Previous Page Next Page 
మోహిత పేజి 24


    తాగడం మొదలెట్టాడు. మైత్రేయ అదే టెన్షన్ లో వున్నాడు.

 

    సరిగ్గా అదే సమయంలో నైటీలో డ్రాయింగ్ రూమ్ లోకి ప్రవేశించి జయంత్ పక్కనే కూర్చుంది మోహిత.

 

    క్యాండిల్ వెలుగు మోహిత ఎత్తయిన గుండెలమీద పడుతోంది. వాటివేపు ఆశగా, ఆబగా చూస్తున్నాడు జయంత్?

 

    మోహిత ప్లాన్ అప్పటికిగానీ  అర్థంకాలేదు మైత్రేయకి. కావాలనే కరెంట్ తీసేసి, ఒకే ఒక క్యాండిల్ వెలిగించటంలోని అర్థం మైత్రేయకి బోధపడి రిలాక్స్ అయ్యాడు.

 

    "ఈ విషయంలో ఇలా స్పోర్టివ్ గా వుండే అమ్మాయిలంటే నాకిష్టం" గ్లాసులోని డ్రింక్ ని పూర్తిగా తాగేస్తూ అన్నాడు జయంత్.

 

    తనూ గ్లాసందుకుంది మోహిత. గబగబా తాగేసింది.

 

    "నీ ప్రేరేంటి?" అడిగాడు జయంత్.

 

    "స్వప్న...." చెప్పింది మోహిత.

 

    "మిగతా వివరాల్నీ నాకు తెల్సు..... నువ్వు చెప్పక్కర్లేదు..... చూడబ్బాయ్ మా ఇద్దర్నే ఏకాంతంగా వదిలేసి ఇక నువ్వెళ్ళిపోవచ్చు గదా..... ఏమంటావు స్వప్నా?" మత్తుగా అన్నాడు జయంత్.

 

    నర్మగర్భంగా మైత్రేయవేపు చూసింది మోహిత.

 

    మైత్రేయ సిగరెట్ ప్యాకెట్ తీసుకుని బైటకు వెళ్ళిపోయాడు.

 

    తనను పోలుస్తాడేమోనని భయపడిన మోహితకు ఆ ఛాయలేవీ జయంత్ లో కన్పించకపోవడంతో సంతోషించింది.

 

    మూడో పెగ్ ను తను స్వయంగా పోసింది మోహిత.

 

    ఆ పెగ్ ను తాగుతూ-

 

    "కాలేజీ అమ్మాయిలతో గడపాలని నాకు చాలాకాలం నుండి కోరిక. ఆ కోరిక ఇన్నాళ్ళకి తీరుతోంది. నేనిలా వయసుమళ్ళిన వాడిలా కన్పిస్తున్నానని అనుమానించకు..... నీకెంత సంతృప్తినిస్తానో చూడు" మత్తుగా అన్నాడు జయంత్.

 

    "అతను మనీగురించి మాట్లాదాడా?" తమకంగా నటిస్తూ అడిగింది మోహిత.

 

    "చెప్పాడు..... నీలాంటి ఫిగర్ కి రెండువేలేమిటీ..... మూడువేలైనా యిస్తాను. డబ్బులు రేపుంటాయి. కానీ రేపు నువ్వుండవు కదా! నేనెవరనుకున్నావో తెలుసా? ఈ అడవికి సింహాన్ని. ఆడవాళ్ళకు మన్మథున్ని....." సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు జయంత్.

 

    నెమ్మదిగా తన కుడిచేతిని ఆమె భుజాలమీద వేసి, నిమురుతూ గుండెలవేపు ఆ చేతిని కదుపుతున్నాడు జయంత్.

 

    "ముందు డబ్బివ్వండి" పచ్చితనం మూర్తీభవించిన పడుచులా అడిగింది మోహిత.

 

    "అలాగే.....కాదంటానా..... కాలేజీపిల్లా" అంటూ జేబులోంచి నోట్లకట్టని తీసి లెక్కపెట్టి డబ్బుని ఆమెచేతిలో పెట్టి-

 

    "నాకు మూడ్ వచ్చేసింది. బెడ్ రూమ్ కి పద" అన్నాడతను ఆయాస పడిపోతూ.

