Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 25

    "యువర్ అనర్! యీ అనాధబిడ్డ తల్లి ఎవరో కాదు "నేనే" యువర్ అనర్. ఇరవై ఏళ్ళ క్రితం ఒక పురుషుని ప్రేమ నిజమని మోసపోయిన ఫలితం ఈ పాప! ఆ మోసం చేసిన పురుషుడు ఎవరో కాదు. ఈనాడు కొడుకు చేసింది తప్పని తెలిసి, తప్పు కాదని న్యాయస్థానంలో వాదిస్తున్న తండ్రి లాయరు రామనాధంగారు.
    ఈనాడు కొడుకు, ఆనాడు తండ్రి యిద్దరి స్రీల జివితలల్తో ఆటలాడుకున్నారు."
    కోర్టులో కలకలం. అంతా ఒక్కసారిగా ఆశ్చర్యచకితులయి గోల గోలగా మాట్లాడసాగారు. జడ్జి కూడా ఆశ్చర్యపోయారు.
    రామనాధంగారు అవమానంతో తలెత్తుకోలేక నల్లబడ్డ మొహాన్ని దించుకున్నారు.
    రూప, సురేష్ కూడా విభ్రాంతులయ్యారు. తెల్సిన అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. రెండు నిమిషాలు కోర్టంతా రణగొణ ధ్వని.
    జడ్జిగారు చప్పున తేరుకుని "ఆర్డర్ ఆర్డర్ " అంటూ కేకపెట్టారు.
    సుమతి గొంతు సవరించుకుని "యువర్ అనర్! కన్న తల్లిని బతికుండగా నా కడుపున పుట్టినబిడ్డ కడుపునిండా తిండికైనా నోచుకోక అనాధగా బతకాల్సిన దుస్థితికి కారణం ఏమిటి? మన సమాజపు కట్టుబాట్లు. సమాజంలో బతుకుతూ సమాజపు కట్టుబాట్లు దాటలేని మన పిరికితనం. ఇద్దరం కల్సి చేసిన తప్పులో శిక్ష నాకు, నా బిడ్డకి లభించింది. వివాహానికి కాపురానికి దూరమై మోడులా ఏకాకిగా బతుకుతూ నేను, అనాధగా దుర్భర జీవితం గడుపుతూ నా బిడ్డ శిక్షింపబడ్డం సమాజంచేత. కానీ మమ్మల్ని దుస్థితి పాలు చేసిన పురుషుడు మాత్రం హాయిగా సంఘంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ భార్యా బిడ్డలతో సుఖంగా వున్నాడు.
    "యువర్ అనర్! ఇదేం న్యాయం? పురుషునికో నీతి స్రీకో నీతి ధర్మశాస్త్రంలో ఎందుకు రాయబడి వుంది. ఈ దంద నైతిక నీతి సూత్రాలు యిప్పటికైనా సవరించి స్రీకి న్యాయం చేకుర్చవలసిన అవసరం మన సమాజానికి, మన రాజ్యాంగానికి, మన చట్టాలకి లేదా- యువర్ అనర్! ఈనాడు నా క్లయింట్ కి వున్న ధైర్యం అన్నాడు నాకుంటే, నా బిడ్డ యిన్నేళ్ళు అనాధగా బతికేది కాదు. ఆమెకున్న ఆత్మవిశ్వాసంలో పదోవంతన్నా నాకు వుండివుంటే కన్నబిడ్డని అనాధ శరణాలయంనించి తెచ్చుకుని పెంపుడుకూతురని అబద్దాలు చెప్పుకునేదాన్ని కాదు. తను బిడ్డ భవిష్యత్తు కోసం నా తల్లితండ్రులు నా బిడ్డ భవిష్యత్తు అంధకారం చేస్తుంటే ఎదుట నిలిచి ధైర్యంగా పోరాడగలగడానికి ఆనాడు ఏ సుమతులు నాకు అండగా లేకపోయారు.
    "అందుకే యువర్ అనర్! నా క్లయింట్ నా దగ్గరికి వచ్చి తన కధ చెప్పి న్యాయస్థానంలో తనకోసం నన్ను పోరాడమని కోరగానే ఆమె ధైర్యాన్ని అభినందించాను. బిడ్డకి దూరమైనా బాధ ఎలాంటిదో తెలుసు కనక ఏమయినా ఆమె తరపున నిలబడి తల్లి, బిడ్డలని ఎవరు వేరు చెయ్యకుండా చూడాలని నిర్ణయించుకున్నాను.
    "ఒక పురుషుని చేత మోసగింపబడితే ఆ అవమానం, కసి, బాధ ఎలాంటిదో తెల్సు కనకే ఆ పురుషునికి అన్నాడు బుద్ది చెప్పలేకపోయినా ఈనాడు బుద్ది చెప్పాలని కంకణం కట్టుకున్నాను. నాలాంటి ఒక ఆడపిల్లని నా అవస్థలో పడకుండా కాపాడాలని నిర్ణయించి ఆమెకి అండగా నిలిచి ఆమెకి న్యాయం చేకూర్చడానికి నా శాయశక్తులా పోరాడాలని నిర్ణయించాను. చిన్నదైనా ఆమె మనో నిబ్బరం చూసిన తరువాతే పదిమందిలో సరోజని నా కూతురని చెప్పుకునే మనస్థైర్యం చిక్కింది నాకు!
