Previous Page Next Page 
మోహిత పేజి 23


  

         ఇప్పటి మోహిత ప్రవర్తనకు, ఆమె కలకు గల వ్యత్యాసం మధ్య సైకలాజికల్  పాయింట్  గురించి ఆలోచిస్తున్నాడు మైత్రేయ.

 

    దూరంగా అడవిచెట్లమీంచి వచ్చేగాలి ఆహ్లాదభరితంగా వుంది.

 

    రెండో పెగ్ పూర్తయింది.

 

    "బీచ్ ఒడ్డున నేకెడ్ గా ఎప్పుడైనా జాగింగ్ చేశావా? షడన్ గా  అడిగిందామె.


    
    నగ్నంగా జాగింగా? బీచ్ ఒడ్డునా..... చూసేవాళ్ళు పిచ్చివాడనుకుంటారు."

 

    "ఎందుకనుకుంటారు..... కళ్ళు మూసుకుని జాగింగ్ చేస్తే మనకేం భయం" గలగలా నవ్వుతూ అంది మోహిత.

 

    "నువ్విప్పుడు నన్ను నైటీలోకి మారుస్తావు" అందామె.

 

    "అంటే?"

 

    "నా చీర, జాకెట్టుని విప్పి, నువ్వు నాకు నైటీని వేస్తావన్నమాట. భయపడకు. నేను కళ్ళు మూసుకుంటాను" తన జోక్ కి తనే నవ్వింది మోహిత.

 

    అంటే తనకు ప్రామిస్ చేసినట్టుగా, మొదట మర్డర్ పూర్తయింది. కాబట్టి తనకోరిక తీరబోతొందా? ఆలోచిస్తూ తన చేతిని ఆమె భుజాలమీద వేశాడు. ఆమె కళ్ళల్లోకి కోరికగా చూశాడు.

 

    ఆ స్పర్శ ఎంతో మత్తుగా వుంది మైత్రేయకి.

 

    ఏ ఫీలింగ్ లేని కళ్ళతో ఆ చర్యల్ని గమనిస్తోంది మోహిత.

 

    పది నిముషాలు గడిచాయి.

 

    నైటీ తొడగటం పూర్తయ్యింది.

 

    పల్చటి సిల్కునైటీలోంచి కన్పిస్తున్న ఆమె దేహసంపద చూస్తున్న అతనికి గొంతు తడారిపోతోంది. గ్లాసు అందుకుని డ్రింక్ ను గడగడా తాగేశాడు.

 

    "నాకు  చేసిన ప్రామిస్  గురించి మర్చిపోయావా?" అతని ప్రశ్నకు చప్పుడు చెయ్యకుండా నవ్వింది మోహిత.

 

    "నువ్వు మర్డర్ చేశాక..... ఏ.సీ. రూమ్ లో..... నీ సెక్స్ కోరిక తీర్చడం.... అదేకదా...." అవునన్నట్టుగా తలూపాడు మైత్రేయ.

 

    "మహేంద్రని ఎవరు మర్డర్ చేశారు? నువ్వా నేనా...." అవును తను మర్డర్ చేయలేదు. ఆ ప్లాన్  ఆపరేషన్ లో తను కోపరేట్ చేశాడంతే.....

 

    "నువ్వు మర్డర్ చేసిన మరుక్షణం నా ప్రామిస్ నిలబెట్టుకుంటాను. ఓ.కె. మొట్టమొదటిరోజు..... నీకు ఫోన్లో చెప్పినట్టు రొమాంటిక్ గిప్ట్ మాత్రం ఇప్పుడే ఈ క్షణమే నీకిస్తాను. ఆ గిప్ట్ ఏంటో తెలుసా? కిస్.....

 

    నా దేహంలో నీకిష్టమైనచోట ముద్దు పెట్టుకో" అంటూ తమకపు చూపుల్తో అతనివేపు చూసింది.

 

    మైత్రేయ మొదట సందేహించి తర్వాత లేచి నిలబడ్డాడు.

 

    అతడు తనని ఎక్కడ ముద్దు పెట్టుకుంటాడు? పెదవులమీదా? లేక గుండెలమీదా? ప్రపంచంలో, ఏ  దేశంలో ఏ ఆడదైనా ఆలోచించే మొదటి ప్రశ్న అది.