 

    అతనివేపు ఎగాదిగా చూసింది మోహిత.

 

    "ఈ ఇరుకు ఇరుకు బెడ్ రూమ్ లో నాకు మూడ్ రాదు....." అంది మోహిత.

 

    "ఓపెన్ ప్లేస్ నీకిష్టమా? నాకూ ఇష్టమే! అన్నీ కొండలే కదా...... ఎక్కడికెళదాం చెప్పు?" అన్నాడు జయంత్.

 

    "చుట్టుపక్కల అన్నీ అడవులేగా. ఎవరూ వుండని నిశ్శబ్దం అంటే నాకెంత ఇష్టమో! ఏ చెరువుగట్టునో, ఏ చెట్టుకిందో..... నాకలాగైతే ఇష్టం" అతని చేతులకు తన గుండెలను తగిలిస్తూ అంది మోహిత.

 

    "నీలాంటివాళ్ళలో ఇలాంటి టేస్టున్న  వాళ్ళుంటారని నాకిప్పటివరకూ తెలీదులే! ఓహో.... నువ్వు పి.జి. పిల్లవు కదా.... నాక్కూడా ఆ టైపు ఇష్టమే. పద బైటికెళదాం. నువ్వెక్కడ ఇష్టపడితే నేనక్కడే రెడీ" చాలా హేపీ మూడ్ లో వున్నాడు జయంత్.

 

    ఇద్దరూ గెస్ట్ హౌస్ లోంచి బయటికొచ్చారు. అడవుల్లోకి వెళ్ళే రోడ్ మీద నడుస్తున్నారు.

 

    అరగంట గడిచింది.


    
    మొసళ్ళపార్క్ దగ్గరికొచ్చారిద్దరూ.

 

    "కొండమీద కెళదామా?" జలాశయానికి ఆనుకుని వున్న కొండవేపు చూపిస్తూ అందామె.

 

    "నీ ఇష్టం."

 

    మరో పదినిమిషాల తర్వాత మొసళ్ళకు అతి చేరువలో వున్న కొండమీద ఏటవాలు ప్రదేశంలో కూర్చున్నారిద్దరూ.

 

    జయంత్ ఆమె గుండెలమీద చెయ్యివేశాడు ధైర్యంగా.

 

    "అప్పుడేనా.... కాసేపు కబుర్లాడుకుందాం" అంది మోహిత.

 

    సరిగ్గా ఆ సమయంలో-

 

    రెండు గ్లాసులతోను, డ్రింక్ బాటిల్తోనూ ప్రత్యక్షమయిన జీపు డ్రైవర్ని చూసి ఆశ్చర్యపోయింది మోహిత.

 

    "డ్రింక్ లేకపోతే బండి నడవదు. అందుకే....." నవ్వుతూ ఆ గ్లాసుల్నీ బాటిల్నీ అందుకుని "నువ్వెళ్ళిపో.... జీపునక్కడ వదిలెయ్" అని చెప్పాడు డ్రైవర్ తో.

 

    జీపుడ్రైవర్ సెల్యూట్  కొట్టి వెళ్ళిపోయాడు.

 

    గ్లాసులో సగం డ్రింక్ ని పోసుకుని, గడగడా తాగేశాడు జయంత్. జయంత్ మూడ్ నీ, ముఖకవళికల్నీ పరిశీలిస్తోంది మోహిత.

 

    "ఏమిటలా..... సీరియస్ గా చూస్తున్వావ్ నావేపు?" సడన్ గా అడిగాడతను.

 

    "ఏంలేదు..... కొంచెం ముందుకెళ్ళి కూర్చుంటే బావుంటుందేమో" అందామె.

 

    "ఏం బాగోదు..... ఎందుకు బాగోదో తెలుసా మోహితా?" గట్టిగా అరిచినట్లుగా కోపంగా అన్నాడు జయంత్.

 

    ఒక్కసారిగా షాక్ తింది మోహిత. ఆమె ముఖంలో రంగులు మారిపోయాయి. వెంటనే జయంత్ ఐ.క్యూ. ని అంచనా వేసింది.