    "యువర్ అనర్! ఈనాడు నా క్లయింట్ కి జరిగిన అన్యాయం ఇదివరకు వేలు, లక్షలమంది స్రీలకి జరిగింది. ఈ పాత కధని కొత్తమలుపు తిప్పి, మోసగించబడుతున్న స్రీలకి ఓ దారి చూపాలని కోర్టువారికి విన్నవిస్తున్నాను. పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేని అమ్మాయిలతో ప్రేమకలాపాలు జరపడం శిక్షార్హం అన్నది పురుషుల కర్ధమయితే ఆడదాన్ని వాడుకుని వదిలేసే ఈ పాతకదకి స్వస్తి చెప్పడం జరుగుతుంది.
    అక్రమ సంతానాన్ని కన్న స్రీకి , అక్రమ సంతానానికి ఈ సమాజంలో ఎలా స్థానం లేదో అలాగే ఆ పురుషునికి వివాహ యోగ్యత వుండకూడదు. న్యాయం, చట్టం, నీతి సూత్రాలు స్రీ పురుషులకి ఒక్కలాగే అమలు జరిపిననాడు ఇన్ని మోసాలకి తావుండదు. ఇంతమంది కన్నతల్లులుండరు. ఇంతమంది అనాధలుండరు. ఒక స్రీతో ప్రేమ వివాహానికి దారి తియనివాడు ఆ పురుషుడు శిక్షార్హుడని న్యాయస్థానాలు నిరూపిస్తే ఆ పని చేసే ముందు పదిసార్లు ఆలోచిస్తాడు.
    "యువర్ అనర్! ఈ ప్రతివాది సురేష్ చేత మోసగించబడిన నా క్లయింట్ కి న్యాయం జరిగేట్టు చూడమని కోర్టువారికీ విన్నవించుకుంటున్నాను. ఆమెకి పుట్టిన బిడ్డకి సమాజంలో స్థానం వుండేట్టు న్యాయం చేకుర్చమని కోర్టు వారిని అభ్యర్ధిస్తూ ఇంతటితో నా వాదన ముగిస్తున్నాను."
    ఏకధాటిగా ముప్పావుగంట మాట్లాడి సుమతి రుమాలుతో నుదుటి చమట అద్దుకుని కుర్చీలో కూర్చుంది.
    కోర్టులో చప్పట్లు మోగాయి.
    రామనాధం మొహం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.
    కోర్టులో ప్రక్షకులు గోల గోలగా కేసులో అంతిమ విజయం సుమతినే వరిస్తుందని నమ్మకంగా వాదించుకున్నారు.
    జడ్జిగారు "కేసు తీర్పు ఇరవై మూడో తారీఖుకి వాయిదా వేయబడింది." అని కుర్చీలోంచి లేచి చాంబర్ లోకి వెళ్ళిపోయారు.
    ప్రెస్ ఫోటో గ్రాఫర్ల కెమెరాలఫ్లాష్ లు వెలిగాయి. సుమతి, రూప, సురేష్, రామనాధం ఫోటోలు తీసుకున్నారు రిపోర్టర్లు.
    రూప కేసు ఆరంభించి కేసు నడిచిన యీ పదిహేను ఇరవై రోజులలో రూప కేసు వార్త హైదరాబాదులో సంచలనం సృష్టించింది. మొదటిరోజు పేపర్లలో ఈ వార్త చూసి విశ్వనాధంగారిని, రామనాధంగారిని తెల్సిన అందరూ ఆశ్చర్యపోయారు.
    "అయ్యో.....ఇదేమిటి విశ్వనాధంగారూ? ఈ కేసేమిటి , కోర్టు ఎక్కడం ఏమిటి- అయ్యయ్యో ఇంక రూపకి పెళ్లెలా అవుతుండండి" అంటూ అయన ఆప్తమిత్రులు ఆరాటంగా అన్నారు.
    ఓమదిరి పరిచయస్తులు ఎదురుగా అడగడానికి మొహమాటపడి చెవులు కొరుక్కున్నారు. ప్రతివాళ్ళు ఎన్నడూ కానీ విని ఎరగని వింతలా మాట్లాడుకోడం మొదలుపెట్టారు. రూప ధైర్యసాహసాలకి విస్తుపోయారు. విశ్వనాధంగారి పరువు ఈ విధంగా కోర్టు కేక్కినందుకు సానుభూతి కురిపించారు.
    విశ్వనాధం, పద్మావతి లోకానికి మొహం చుపాలెం అన్నట్లు ఇల్లు దాటి బయటకు వెళ్ళడం మానుకున్నారు. విశ్వనాధం ఆఫీసుకి నెలరోజులు సెలవు పెట్టేశారు. ప్రతివాళ్ళ ప్రశ్నలకి, సందేహాలకి లోకుల దృష్టిలో దోషులయ్యారు. విశ్వనాధంగారి మీద అందరికి కనీసం సానుభూతి ఏర్పడింది. గాని రామనాధంగారిని అందరూ దుయ్యబట్టారు.
    "ఇంతదాకా ఎందుకు రానిచ్చావయ్యా ఏదో గుట్టు చప్పుడు కాకుండా ముడి పెట్టించేయాల్సింది" అన్నారు అయన హితులు.
    మొదటిరోజే ఈ కేసు పేపర్ల వారిని ఆకర్షించింది. ఫ్రంట్ పేజిలో బ్లాకు కట్టి మరీ ఇలా ఓ ఆడపిల్ల ధైర్యంగా కోర్టు కెక్కిందంటు న్యూస్ ప్రచురించారు. ఆ రోజు మొదలు ప్రెస్ రిపోర్టర్లతో కోర్టు నిండింది.

 Previous Page Next Page