Previous Page Next Page 
యోధుడు పేజి 23

    "బీబీనగర్ రైల్వే క్రాసింగ్ దగ్గర్లో నీ సూట్ కేస్ తో పాటు స్పృహలేని స్థితిలో నువ్వు నలుగురు కుర్రాళ్ళకు దొరికావు. వాళ్ళు నిన్ను హైదరాబాదు కు తీసుకొచ్చి శుశ్రుత హాస్పిటల్లో చేర్చారు. నీ సూట్ కేస్ లో వున్న కొన్ని ఆధారాలవల్ల నీ పేరు కాశీచరణ్ కే. అని గుర్తించారు.

    రైల్వే యాక్సిడెంట్ జరిగాక నీ గతన్నంతా నువ్వు మరచి పోయావు. నీ గతం తెలిసిన ఒక వ్యక్తి దొరకడం ఈ సమయంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టు అయ్యింది కదూ? ఇవాళే అర్చనకు నేను ఉత్తరం రాస్తాను_ అర్జంటుగా హైదరాబాద్ వచ్చి నన్ను కలుసుకో మని" అన్నాడాయన.

    "లాయర్లు  తోందరపాటు నిర్ణయాలు తీసుకోరని చాలమంది అనుకుంటారు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఆ అభిప్రాయం తప్పని తెలుస్తుంది" అన్నాడు కాశీచరణ్ చటుక్కున.

    ఆ కామెంట్ కి భిన్నుడయ్యాడు నీలకంఠన్.

    "ఆ అర్చన ఎవరో నాకు తెలీదు" కాశీచరణ్ తెగేసి చెప్పాడు_

    "ఏంటేంటి... ఆ అర్చన ఎవరో నాకు తెలీదు? ఆర్యూ ష్యూర్. మరి మీ ఇద్దరి జీవితాల గురించి నువ్వేదో నిర్ణయం తీసుకోబోతున్న సమయంలో నువ్వు హైదరాబాద్ కు చెప్పా చెయ్యకుండా వచ్చేసినట్టుగా ఆమె ఉత్తరం రాసింది మరి? గుర్తుకు తెచ్చుకో" అన్నాడాయన.

    కాశీచరణ్ గతానికి సంబంధించిన విషయాల్ని కదిలిస్తూపోతే ఏదో ఒక సమయంలో అతను పూర్వజ్ఞాపకాల్ని పొందగలడని నీలకంఠన్  ఆశ. అందుకే కావాలనే తన సంబాషణని కొనసాగిస్తున్నాడు.

    "నాన్సెన్స్... ట్రాష్ ఆ అమ్మాయి ఎవరో, ఏమిటో నాకు తెలీనప్పుడు నేను ఆ అమ్మయిని ప్రేమించటం ఏమిటి?" చికాగ్గా అన్నాడు కాశీచరణ్ .

    "ఫన్నీ అండ్ ఇంట్రస్టింగ్ మిస్టర్ కాశీచరణ్! ఆఖరికి నువ్వు ప్రేమించిన అర్చానకి సంబంధించిన వివరాలను కూడా నువ్వు మరచి పోయావన్నమాట" భారంగా నిట్టూరుస్తూ అన్నాడు నీలకంఠన్.

    "చూడండి లాయర్ గారూ! నాకు తెలిసినంతవరకూ నేనిప్పుటివరకూ ఎవర్నీ ప్రేమించలేదు" సీరియస్ గా అన్నాడు కాశీచరణ్.

    "అంత కోపం ఎందుకయ్యా బాబూ! ప్రేమంటే అదేదో చట్ట వ్యతిరేకమైనా చర్యలా విరుచుకుపడతావెం?" లాయర్ నీలకంఠన్ అలా అంటున్న సమయంలోనే లోనికొచ్చింది డాక్టర్ మధురిమ.

    "ఏమిటి... మీ క్లయింట్ తో ఏదో గొడవపడుతున్నారు?" మెడికల్ చార్టు తీసి చూస్తూ అడిగిందామె.

    "గొడవకాదు... డాక్టర్... ప్రేమ... అంటే...లవ్ కాశీచరణ్! ఈ లెటర్ని డాక్టర్ మధురిమ చూపించోచ్చా?" అని అడిగాడు లాయర్ నీలకంఠన్.

    "వైనాట్. అది నాకు సంబంధించిన లెటర్ కాదు. ఎవరికైనా చూపించచొచ్చు" అన్నాడతను చికాగ్గా.

    "ఈ లెటర్ చదవండి డాక్టర్ మధురిమా!" అంటు ఆ లెటర్ని మధురిమకిచ్చాడు లాయర్ నీలకంఠన్.