 

    "చూడు మోహితా! నేను రవీంద్రనాథ్ నీ కాదు, మహేంద్రనీ కాదు. అయామ్ జయంత్.... నీలాంటివాళ్ళని ఎంతమందిని చూసుంటాను. నిన్ను  గెస్ట్ హౌస్ లో చూడగానే గుర్తుపట్టాను. నాకోసం నువ్వొస్తావని నాకు  ముందుగానే తెలుసు. అందుకే నువ్వు చెప్పినట్టుగా విన్నాను. ఇక్కడికొచ్చాను....... ఇక్కడికి నీ తెలివితేటలతో నన్ను  తీసుకొచ్చి, నువ్వు నువ్వు ఈ మొసళ్ళకు ఆహారంగా వేద్దామనుకున్నావు. తాడిని తన్నేవాడుంటే, తలను తన్నే వాడుంటాడు గుర్తుంచుకో! అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను. అందుకేపిస్టల్ తో వచ్చాను" వెంటనే పిస్టల్ తీసి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా  ఆమె గుండెలకు గురిపెట్టాడు జయంత్.

 

    "ఈ క్షణమే నేన్నిన్ను చంపెయ్యగలను. మొసళ్ళకు హాట్ పుడ్ గా వేసెయ్య గలను. కానీ చాలాకాలానికి దొరికావు గదా! నా కోరిక తీరాలి గదా.... నా కోరికను తీర్చుకున్నాకే నిన్ను చంపేస్తాను..... దారుణంగా, అండర్ స్టాండ్" మత్తుగా, కసిగా అన్నాడు జయంత్.

 

     ఒక్కక్షణం తనెలా రియాక్ట్ అవాలో అర్థం కాలేదు మోహితకు.

 

    తనను దారుణంగా అవమానించిన ఆ నలుగురు, భర్తగా వంచించి, తన స్త్రీత్వాన్ని హేళన చేసిన రాజేంద్రకుమార్ లను భయంకరంగా చంపాలను కుందేకానీ, వాళ్ళలో ఏ  ఒక్కడికయినా తనకన్నా ఎత్తుకు పై ఎత్తు వేసే తెలివితేటలుంటాయని ఊహించని మోహిత వెంటనే ప్లాన్  మార్చేసింది.

 

    "మోహిత.... హు ఈజ్ షి?" అందామె.

 

    ఆ ప్రశ్నకు చూపులు చిట్లించి..... ఆమె ముఖంవేపు చూశాడు జయంత్.

 

    "డోన్ట్ బ్లఫ్ మీ..... నువ్వు మోహితవు కావా? నన్ను మర్డర్ చేయడానికి రాలేదా?" అరుస్తూ అన్నాడతను.

 

    "అయామ్ స్వప్న! పి.జి. స్టూడెంట్ ని. ఉమెన్స్ హాస్టల్లో వుంటున్నాను. నా రూం నెంబర్ 39. నేను అతడ్ని ప్రేమించాను. మేం ఇద్దరం మా వాళ్ళను ఎదిరించి బతకాలంటే డబ్బు అవసరం. అతనికోసమే నేనీ పని చేస్తున్నాను. ఇండీ సెంట్ ప్రపోజల్ అనే ఇంగ్లీష్ సినిమా చూడలేదా..... చూసుంటే బాగుండేది. ముందున్న  మొత్తం స్వర్గమనుకుంటే, ఆ స్వర్గం కోసం చిన్న తప్పు చేసి దాన్నే పెట్టుబడిగా మార్చుకోవడం నాకు తప్పనిపించలేదు. ఇప్పుడు నిన్ను నేను ప్రేమించి దగ్గరవడం లేదు. నా ప్రియుడితో శాశ్వతంగా, సుఖంగా బ్రతకటానికి నువ్విచ్చే డబ్బు మాకు చాలా వుపయోగపడుతుంది. అతను నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. దిస్ ఈజ్ రాంగ్ వే.... ఐనో ఇట్.... బట్ ఐ లవిట్ ఫర్ మై లవ్ సేక్ డూ యూ అండర్ స్టాండ్ మీ..... అవసరం...... లేనిపోని అనుమానాలతో నా మూడ్ ని పాడుచేసేశారు. మీ డబ్బు మీరు తీసేసుకోండి..... నేనిప్పుడే వెళ్ళిపోతాను....." కోపంతో లేచి నిలబడింది మోహిత.

