దానాదీనా చిందరవందర చేసి అంతకు క్రితం విబీర వాల్ పారేసి మరో డ్రస్సులు సూటుకేసులో సర్దేసుకుని లాక్ చేసి అమ్మయ్య అనుకున్నాడు.
ఈ సర్దటంలో అమల లెటర్ పెట్టిన షర్ట్ లెటర్ తో సహా బీరువాలోకి వెళ్ళిపోయింది.
ఎంత తెలివిగా ప్లాన్ వేసి అద్భుతంగా లెటర్ రాసి ఎంతో జాగ్రత్తతో కృష్ణ సూట్ కేసులో చేర్చటం తన తన ప్రయత్నంగా అమల చేసింది. ఇది తెలియని కృష్ణ అదే షర్ట్ ని బీరువాలో పారేశాడు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని మన పెద్దలు ఏనాడో చెప్పారు.
అక్కడ అమల చాలా నిర్భయంగా లోలోన సంతోషిస్తూ వుంది.
స్నేహితుడికి సీరియస్ గా వుందని అర్జెంట్ ఫోన్ వచ్చింది. లేకపోతే లేకపోతే ఈ మోసకత్తేని పక్కలో బల్లెంలా ఈ ఇంట్లో వుంచి తాను కదిలేవాడు కాదు. ఊరి నుంచి రాగానే చెప్పాలి దీనిపని కృష్ణ అనుకున్నాడు.
ఆ ఫోన్ దొంగ ఫోన్ అని జర్నీలో ప్రమాదం సృష్టించి కృష్ణని పరలోకానికి పంపించటానికే గొప్ప ప్లాన్ అల్లబడిందని కృష్ణకి గాని అమలకి గాని కించిత్ గాని తెలియదు.
ఆ రాత్రికి కృష్ణ బైలుదేరుతుంటే భుజంగరావు వాకిట్లోకి వచ్చాడు. అమల గుమ్మందగ్గర నుంచుంది.
"నాలుగురోజుల్లో వస్తాను మామయ్యా! జాగ్రత్త" అన్నాడు కృష్ణ.
"ఓరి నీ జాగ్రత్త దొంగలుదోలా! ఈమధ్య మరీ జాగ్రత్తపరుడివి అయావేమిటీ!" నవ్వుతూ అన్నాడు భుజంగరావు.
"రోజులు అలా వున్నాయి మామయ్యా! దొంగెవరో, దొరెవరో తెలుసుకోటం మహాకష్టంగా వుంది. మేకతోలు కప్పుకున్న పులులు మన చుట్టూతానే వుంటున్నాయి." అంటూ అమలవేపు చూశాడు.
అమల తల వంచేసుకుంది.
భుజంగరావు నవ్వుతూ "నిజమేరా" అన్నాడు.
కృష్ణ బలవంతాన దౌర్జన్యం తనమీద చేయటం పెదవులు గంటుమనేలా, భగ్గుమనేలా అతను తెలియదు తన సంగతి. నిజంగా మోసగత్తెననుకుని దౌర్జన్యం చేశాడు. అతని దౌర్జన్యం తనని బాధించలేదు. కారణం తను నిజంగా మోసగత్తె కాకపోవటమా? కృష్ణ అంటే అభి.....ఛీ......ఛీ.....అతనెవరు. తనెవరు? అనుకుంది.
"ఆహా! ఎంతటి మహానటి! అమాయకంగా ఆ ఫోజు వకటి. తానేం పిచ్చివాడెంటి నమ్మటానికి, తనని మాటలతో రెచ్చగొట్టి చిలిపిగా చూసింది. ఆ చూపుకదూ తను వళ్ళు మరిచి ప్రవర్తించటానికి కారణం. ఆ రూపం, ఆ మాట, ఆ చూపులు నర్సమ్మ రావటం కాస్త ఆలస్యం అయితే ఆమైకంలో తాను మరికాస్త ముందుకు వెళ్ళేవాడేమో! నర్సమ్మ వచ్చి రక్షించింది.
తను ముద్దు పెట్టుకున్నందుకు అమాయకంగా, అబలగా, సుకుమారిగా వణికిపోతూ భోరుమంది. ఆ..... అంటుంది అంటుంది మహానటి కదా! ఏడ్వటం ఓ లెక్కా! ఎంత నటన అయినా చేయగలుగుతుంది. అమాయకురాలు అబల అయితే ఇందరికళ్ళు ఎలా కప్పగలదు. తన పిచ్చిగాని!
"ఓహ్. రోజాతో చెప్పటం మర్చిపోయాను మామయ్యా!" అని కృష్ణ గబగబ వెనక్కి అమల దగ్గరకు వచ్చాడు.
"రోజా! నా స్వీట్! ఊరికి వెళుతున్నాను. నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను. నీకేం తీసుకురమ్మంటావ్ నేను వచ్చేటప్పుడు?" అంటూ కృష్ణ ఆప్యాయంగా అమల చెయ్యి పట్టుకున్నాడు.
అమల మాట్లాడలేదు. కళ్ళు వాల్చుకుంది. ఈ మగవాడే తన్ని ముద్దుపెట్టుకుంది అన్న ఆలోచన రాగా.
భుజంగరావు కారు డ్రయివర్ తో మాట్లాడుతూ నుంచున్నాడు అల్లంత దూరాన.