 

    మైత్రేయ ఆమె పొడవాటి కురులను తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడాడు.

 

    మళ్లీ యధాస్థానంలో కూర్చుని, సిగరెట్ వెలిగించుకున్నాడు. తనని తాను కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడతను.

 

    జుత్తును మాత్రమే ముద్దాడి, తన  మీదనున్న ప్రేమను ఇలా సున్నితంగా మైత్రేయ వ్యక్తం చేస్తాడని ఊహించని, మోహిత కళ్ళల్లో ఎందుకో కన్నీటి తడి.

 

    డ్రింక్ పార్టీ రాత్రి తొమ్మిది గంటలకు పూర్తయింది. ఇద్దరూ డిన్నర్ పూర్తిచేశాక, తమ తమ  రూమ్స్ లో కెళ్ళిపోయారు.

 

    
                                          *    *    *

 

    ఉదయం పదిగంటలు.....

 

    గెస్ట్ హౌస్ వాచ్ మెన్ మోహిత, మైత్రేయలను అక్కడకు మూడు కిలోమీటర్ల దూరంలో వున్న మొసళ్ళ పార్క్ కు తీసికెళ్లాడు.

 

    ఒకవేపు కొండలు, రెండోవేపు అడవి, మూడోవేపు పాడుబడిన గుడి. ఆ గుడికి వంద అడుగుల దూరంలో చిన్న జలాశయం. చుట్టూ ఫెన్సింగ్. ఆ  పక్కనే క్యూరేటర్ కోసం రెండు గదులు.

 

    "ఇక్కడ క్యూరేటర్ వున్నాడా?" అడిగింది మోహిత.

 

    "రోజూ ఏదో టైంలో వచ్చి వెళ్ళిపోతాడు. కార్తీకమాసంలో రెగ్యులర్ గా వుంటాడు" చెప్పాడు వాచ్ మెన్.

 

    జలాశయంలో మొసళ్ళు బలంగా వున్నాయి. నీళ్ళలో ఈదుతూ, ఒడ్డువరకూ వచ్చి, నోరు తెరచుకుని, భయంకరంగా శబ్దాలు చేస్తూ, మళ్లీ నీళ్ళల్లోకి వెళ్ళిపోతున్నాయి.

 

    "ఈ మొసళ్ళు మనుషుల్ని తింటాయా?"

 

    "తెలీదు మేడం! ఇప్పటివరకూ నాకు తెలిసి ఏ మనిషినీ తినలేదు."

 

    "నీకు చెప్పి తింటాయా...." నవ్వుతూ మైత్రేయ వేపు చూసింది ఆమె.

 

    మరో అరగంటలో వాళ్ళు ముగ్గురూ గెస్ట్ హౌస్ లో వున్నారు.

 

                                       *    *    *

 

    "చూడు వాచ్ మెన్...... జయంత్ ఇవాళ రాత్రికి ఇక్కడకు వచ్చేటట్టు చెయ్యాలి. చేస్తావా?" అడిగింది మోహిత.

 

    "నేనెలా చెయ్యాగలనమ్మా" ప్రశ్నించాడతను.

 

    జయంత్ ని మర్డర్ చేయడానికి మోహిత ఎలాంటి ప్లాన్ వేసిందో ఊహించడానికి ప్రయత్నిస్తున్నాడు మైత్రేయ.

 

    "ఈయన్ని మధ్యాహ్నం తీసికెళ్ళి, జయంత్ కి పరిచయం చెయ్యి. తర్వాత జయంతే ఇక్కడికి వస్తాడు" సాలోచనగా మైత్రేయవేపు చూస్తూ అందామె.

 

    వాచ్ మెన్ వెళ్ళిపోయాక తన ప్లాన్ ని మైత్రేయతో చెప్పింది మోహిత.

 


                                     *    *    *


`
``    మధ్యాహ్నం మూడుగంటల నలభై అయిదు నిముషాలు-

 

    ఫారెస్ట్ ఆఫీసులో తన ఛాంబర్ లో కూర్చున్నాడు జయంత్.

