Previous Page Next Page 
కిడ్నాప్ పేజి 23

    "అంతేనంటావా ? లవ్వులూ, గివ్వులూ లేవన్న మాట''   

    "ఫోర్డు 328 మీదొట్టు."

    "బాసూ- ఆ పాతకార్ల గోలేంటో చచ్చినా నాకర్ధంకాలేదు. నువ్వందులో ఎక్స్ పర్ట్ వని, నువ్వు ముట్టుకుంటే, ఆ కార్లు విమానాల్లా పరుగెడతాయని అందరూ అంటారు. నిన్నెవడో ఒక సాయిబుగారు- ఒక్కారుని తీసుకొచ్చారు. సాలార్ జంగ్ మ్యూజియమ్ లో చోరీచేసి తీసికొచ్చాడనుకున్నాను- రెండు రేకులున్నాయి. వాటిని డోర్లంటారట, పెద్దడబ్బా ఉంది, దాన్ని ఇంజనంటారట. నన్ను చంపేసాడనుకో."

    "ఏవంటాడూ-" గిటారు తుడుచుకుంటూ అన్నాడు రాజు.

    "కొన్నాక దానికి రెండే రెండుసార్లు ప్రోబ్లమ్ వచ్చిందట."

    "ఎప్పుడు కొన్నాట్ట?"

    "1902 లో"

    "నువ్వేమన్నావ్-"

    "తీసికెళ్ళి జుమ్ రాత్ బజార్లో అమ్మేయ్ మన్నాను- ఆ మాటకి అతను నన్ను మర్డర్ చేసేటట్టు చూసాడు."

    "ఒరే గాలీ- ఆ కార్లను వింటేజ్ కార్లంటారు. ఫారినులో ఆ కార్లకు పెద్ద గిరాకీ ఉంటుంది. నే వస్తా-" హీరోహోండా ఎక్కుతూ అన్నాడు రాజు.

    "మరి ఆ తాటిచెట్టు వస్తే?"

    "ఆవిడగారితో ఆ బాధలేవో నువ్వే పడు." హీరోహోండా సర్రుమని ముందుకెళ్ళిపోయింది.
   
                                   ౦    ౦    ౦

    తోటపనికి పంపేముందు ఎటెండెన్సు రిజిష్టరుని సరిచూసుకుంటున్నాడు జైలరు ఆందోళనరావు.

    "వీర్రాజు" అని గట్టిగా కేకేశాడు. వెంటనే వీర్రాజు ఉలిక్కిపడి-

    థర్టీ సిక్స్ ట్వంటీఫోర్. థర్టీ సిక్స్. సర్" గట్టిగా అరిచాడు.

    "నీ పేరు రాగానే నువ్వు నీ రోల్ నెంబరు చెప్పాలి. అడ్డమైన కొలతలు చెప్పకూడదు." అతను చెప్పిన కొలతలు, వాళ్ళావిడ జగదంబ కొలతలుగా అన్పించేసరికి ముఖం కందగడ్డలా మారిపోయింది. ఆందోళన రావుకి.

    వీర్రాజుని పక్కకి పిల్చి, రహస్యంగా అడిగాడు.

    "ఈ కొలతలు నీకెలా తెల్సు?"

    "ఏ కొలతలండీ" అమాయకంగా మొహం పెట్టాడు వీర్రాజు.

    "అవ్వే. థర్టీసిక్స్....ట్వంటీఫోర్ వగైయిరా"

    "నీ పేరు రాగానే నువ్వు నీ రోల్ నెంబరు చెప్పాలి. అడ్డమైన కొలతలు చెప్పకూడదు." అతను చెప్పిన కొలతలు, వాళ్ళావిడ జగదంబ కొలతలుగా అన్పించేసరికి ముఖం కందగడ్డలా మారిపోయింది ఆందోళన రావుకి.

    వీర్రాజుని పక్కకి పిల్చి, రహస్యంగా అడిగాడు.

    "ఈ కొలతలు నీకెలా తెల్సు?"

    "ఏ కొలతలండీ" అమాయకంగా మొహం పెట్టాడు వీర్రాజు.

    "అవ్వే, థర్టీ సిక్స్....ట్వంటీఫోర్ వగై యిరా"

    "మీరే చెప్పారు కదండీ__అవ్వి మా రోల్ నెంబర్సుని"

    "అవి. మీ రోల్ నెంబర్సు కావు.....కావు. మా ఆవిడ బాడీ నెంబర్లు. ఒరేయ్ సన్ డేనాడు నీకొంచెం చికెన్ ఎక్కువ పెట్టిస్తారా. ఆ నెంబర్లను మరిచిపోరా" రహస్యంగా బ్రతిమిలాడుకున్నాడు.

