రీ...." అంటూ పైప్ అంటించాడు.
భాగ్యరాజ్ చెబుతున్నది తేలిగ్గానే కనిపిస్తున్నా వాస్తవంలో అది ఎన్ని మలుపులు తిరుగుతుందోనని అక్కడున్న నలుగురికీ భయంగా ఉంది.
ఆ భయాన్ని భాగ్యరాజు ముందు బయటపెడితే మరీ లోకువవుతానేమోనన్న ఇన్ ఫీరియారిటీ.
నలభై ఐదు నిముషాలకు భాగ్యరాజు ఓ నిర్ణయం తీసుకొన్నారు వారి తరపున.
వెంటనే ఫోన్ ఎత్తాడు___
"నేను భాగ్యరాజుని మాట్లాడు తున్నాను. ప్రీమియర్ ఇండస్ట్రీస్ కి సహకరించేందుకు సాహితి అనే యువతి వచ్చిందట." భాగ్యరాజు చెప్పుకు పోతుండగా ఫోన్ అవతల వైపున్న సత్యరాజు మధ్యలో కల్పించుకున్నాడు...
"ఇప్పుడెక్కడుంది ఆవిడ.....?"
"సెభాష్....కార్యశూరుడంటే అలా ఉండాలి. ఆమె ప్రస్తుతం ప్రీమియర్ రిజిష్టర్ ఆఫీసులో ఎకౌంట్స్ చూస్తోంది. మరో అరగంటలో గాని, గంటలో గాని బయటకు రావచ్చు."
"అర్థమయింది......దీపక్ రాజుని దింపితే సరిపోతుందన్నమాట?"
"నువ్వేం చేస్తావన్నది నాకనవసరం_కంపెనీ కేంపస్ బయట పూర్ ఫెలోస్ నిలబడున్నారు__ఆ సందర్భాన్ని, వాతావరణాన్ని నీకు అనుకూలంగా మల్చుకో......ఆమె ఫైనాన్స్ ఇవ్వకూడదనే నిర్ణయం అక్కడక్కడే తీసుకోవాలి.....అర్థమయిందా? నీషేర్ సాయంత్రం ఆరు గంటలకి నీ యూనియన్ ఆఫీసులోనే అందించబడుతుంది" భాగ్యరాజు ఫోన్ కట్ చేశాడు.
ప్రీమియర్ కంపెనీ యాజమానులు భాగ్యరాజువైపు కృతజ్ఞాతగా చూసారు.
సరిగ్గా ఇదే సమయంలో సత్యరాజు తనముందు నించున్న హసీం ఖాన్, లాల్ సింగ్ బిర్క్, దీపక్ రాజు, సరస్వతీలవేపు చూశాడు. అప్పటికే ఏం చేయాల్సింది చెప్పేశాడు.
ఆ మరుక్షణక వారి జీవ్ ప్రీమియర్ ఇండస్ట్రీస్ ఆఫీస్ వైపు బయలుదేరింది.
ప్రస్తుతానికి కొస్తే___
సాహితి నెమ్మదిగా తన కారువైపు నడుస్తోంది......చెట్టుక్రింద ఉన్న ముగ్గురూ ఆ సమయానికి దగ్గరగా వస్తూనే ఒకరికొకరు సైగచేసుకొన్నారు.
హసీం ఖాన్ చేయి పైకి లేచింది. అంతే.....అతని చేతిలోంచి విసర బడ్డ రాయి సూటిగా వచ్చి సాహితి నుడురును తాకటం.....ఆమె అబ్బా అంటూ కుడిచేత్తో నుడురును పట్టుకోవటం.....నుదురును, చేతినితడుపుతూ రక్తం రావటం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
సాహితి పక్కనున్న బాడీగార్డ్స్ అలర్ట్ అయిపోయి నలువైపుల అనుమానంగా, కోపంగా, చూస్తుండగానే లాల్ సింగ్ బిర్క్ సాహితి వైపు దూసుకు చస్తున్నాడు__మరొక్క క్షణం ఆలస్యం అయినా సాహితి బిర్క్ చేతిలో ప్రాణాలు కోల్పోయి.....రానున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టిన నాగ సివంగిలా సాహితి ముందుకు దూకాడు-ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని బిర్క్ ఇనుపముక్కలాంటి తన చేతినిలేపి ఒక్కటేశాడు.....అదొచ్చి కరక్టుగా నాగ భుజం మీద ఓవైపు చర్మాన్ని కస్సున చీల్చి వేసింది.
అప్పటికే ఆ ప్రాంతమంతా గందరగోళంగా తయారయింది....ఎవరికీ వార కంగారులో పరుగులు తీస్తున్నారు.
బయటకు పరుగెత్తాలని ప్రయత్నించిన కొందరికి గేటు మూసి వేసుండటం మరింత భయాన్ని కలిగించింది.
జరిగిందేమిటో క్షణాల్లో గ్రహించగలిగిన బిర్క్ కోపంగా రెండు చేతులి గుప్పిళ్ళు బిగించి పైకెత్తాడు.....
దీన్నంతటిని దూరంనుంచే గమనిస్తున్న హసీంఖాన్ తనూరంగంలోకి దిగాకపోతే వేసుకున్న ప్లాను బెడిసి కొడుతుందని, దారిమర్చి సాహితి వెనుక వేపునుంచి దూసుకు వచ్చాడు.
సాహితికి అంతా అయోమయంగా ఉంది....
తనకు శత్రువులెవరిక్కడ? తనమీద దాడి చేయటానికే ఆ ప్రయత్నమంతా అని తెలిసి పోయింది....ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న చోటనె స్థాణువై పోయింది చేష్టలు దక్కి.
ముందు బిర్క్ వెనుక ఖాన్ ఇద్దరూ ఓకే సారి చేతులు పైకెత్తారు వారి చేతులు బలంగా సాహితి మీద పడేలోపే నాగ సాహితిని రెండు చేతులతో అమాంతం గాల్లోకి లేపి ముందుకు వంగుతుండగా వారి చేతులు నాగ్ వీపు మీద పడిపోయాయి.