 

    వాచ్ మెన్  లోన్నించి బయటికొచ్చాక మైత్రేయ ఛాంబర్ లోకి వెళ్లాడు.

    "వాచ్ మెన్  చెప్పింది నిజమేనా?" అనుమానంగా చూస్తూ అడిగాడు జయంత్.

 

    "నిజమే సార్!"

 

    "ఏ వూరు?"

 

    "హైదరాబాద్."

 

    "లవ్ ఎఫైరా..... లేక బ్రోకరువా.....? నిజం చెప్పెయ్."

 

    జవాబు చెప్పలేదు మైత్రేయ

 

    "డబ్బు అవసరమట గదా?"

 

    "అవున్సార్!"

 

    "రేటెంత?"

 

    "రెండువేలు.....రాత్రంతా మీ ఇష్టం."

 

    "పిల్లబావుంటుందా?"

 

    "పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్."

 

    "పి.జి. స్టూడెంటా....." ఆశ్చర్యంగా, వళ్ళంతా కదిలిస్తూ అన్నాడు.

 

    "నాకొక్కసారి నచ్చిందే అనుకో..... ప్రతి వారానికొకసారి తీసుకొచ్చెయ్. నీ కష్టం వుంచుకోనులే. స్పెషల్  అకేషన్స్ వున్నప్పుడు...... అంటే అప్పుడప్పుడు ఈ పిల్లను నువ్వు తీసుకొచ్చావే అనుకో...... నీకు రెండుచేతులా రాబడి. ఇంతకీ ఆ పిల్లకు ఇలాంటివన్నీ అలవాటే గదా? అల్లరి చెయ్యదు కదా..... నా గురించి తెలిసాక, నన్ను చూసాక నా ముందు ఏ అమ్మాయీ అల్లరి చేయలేదులే. నేనే బెడ్ మీద అల్లరి చేస్తాను" హుషారుగా నవ్వుతూ అన్నాడు జయంత్.

 

    "ఓ పనిచెయ్....... నాకు టైమ్ సెన్స్ ఎక్కువ. కరెక్ట్. టైమ్ కి వచ్చేస్తాలే...... మందు లేకుండా మగువతో కాలక్షేపం బాగోదు కదా. రెండు వైట్ హాట్ పుల్ బాటిల్స్ తెప్పించు. నేను వచ్చినప్పుడు చికెన్ సిక్ట్సీ ఫైవ్ తెచ్చుకుంటాను" చెప్పి జేబులోంచి మూడువందలు తీసిచ్చాడు జయంత్.

 

    స్టూడెంట్ అమ్మాయి గురించి ఊహించుకుంటూ, జయంత్ మన్మథ స్వర్గంలో తేలియాడుతున్న సమయంలో మరో పావుగంట తర్వాత మైత్రేయ అక్కడనుంచి బయటపడ్డాడు.

 

                                         *    *    *

 

    సరిగ్గా రాత్రి ఏడు గంటలయింది.

 

    ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్ జీపు, కొండమీద గెస్ట్ హౌస్ ముందు జీపు ఆగింది.

 

    అప్పటికే గేటుముందు వెయిట్ చేస్తున్నాడు, వాచ్ మెన్ తో సహా మైత్రేయ.

 

    "మీకోసమే వెయిట్ చేస్తున్నాం....." పలకరింపుగా అన్నాడు మైత్రేయ.

 

    "కొన్ని పనులు చీకటిపడ్డాకే చేయాలి" పెద్దగా నవ్వుతూ అన్నాడు.

 

    మైత్రేయ జీపు డ్రైవర్ కి చికెన్ సిక్ట్సీ ఫైవ్ ప్యాకెట్స్ ని వాచ్ మెన్ కు అందించాడు.

 

    వాచ్ మెన్, మైత్రేయ ముందు నడవగా, ఠీవిగా అటూ యిటూ చూస్తూ వారి వెనక నడుస్తున్నాడు జయంత్.