    ఆ లెటర్ని తీసుకుని కుర్చీలో కూర్చుని చదవసాగిందామె. కాశీచరణ్ ఆమెవైపు చూస్తున్నాడు పరిశీలనగా. జరీ అంచు గోధుమరంగు చీర, అదే జాకెట్టు, నుదుట మీద చింతకులా చిన్నబొట్టు, తీర్చ దిద్దుకున్న కాటుక, ఎడం చేతికి గోల్డ్ చైన్ వాచీ, కుడిచేతికి రెండే రెండు బంగారు గాజులు.

    లెటర్ చదువుతూ అకస్మాత్తుగా ఎందుకో తలతిప్పి కాశీచరణం వైపు చూసిన డాక్టర్ మధురిమ అతను తనవైపే తదేకంగా చూడటం గమనించి భుజమ్మిద నుంచి పక్కకు జారిపోతున్న పైటను సర్దుకుంది అసంకల్పితంగానే.

    లెటర్ చదివి నీలకంఠన్ కిస్తూ_"ఇది కాశీచరణ్ పర్సనల్ లెటర్. నాకెందుకిచ్చారు?" అందామె.

    "కాదని అంటున్నాడు కాబట్టి యిచ్చాను. ఆ అర్చన ఇతనికి లెటర్. నాకెందుకిచ్చారు?" అందామె.

    "లెటర్ అంటున్నాడు కాబట్టి యిచ్చాను. ఆ అర్చన ఇతనికి తెలీదట."

    "నిజంగా తెలీదా కాశీచరణ్?" అడిగిందామె.

    "నిజంగా ప్రేమిస్తే ఎవరూ అబద్దం చెప్పారు."

    "గమత్తుగా వుందే. చాలా విషయాలలో పాటు అర్చన ప్రేమ విషయం కూడా మరచిపోయేరేమో?" అందామె  నిట్టూరుస్తూ.

    "లేదు డాక్టర్! ఆ లెటర్ లో రాసిన చాలా విషయాలలో నాకు సంభంధం లేదు. ఎవరో అనుకుని పొరపాటున ఆమె నాకు ఉత్తరం రాసుండవచ్చు." నెమ్మదిగా అన్నాడు కాశీచరణ్.

    "ఎవరో అనుకోవడం వేరు. నీకే నీ అడ్రస్ కే ఉత్తరం రాయడం వేరు. నువ్వే కాశీచరణ్ కదా? ఈ హాస్పిటల్లో ఇంకెవరూ లేరు కదా?" ఏదో క్లూ కోసం వెదుకుతున్న వాడిలా అన్నాడు నీలకంఠన్.

    "ఈ విషయంలో పేషెంట్ తో ఆర్గ్యూ మెంట్ అనవసరం లాయర్ సాబ్! పేషెంట్ ట్రీట్ మెంట్ లో వున్న సమయంలో అతన్ని కన్ ప్యూజ్ చేసి, మానసిక ప్రశాంతతికి దూరం చేయకండి. దిసీజ్ ఇంజక్షన్ టైమ్. లీవ్ హిమ్ఎలోన్" అని లేచింది మధురిమ.

    అదే సమయంలో ప్రవేశించింది నర్సు మేరీ.

    "కాశీచరణ్... ఈ లెటర్ తో నీకు సంభంధం లేనప్పుడు ఇవన్నీ మర్చిపో. మళ్ళీ కలుస్తాను. ఈ లెటర్ నేను తీసుకెళ్తున్నా" ఆ లెటర్ తో ఆ రూమ్ లోంచి బయటకి నడిచాడు నీలకంఠన్.

    అతని పక్కనే నడుస్తోంది డాక్టర్ మధురిమ.

    "ఏమిటి డాక్టర్! కేసి కొత్త మలుపు తిరిగింది?" అన్నాడయన.

    "అతనికి సంబంధం లేదంటూన్నాడుగా?"

    "సంబంధం లేనప్పుడు లెటర్ ఎందుకొస్తుంది డాక్టర్? నాకు రావచ్చుగా? సమ్  మిస్టరీ ఈజ్ బిహైండ్ దేర్. ఎందుకంటే_ ఇప్పటి వరకూ కాశీచరణ్ నాకేమీ జ్ఞాపకం లేదు అని మాత్రమె అంటున్నాడు. కానీ, అర్చన లెటర్ కు మాత్రం అలంటి వారెవరూ నాకు తెలీదంటున్నాడు జ్ఞాపకం లేకపోవడానికి. తెలీకపోవడానికి మధ్య చాలా వ్యత్యాసం వుండి డాక్టర్! కాదంటారా?" అని అడిగాడు నీలకంఠన్.

    "అంటే మీరు కాశీచరణ్ ని అనుమానిస్తున్నారా?"

    "అతని మానసిక స్థితిని అనుమానిస్తున్నాను. ఈ ప్రాబ్లం ని మీరే సాల్వ్ చేయాలి" అన్నాడాయన ఎక్కడో ఆలోచిస్తూ.
 

 Previous Page Next Page