 

    ఆలోచిస్తున్నాడు జయంత్. రాజేంద్రకుమార్ దగ్గర్నించి ఫోన్ వచ్చాక ప్రతి ఒక కొత్తవ్యక్తినీ, ప్రతి జరిగే చర్యనీ అనుమానిస్తున్న జయంత్ మైత్రేయని, మోహితను అలాగే అనుమానించాడు.

 

    అందుకే గాల్లో బాణం వేశాడు. నిజంగా మోహిత అయితే వెంటనే భయపడేది. పిస్టల్ క్కూడా భయపడలేదంటే మోహిత కాదని నిర్థారించుకున్న జయంత్-

 

    "సారీ స్వప్నా..... ఒకమ్మాయివల్ల చిన్న ప్రాబ్లంలో వున్నాను..... అందుకే నిన్ను అనుమానించాను. కమాన్..... హేవ్ ఎ పెగ్ ఆఫ్ డ్రింక్" అంటూ  గ్లాసులోని డ్రింక్ ను ఆమె పెదవులకు అందించి తాగించాడు.

 

    తన రియాక్షన్ సక్సెస్ అయినందుకు సంతోషించి అతన్నే గమనిస్తూ అంది మోహిత.

 

    "మీరు ఏవేవో మాట్లాడడం, రైపిల్ తియ్యడం చూసి నెనెంత భయపడి పోయానో తెలుసా" చేతులు రెండూ తలకింద పెట్టుకుని నిలువుగా పడుకుంది మోహిత.

 

    చెట్లమీంచి వస్తున్నా చలిగాలికి ఆమె పైట పక్కకు తొలిగిపోయింది. వెన్నెల తెల్లద్రాక్షపళ్ళ రంగులో గుత్తులుగా కురుస్తోంది.

 

    ఆ భంగిమలో నేలమీద కోణార్క్ నగ్నశిల్పం నిద్రిస్తున్నట్టుగా వుంది మోహిత.

 

    పల్చటి వెన్నెల్లో ఆమె నగ్నత్వాన్ని చూస్తున్న  జయంత్ పిచ్చెకిపోతున్నట్టు వున్నాడు.

 

    "ఈ ఎట్మాస్ఫియర్ లో షర్టూ, పాంటూ తీసేస్తే హాయిగా వుంటుంది కదూ...." అని తనలో తానే అనుకుంటూ అన్ డ్రెస్ అయ్యాడతను. దుస్తులు విప్పుకుంటూ కొంచెం దూరంలో బండమీద పెట్టాడతను.

 

    మోహిత చూపులు తన చేతికి అందే దూరంలో వున్న పిస్టల్ మీదే వున్నాయి.


    
    ఇప్పుడు జయంత్ అండర్ వేర్ తోను, బనీస్ తోనూ వున్నాడు.

 

    పక్కనే కూర్చుని ఆమె భుజాలమీద చేతులు వేసి, ఆ చేతుల్ని కిందికి పోనిస్తున్నాడతను. ఎత్తయిన ఆమె గుండెల స్పర్శకు పులకించిపోతున్నాడతను.

 

    ఆమెను ముద్దుపెట్టుకోడానికి ముందుకి వంగాడు జయంత్. సరిగ్గా అదే సమయంలో-

 

    పిస్టల్ ని అందుకున్న మోహిత, రెండుకాళ్ళతో శక్తినంతా కూడదీసుకుని బలంగా అతని గుండెలమీద తన్నింది. అరుస్తూ పెద్ద బస్తాలా జయంత్ దూరంగా పడిపోయాడు.

 

    ఊహించని సంఘటనకకు అతను బిత్తరపోయి లేచి నిలబడేలోపల అతని గుండెలకేసి పిస్టల్ని గురిపెట్టి నిల్చుంది మోహిత.

 

    "మిష్టర్ జయంత్..... నువ్వూహించింది కరెక్టే....బట్ లేడీ వీక్ నెస్ వల్ల నీ తెలివితేటలు పనిచెయ్యలేదు. నువ్వు మిగతావాళ్ళతో కల్సి నాకెలాంటి ద్రోహం చేశావో నేన్నీకు మళ్ళీ చెప్పక్కర్లేదు" జయంత్ ఏదో చెప్పబోతుండ గానే-

 Previous Page Next Page