మామూలు మనుషులకు అర్ధంకాని విషయాలు, మానవరూప మెత్తుతున్న ఆ లేతమనసుపై ప్రభావం కలిగివుంటాయి.
౦ ౦ ౦
కృష్ణా ఓ బ్రాయ్ ఫిఫ్త్ ఫోర్లోని, అతి ఖరీదయినా, విలాసవంతమైన సూట్ లోంచి నవ్వులు విన్పిస్తున్నాయి.
ఆ నవ్వు కాళేశ్వర ప్రసాద్ ది. అతనికెదురుగా అరవై ఏళ్ళ వ్యక్తి పనసపండులాంటి శరీరఛాయతో ఉన్నాడు. అతని ఒడిలో తేజ కూర్చున్నాడు.
తేజాను ముద్దాడి "వీడికి మేనమామ పోలికలొచ్చాయి. అంటే నీకేం అభ్యంతరం లేదుకదా కాళేస్వర్" అన్నాడాయన. అతని పేరు మిత్ర.
"ఇక్కడ మీ మెజార్టీయే ఎక్కువుంది. నేనేమన్నా కోరిచిక్కుల్లో పడ్డట్టే. యింట్లో ఫుడ్డుండదు" జోగ్గా అవి, కొంచెం దూరంలో కూర్చున్న భార్య సుదేష్ణవేపు చూసాడు కాళేశ్వరప్రసాద్.
"ఏవమ్మా సుదీ. మనవాడ్ని ఆమాత్రం భయంలో ఉంచావు గదా. గుడ్. వీడు పుట్టినప్పుడు, నేను బ్రిటన్ లో ఉన్నాను" ఏదో చెప్పబోయాడాయన.
అదికాదన్నయ్యా. మనకో లంకంత కొంప గెస్టు హౌసులూ వుండగా నువ్వీ హోటల్లో ఉండడమేమిటీ" నిష్టూరంగా అంది సుదేష్ణాదేవి.
బిజినెస్ పనిమీద వచ్చాను గదా. నన్ను కలవడానికి చాలామంది వస్తుంటారు. మళ్ళీ ఈ తలనొప్పి అక్కడెందుకు. ఈవెనింగ్ ఫ్లయిట్ కి వెళ్ళిపోతాను. ఈసారి వచ్చినప్పుడు డైరెక్టుగా ఇంటికొచ్చేస్తాను" అంటూ తన మెడలోని గోల్డెన్ చైన్ తీసి, తేజ మెడలో వేశాడు మిత్ర.
మిత్ర, కాళేశ్వరప్రసాద్ చాలా మంచి ఫ్రెండ్స్. మిత్ర సుదేష్ణను స్వంత చెల్లెల్లా భావిస్తాడు.
ఇప్పుడెందుకివన్నీ?" వారించబోయాడు కాళేశ్వరప్రసాద్.
"ఇదేమిటి. వీడు పెద్దవనీ. నా ఆస్తంతా వీడికే రాసిచ్చేస్తాను" అంటూ తేజాను ఎత్తుకొని ముద్దుపెట్టుకొన్నాడు మిత్ర.
౦ ౦ ౦
పదిమంది ఖైదీలు, కొండచిలువను తీసుకొచ్చినట్లుగా తీసుకొచ్చి, ఆ దండను మెడలో వేసేసరికి, ఆ దండలో పూర్తిగా మునిగిపోయిన జైలర్ ఆందోళనరావు బుర్ర తాబేలు బుర్రలా కన్పిస్తోంది.
"అపర హిట్లరుకూ జై" వీర్రాజు గట్టిగా నినాదం చేశాడు. ఖైదీలందరూ పెద్దపెట్టున వంతపాడారు.
"అపర గాడ్సేకూ జై" ఎక్కడినుంచో మెల్లగా వినిపించింది.
ఆందోళనరావు మనస్సు ఆనందంతో నిండిపోయింది.
సభాధ్యక్షుడు వీర్రాజు విజ్ఞప్తి మేరకు, ఆందోళనరావులేచి, గొంతు సవరించుకొని ఉపన్యాసం ప్రారంభించాడు.
