టప్
ధైర్య మేడమీద చుక్కపడింది.
అప్పటికే ఏ పదిసార్లో తనకి తెలియకుండానే చమట తుడుచుకున్న ధైర్య ఇప్పుడు కూడా అదేమిటో గమనించకుండా చేత్తో తుడిచేసుకుంది.
టప్....టప్!
ఆమె మెడమీద ఈ తఫా రెండు చుక్కలు (బొట్లు) పడ్డాయి.
ఆమె మేడమీద ఏదో పురుగు వాలినట్లయింది చేత్తో నెమ్మదిగా తుడిచింది. తడితడిగా బంక అయింది.
పురుగు చేతికింద చచ్చింది అనుకున్న ధైర్య చేతికి ఏమన్నా అంటుకుందేమోనని అ చేతినలాగే కొవ్వొత్తి వెలుగు ముందుకి తేచి చూసుకుంది.
జిగురుగా అంటుకుని చీము నెత్తురు చేతివేళ్ళకి అయివుంది. ఆమె కళ్ళు పెద్దవయాయి. అదే సమయంలో వీపు మీద వేళ్ళతో రాచినట్లు గిలిగింతలు.
ధైర్య ఉలిక్కిపడి వెనుతిరిగి కిటికీ వేపు చూసింది. మొండిచెయ్యి అంతేకాదు. చేతివేళ్ళు కూడా మొండిగా వున్నాయి. పుళ్ళుపడి పురుగులు కరిపోతున్నట్లు వున్న అ వేళ్ళ చివరినుంచి చీము రక్తము కలిసిన చుక్కలు వుండి వుండి కిందపడుతున్నాయి.
మొండిచేతికి తోడు నెమ్మదిగా ఓ ఆకారం కిటికీ అవతల వేపునుంచి పైకి లేచింది. పూర్తిగా చెదలు తినేసిన ముఖము. నల్లగా వుబ్బిన పెదవులు కనురెప్పలు పూర్తిగా లేని కళ్ళు. ఇకిలిస్తున్నట్టు కానవచ్చే పెద్దాపళ్ళు, చింపిరి జుట్టు.
మొండిచేతి మొండివేళ్ళు ధైర్య బుగ్గమీద రాచాయి. ముందుకన్నా చల్లగా బుగ్గకి తాకాయి వెళ్ళు. అంతేకాదు, చెదలు తిన్నట్లున్న ఆ ముఖం కిటికీ వుచలకివతలఆనించి బండ పెదవులు కదిలించి మాట్లాడింది.
ధైర్య...ధైర్య...ధైర్య...
నాలుక మడత పడినట్లు వికృతమయిన గరగర శబ్దంతో వుచ్చారణ కూడా సరిగ్గా లేకుండా వుంది. పచ్చి నెత్తుటి వాసన దీనికి తోడు గదిలోపలే ఉన్నట్లుండి నక్క వుళలు , రాబందుల రెక్కల చప్పుడు, హోరుగాలితో ఒక్కసారిగా వినవచ్చాయి.
అన్ని కలిపి అరక్షణంలో జరిగాయి.
ధైర్య కెవ్వున కేక పెట్టింది.
పరిశోధన మసపత్రికలోని "ఆ చికటిరాత్రి" పజిల్ లాంటి కధ చదివి తను చాలా సాహసంతో కుతూహలంతో ఎక్స్ పెరిమేంట్ చేస్తూ ఒంటరిగా గదిలో వుండి పోయానని.... కధలో రాసినట్లు మొండిచెయ్యి వస్తేగిస్తే దానిని ఇసిరి బయటికి గిరాటు వేద్దమనుకున్న సంగతి.... అన్ని ఆ క్షణాన మరిచిపోయింది ధైర్య.
క్షణం మెదడు మొద్దుబారిపోయింది.
మరో క్షణంలో ఒళ్ళంతా అయిస్ లా చల్లగా అయింది.
అదే క్షణంలో గుండె ధదధదలాడింది
ధైర్య తేరుకుంటూనే కెవ్వున అరిచి ముందుకు పరిగెత్తబోయింది. ఎదురుగా వున్న టేబుల్ తగిలి పక్కకి పడిపోయింది. దాంతో కొవ్వొత్తి పక్కకు పడింది.
శక్తినంతా కూడగట్టుకుని ఆమె పైకి లేచింది. లేస్తూనే పక్కగదిలోకి పరిగెత్తింది.
కిందపడ్డ కొవ్వొత్తి ఆరిపోతూ వుండగా అ చివరి వెలుగులో పక్కగదిలోకి పారిపోయిన ధైర్య ఎదురుగా పొడవాటి మనిషి లాంగ్ కోటు నెత్తిన హ్యటుతో....
.
కొవ్వొత్తి గప్పున ఆరిపోయింది.
గుండెలు అవిసేలా పెద్ద వెర్రికేక వేసి ధైర్య ఆ చీకటిలో గోడకి గుద్దుకుని ధబ్ మంటూ క్రింద పది పోయింది.
సరిగ్గా అప్పుడే!
వాకిలి ముందు రిక్షా ఆగింది.
ఆ ఇంట్లో అద్దెకి ఉన్నవాళ్ళు వూరునుంచి రిక్షా దిగారు.
9
"వరదాయ్!"
వరదరాజులు కనపడేసరికి గౌతమ్ పెద్దగా కేకపెట్టబోయాడు. కారు హారను బయ్యన పక్కనే వినపడేసరికి సడన్ బ్రేక్ వేసినట్లు తెలివి తెచ్చుకుని ఆగిపోయాడు. వరదాయ్ అన్న పిలుపు పెదవిదాటి పైకి రాలేదు.
వరదరాజులు రోడ్డుకి అటు సైడ్ న వున్నాడు. గౌతమ్ రోడ్డుకి ఇటు సైడ్ న వున్నాడు. మెయిన్ బజారు కావటం సమయం సాయంత్రం పూట అవటంతో వచ్చేపోయే వాహనాలు మనుషులు హెవి రాష్ గా వుంది.