    "మీయ్యావిడి ఖైదీ కాదు కదండీ. ఆవిడికి ఆ నెంబర్లెందుకూ" ఆ ప్రశ్నకు ఆన్సరు ఎలా చెప్పాలో తెలీక జుత్తుపీక్కున్నాడు ఆందోళన రావ్.

    "మా ఆవిడతో నీ లవ్ ఎఫైర్, అదేదో పూర్వజన్మజ్ఞాపకం అనుకుని నన్ను కటాక్షించరా' మరింత ప్రాధేయపడ్డాడు.

    సరిగ్గా అదే సమయంలో సేతురాజు, పోతురాజు అక్కడకొచ్చారు.

    "గురూ-గురూ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. మీ సన్మానానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయిపోయాయి. ఏర్పాట్లను స్వయంగా చూద్దురు గాని రండి" అంటూ జైలర్ ఆందోళనరావుని బ్యాలెన్స్ లవేపు తీసుకెళ్ళారు.

    బ్యారక్సులన్నీ కొత్త కొత్త సున్నాలతో కళకళలాడుతున్నాయి. ప్రతీ సెల్ కీ కొబ్బరి తోరణాలు కట్టారు. ఆ ఖైదీ రూముల ముందు ముగ్గులు పెట్టారు.

    "ఎవడయినా కడితే మామిడి తోరణాలు కడతారు ఖైదీ రూముల ముందు ముగ్గులేమిట్రా. అసలు నేనుపన్యాసమిచ్చే డయాస్ ఏదీ" సంతోష వదనంతో అడిగాడు ఆందోళనరావు.

    "అదే" దూరంగావున్న పందిరిని చూపించారు.

    "అదా వేదిక...ఒరేయ్...అది ఖైదీలను ఉరితీసే స్థలమురా....అది డయాస్ ఏంట్రా?"

    "ఈసారికి ఎడ్జస్టు అయిపోదాం గురుగారూ, మరేం మాట్లాడకండి. నెక్టుటైమ్ మరోవేదికను కడతాం" ముగ్గురూ కూడబల్కుని చెప్పారు.

    అంతలో ఆందోళనరావుకి చిన్నడౌట్ వచ్చింది.

    "సన్మానసభ చేస్తామన్నారు. సరేనన్నాను. ఆ సభలో మీరు నన్ను తిడతారా, పొగుడుతారా"

    "ఇంకా మేం ఒక నిర్ణయానికి రాలేద్సార్"

    "ఆఁ....జైల్లో నేనేదో హిట్లర్ లా ప్రవర్తిస్తున్నానని ఫిజనర్స్ కౌన్సిల్ కి రిపోర్టు చెయ్యాలని, జైల్లో ఎలక్షన్స్ జరిపించాలని ఇలాంటి డిమాండ్స్ ఏవో ఉన్నాయట నిజమేనా?"

    "ఇవ్వన్నీ ఎవరు చెప్పారు సార్"

    "ఖైదీల్లోకూడా నాకు గూఢచారులున్నారు. మీరలాంటి పిచ్చిపిచ్చి వాగుడు వాగి ఖైదీల ఐకమత్యం అన్నారో... ముగ్గుర్నీ రాత్రికి రాత్రి ఉరితీయించేస్తాను. జాగ్రత్త" అంటూ కోపంగా ముందుకెళ్ళి-వెనకొచ్చి-

    నక్క, గాడిద కలసి నవ్వుతున్నట్లుగా నవ్వి-

    "చూడండీ దండలు యెలాంటివి తెప్పిస్తున్నారు, గవర్నర్ కీ, సి.ఎమ్ కీ వేస్తారు చూడండీ. వంద కేజీల దండలు. అలాంటి దండలు తెప్పించండి. అవసరమైతే పైసలు నేనిస్తా" అంటూ మీసం మెలేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆందోళనరావు.

    గురువుగారి బ్లడ్....నేషనల్ లీడర్స్ బ్లడ్..." వ్యాఖ్యానించాడు వీర్రాజు.
   
                                     ౦    ౦    ౦

    జనన సమయాల్లో శిశువు అనబడే మాంసపు ముద్దలో ఆత్మ చైతన్యం వుంటుంది. వాటికి స్పృహ వుంటుంది. జ్ఞానం వుంటుంది. సుఖ దుఃఖ భావనలుంటాయి. తల్లి మనసు, పరిసర పరిస్థితులు, అస్పష్టమైన అవగాహన అవగాహన ఆ మెదడులో నిక్షిప్తమై వుంటాయి. శిశువు, సుఖానికి చిన్ననవ్వు తోనే జవాబు చెప్పటం, దుఃఖం, కష్టాల నుంచి తప్పించుకోడానికి అసంకల్పితంగా ప్రయత్నం చేయడం సహజంగా జరిగే ప్రక్రియ.

 Previous Page Next Page