'బాబూ! నా మాట వినండి మీ రిద్దారూ ! ఇలా అర్దరాత్రి అపరాత్రి ఫోన్ కాల్స్ వస్తే ఫోన్ తియ్యకంది... మనకి అవేలప్పుడు అంత అర్జంటుగా ఫోన్ చేసేదెవరు? ఈ రోజు శ్రీధరశాస్రీగారి వద్దకి వెళ్ళొచ్చాను. అయన ఏవేవో చెప్పారు. ఆదిత్య! గ్రహచారం బావులేనపుడు మనం జాగ్రత్తగా వుండాలి'
"అలాగేనమ్మా!"
'సరే? పడుకో!" అని ఆమె వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ ఆమె రిసీవర్ తీసి టేబుల్ పై పెట్టి వెళ్ళింది. ముందు జాగ్రత్త మంచిదన్నట్టుగా వుంది ఆమె చర్య.
ఆమె అటు వెళ్ళగానే హమ్మయ్య అనుకున్నాడు ఆదిత్య. లైటార్చి బెడ్ లైట్ వెలిగించి పడుకున్నాడు.
చాలా సేపటివరకు అతనికి నిద్రపట్టలేదు.
22
పాము వెంటబడి తరమటం వుంది.
కసికసిగా వేసిన చోటే వేయటం వుంది.
కానీ శరీరానికి చుట్టుకపోతుందా? అదీ ఒక తీగ, మరో కర్రకీ అల్లుకపోయినంత తాదాత్మ్యంగా శరీరాన్ని పెనవేసుకుని పోతుందా! అట్లా పెనవేసుకుపోయి కూడా శరీరంలో అందిన చోటల్లా కాటువేస్తుందా? అలా కాతువేస్తూ ఆ వ్యక్తి పెంపుడు పిల్లితో హొరాహొరి పోట్లాడుతుందా?
అతను జపం చేసుకుంటున్నాడు.నిశ్చల సమాధిలో వున్నట్టుగా ధ్యానంలో వున్నాడు. పద్మాసనం వ్సుకుని కళ్ళుమూసుకుని దృష్టిని భామద్యలో కేంద్రీకరించి కులక్రమాగ్త విద్యలాగా గాయత్రిని ధ్యానిస్తున్నాడు.
అతని దగ్గరే పెంపుడు పిల్లి కూర్చుంది. కొద్దిసేపు పడుకుంటుంది. కొన్ని క్షణాలు నాల్కతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటుంది.కొద్దిసేపు తోకని శ్రీకారంలాగా చుట్టి దానిపై కూర్చుంటుంది. దాని నిత్యకృత్యమే.
అతడలాగా కొన్ని గంటలు జపంలో కూర్చుని, దయానం పూర్తిగా చేసుకుని, కాచి చల్లారిన పాలలో చక్కెరవేసి దేవుడికి నివేదిస్తాడు. తర్వాత తను ఆ క్షిరాన్ని తీర్డంలాగా మూడు గుక్కలు పుచ్చుకుంటాడు. రోజూ ముప్పుటులా సంద్యావందనం చేసి అలా ప్రసాదం స్వీకరిస్తాడు. అతని ఆహారం ఆ పాలే!
మిగిలిన పాలు ఆ పిల్లికి పోస్తాడు ససర్లో. అది అలాగే కాచు కొనుంటుంది రోజూ! ఆ పాలు తాగటం, అతని ప్రక్కనే కూర్చోవటం పడుకోవటం, ఆ గదిలో మాత్రమే షికార్లు కొట్టటం. చివరికి ఆతని పక్కలో ఓ మూల శయనం.
రోజూ జరిగేది ఇదే!
ఆ రోజు అలాగే జరిగింది.
అయితే పాము మిద్దె కప్పునుంచి జారి అతని మీదపడి అతని శారీరాన్ని చుట్టుకుని కాతువేస్తూ,పిల్లితో పోరాడుతూ వుంటే అతని ఆక్రందన విని వచ్చిన, తల్లి, చేల్లిల్లు నిస్సహాయుకులుగఏం నుంచుండిపోయారు.