 

    జయంత్ జీపు దిగి, లోనికి రావడాన్ని కిటికీ రెక్కచాటునుంచి చూసి, ఆ రెక్కను మూసేసి, గబగబా బాత్ రూంలోకెళ్ళి షవర్ని ఆన్ చేసి, మెయిన్ స్విచ్ ను 'ఆఫ్' చేసింది మోహిత.

 

    అప్పటికే బాగా చీకటి పడింది. ఒకపక్క సన్నటి చలి..... రెండోపక్క కొండల్లోంచి వస్తున్నా చల్లటి గాలి......

 

    "ఈ టైమ్ లో  పవర్ కట్ ఏమిటి?" అన్నాడు మైత్రేయ. అతనికి మోహిత ప్లాన్ సంగతి తెలీదు.

 

    "ఇక్కడిది మామూలే...... గంటలో వచ్చేస్తుంది. కంగారుపడకు..... అయినా మందుకు మసక చీకటి, మగువకు దట్టమయిన చీకటి అవసరం. అప్పుడే సరసం రంజుగా వుంటుంది" నవ్వుతూ అన్నాడు జయంత్.

 

    తలుపు చాటునించి ఆ మాటలు విన్న మోహిత-

 

    'అయితే ఆ దట్టమయిన చీకట్లోనే నిన్ను చంపుతానులే' తనలో తాను అనుకుంది కసిగా మోహిత.

 

    డ్రాయింగ్ రూమ్ లో క్యాండిల్స్ ను వెలిగించాడు మైత్రేయ. గ్లాసులు సర్దాడు. బాటిల్ ఓపెన్ చేశాడు. మూడు గ్లాసుల్లో డ్రింక్ వేసి, సోడాల కోసం లోపలి గదిలోకి వెళ్ళాడు. సోడాలతో బయటికొచ్చి సోడాల్ని, ఐస్ క్యూబ్స్ ని గ్లాసుల్లో వేయబోతుండగా-

 

    "ఈ పనులన్నీ ఆ పి.జి. స్టూడెంట్  పిల్ల చేస్తే, చూడముచ్చటగా వుంటుంది. కానీ నువ్వేంటయ్యా...." విసుక్కున్నాడు జయంత్.

 

    "తను తీరుబడిగా స్నానం చేస్తోంది. పది నిముషాల్లో వచ్చేస్తోంది. మనతో కలుస్తుంది..... ఈ లోపల మనం స్టార్ట్ చేద్దాం" అంటూ ఒక గ్లాస్  ని జయంత్ కి అందించాడు మైత్రేయ.

 

    "ఆ పిల్ల తాగుతుందా...... వెరీగుడ్. చెప్పేవు కావేం..... అయితే మనం రెండు పెగ్గులు ముందుంటే, మజా మగాడి చేతిలో వుంటుంది..... చూడు మిష్టర్..... తాగిన ఆడదానితో సరసం స్వర్గమేనయ్యా" అంటూ గడగడా గ్లాసెత్తి, ఒక్కచుక్క కూడా మిగల్చకుండా తాగేశాడు జయంత్.

 

    మోహిత, జయంత్ గ్లాసులో వేసే సోడాలో మత్తుమందు కలిపింది. ఆ సోడానే జయంత్ గ్లాసులో వేశాడు మైత్రేయ.

 

    మోహిత ప్లాన్ చెప్పిన దగ్గర్నుంచి ఒకటే టెన్షన్ పడిపోతున్నాడు మైత్రేయ. గతంలో ఇదే జయంత్, రాజేంద్రకుమార్ తీసుకెళ్ళగా హాగెనకల్ ఫాల్స్ దగ్గర్లో వున్న గెస్ట్ హౌస్ లో మోహిత అపస్మారక స్థితిలో వుండగా, జయంత్ మోహితని అనుభవించాడు. ఇప్పుడామెను జయంత్ గుర్తుపడితే ప్రమాదం ముంచుకురాదా? ఆ ప్రమాదం నుంచి మోహిత ఎలా బయటపడుతుంది?

 

    "డ్రింక్ టేస్ట్ బాగుందయ్యా......" అంటూ రెండో పెగ్ ను తానే పోసుకున్నాడు జయంత్. సోడాను కూడా కలుపుకున్నాడు.  

 Previous Page Next Page