"నాకీ సన్మానం ఏర్పాటు చేసిన ఈ ముగ్గురి నేరప్రవృత్తి తగ్గుతోందనడానికి ఏకైక ఉదాహరణ. వాళ్ళు నాకు ఏర్పాటు చేసిన ఈ సన్మానమే.
అసలు పాయింట్ లోకొస్తే ఈ ప్రపంచమే మనకు పెద్ద జైలు, అందులో మన ముషిరాబాదు జైలు, చిన్న సెల్ లాంటిది. మీరొక దేవాలయంలో ఉన్నారనే విషయం మీరెప్పుడు మరిచిపోకూడదు. ఇది దేవాలయం. నేను దేవుడ్ని "ఆడ ఖైదీలందరూ ఒక్కసారిగా చప్పట్లుకొట్టారు.
మళ్ళీ ఆ డైలాగ్ ను కంటిన్యూ చేయడంతో మళ్ళీ చప్పట్లు కొట్టారు.
"అయ్యా తమ స్పీచ్ ను ఆపేయమని శ్రోతలు చప్పట్లద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు" సేతురాజు చెవిలో చెప్పగా, సీరియస్ గా ముఖం మాడ్చుకున్నాడు ఆందోళనరావు.
తర్వాత-వీర్రాజు ఉపన్యసించడం ప్రారంభించాడు.
"ఖైదీ సోదర, సోదరీమణులారా...అందరికీ నమస్కారం!
దేశంలో రకరకాలుగా బతకడానికి అవకాశాలుండగా, మనం జైలుకే ఎందుకొచ్చాం?
ఇక్కడ మనకు ఇరవై నాలుగ్గంటలూ కరెంట్ సప్లయ్, వాటర్ సప్లయ్ వుంటుంది కనుక- ఫుడ్డు ప్రోబ్లమూ, బెడ్ ప్రోబ్లమూ వుండదు కనుక- అందరం కలిసి, తీరుబడిగా ఎంత సేపైనా మాట్లాడుకోవచ్చు గనక-తన్నుకోవచ్చు గనుక-మీటింగులెట్టుకోవచ్చు గనుక.....
కానీ మై ఫ్రెండ్స్...జైలునే నమ్మిన మనకు ఈ ప్రభుత్వం ఏమిచ్చింది? అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఖైదీలకు చాలా సౌకర్యాలున్నాయి....మంచి రూములు, కలర్ టీ.వీ, ఫ్రిజ్, వాటర్ కూలర్, మంచి యూఫోమ్ బెడ్స్, ఏ.సీ. మెషిన్లూ, కుషన్ బెడ్స్, యూరోపియన్ స్టయిల్ బాత్ రూమ్స్, జిమ్ములు, బ్యూటీ పార్లర్స్, ప్రతి సెల్ కీ కలర్ టీ.వీ., వాటికి స్టార్ కనెక్షన్లూ కావాలి. అలాగే మనకో యూనియన్ కావాలి. మన కోర్కెల్ని మన జైలర్ గారు తక్షణం ఆమోదిస్తారని ఆశిస్తున్నాను."
"నన్ను పొగడ్డానికీ సన్మాన సభని చెప్పి, ఈ డిమాండ్లేమిటి?" బరువుగా ఉన్న దండవల్ల తల పూర్తిగా తిప్పలేక, సగం తిప్పి అన్నాడు ఆందోళనరావు ఆందోళనగా.
"డిమాండ్స్ ని తక్షణం ఆమోదించాలి!" ఖైదీలందరూ అరుస్తుండగా, ఒక ఖైదీ లేచి-
"జైలర్ గారూ! ఆడ ఖైదీల డిమాండ్స్ ను కూడా వినాలని మా కోరిక....ఈ ముతక, వైట్ శారీస్ కట్టుకోలేక మేం చాలా ఇబ్బంది పడుతున్నాం. అంచేత మాకు గార్డెన్ వరేలీ చీరలు, లంగాలు, బ్రాలూ కూడా సరఫరా చేయాలి."
"ఓర్నాయనోయ్....సన్మాన సభ అని, నా కొంపకే ఎసరు పెట్టడానికి ప్లాన్ వేసారే!" అంటూ లేచి__