ఏం చేయగలరు ?
కొట్టేందుకు చేతులు రావు_
దెబ్బ పాముకి తగులుతుందో? అతనికే తగులుతుందో!
మీ మాసంలోనే అతని ప్రాణం పోయింది. పాము చనిపోయింది. పిల్లి మరణించింది.
అప్పుడోచ్చింది స్పృహా.
అందరూ గోలుగోలున ఏడుస్తూ వున్నారు.
"ఆదిత్యా! ఆదిత్యా!" కొడుకు ముఖాన్ని పరిశీలనగా చూస్తూ,గాబరాగా ఏడుస్తోంది అరుంధతి.
చప్పున కళ్ళు తెరిచాడు ఆదిత్య.
"ఏమిటి బాబూ ఆ కేకలు_ ఆ ఎద్చేమిటి?"
లేచి కూర్చుని కళ్ళు తుడుచుకున్నాడు.
కన్నీళ్ళు! చెంపలనిమ్డా చారికలు!
తను ఎద్చడా! ఎందుకు?
ఆ యువకుడు చనిపోయాడు... పాము.. పిల్లి.. పోరాటం! ఆక్రందనలు! ఎంత భయంకరమైన కల!
అరుమ్ధతిగారి ముఖం చోశాడు? "నిద్దర్లేస్తూనే తల్లి ముఖం చూశాడు తను_పర్లేదు. ఈ రోజు హాయిగా గడచిపోతుంది" అనిపించిందిదతనికి.
చపున మంచం దిగేడు.
"ఏం లేదమ్మా! ఏదో చెడ్డకల! చాలా భయంకరమైన కల అంతే!" అన్నాడు.
"ఈ యింటికి ఏదో శని పట్టుకుంది. రేపు మళ్ళీ వెళ్ళి శ్రీ ధరశాస్రీతో చెప్పి నీకో యంత్రం వేయిస్తాను" అంది ఆమె. ఆమె మనస్సులోని అర్దత మాటల్లో కనిపించింది.
అంత అందోళనలోనూ అతనికి నవ్వొచ్చింది "యంత్రం మత్రం.. ఇవి మనిషిని రక్షిస్తాయా?" అనుకున్నాడు.
బాత్ రూమ్ వైపు నడిచాడు. అక్కడ తనో భయకరమైన భవం పొందబోతున్నాడని అతని కాక్షణంలో తెలీదు... తెలిస్తే...
23
కనకదుర్గమ్మ గారు కూతుర్ని నిలేసిమ్ది ఆ రాజౌ.
'ఎక్కడికే వెళుతున్నావ్?'
'అలా బయటకి వేల్లావుస్తానమ్మా!" అంది సంధ్య
"ఈ వేళప్పుడెం షికర్లే_' మందలింపుగా అందమే. చెట్టంత ఎదిగిదన్నట్టు తనంటగా వున్న కూతుర్ని అదుపులో పెట్టాలంటే కష్టమేమరి.
'లైబ్రరీకమ్మా! షికారుకి కాదు_'
'ఎందుకు లైబ్రరికీ_'
'దియేటర్ కి సినిమా చోట్టానికి, హాస్పిటల్ కి డాక్టర్ని చూట్టానికి పార్కుకి షికారుకి కాక యిమ్కేమ్డుకి వేలతారంమా మామూలు జనం అలాగే లైబ్రరీకి చదువు కోటానికి వెళుతున్నా!"
'ఇంకా ఏం చదువులు? ఏమ్మేనో _ అదేదో అయ్యిందిగా!
'ఆ చదువు కాదమ్మా! పేపరు చదవటానికి, జనరల్ బుక్స్ చదివేందుకి- రిఫరెన్స్ బుక్స్ చదువుకుందుకి_'