Previous Page Next Page 
యోధుడు పేజి 22

    నేనిక్కడ ఒంటరిగా బ్రతుకుతున్నా, నీ చిలిపి చేష్టలు, నీ అల్లరి మాటలే తలుచుకుని హాయిగా కాలాన్ని గడిపేస్తున్నా.

    మనం ఎన్నాళ్ళుఒంటరిగా వుండడం? మనం కలసి వుండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్ననని అప్పుడెప్పుడో నువ్వు నాకు రాసిన ఉత్తరం లోని అక్షరాల్ని ఎన్ని వందలసార్లు చూసుకున్నానో తెలుసా? నా ఫోన్  నెంబర్ అదే_ నా అడ్రస్ కూడా అదే.

    నీ ఉత్తరం కోసం, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. నీవు రమ్మంటే నేనే హైదరాబాద్ వచ్చి కలుసుకుంటాను.
   
                                                                                                               ఇట్లు                                                   

                                                                                                            నీ అర్చన

    ఆ ఉత్తరం మొత్తం చదవగానే కాశీచరణ్ ఇంటినిండా చెమటలు పట్టేశాయి. నీళ్ళతో నిండిన పెద్దసైజు గ్లాస్ కూడా డబ్బున నెత్తిమీద పగలిపోయినట్లుగా వుంది అతనికి.

    మళ్ళీ చదివాడు. మళ్ళీ కవరు మీద అడ్రస్ చూశాడు. అసలే తనేవరో, తెలీక చస్తుంటే నీవు కోట్ల రూపాయల ఆస్తికి వారసడవు అంటూ లాయర్ నీలకంఠన్ వచ్చాడు. అది నిజమో కాదో తేలికముందే ఈ అర్చన. ఆ ఉత్తరం చదువుతుంటే కాశీచరణ్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్న అమ్మాయి అర్చన అని అర్ధమవుతోంది. తనే కాశీచరణ్ అని అంటున్నారు కాబట్టి అర్చన తన ప్రియురాలి వుండవచ్చా?"

    అర్చనతో తనకేప్పుడు సంబంధం వున్నదీ గుర్తుకురావడంలేదు. ఏంట ప్రయత్నించినా అర్చనేమిటి తానెవరో తనకే గుర్తుకురావడంలేదు.

    ఎలా విషయ పరిస్థితి నుంచి బయటపడడం? ఎప్పటికి తనకు తన గతం గుర్తుకొస్తుంది?

    తన నిర్ణయాన్ని చెప్తానని ఆమెకు తను ఫోను చేస్తే డిల్లీ వచ్చిందట ఆమె.

    తను ఇక్కడకు రాకపూర్వం డిల్లీలోవున్నానని లాయర్ నీలకంఠన్ కూడా అన్నాడు.

    నీలకంఠన్ సమస్యకు తోడు పులిమీద పుట్రలా అర్చన అనే ఇంకో సమస్య తన జీవితంలోకి ప్రవేశించింది. ఇప్పుడేమ్ చేయాలి?

    ఎల్లో కలర్ పేపర్ని యధావిధిగా మడత పేట్టి బ్రౌన్ కవర్లో పేట్టి దిండు క్రింద పెట్టేసి నిటారుగా పడుకున్నాడు కాశీచరణ్.

    ఆలోచనలతో అతని మెదడు వేడెక్కిపోయింది.

    ఏది నిజం? ఎదీ అబద్దం?

    అర్చన అనే యువతికి తను జవాబు వ్రాయాలా? వద్దా? రాయక పోతే ఆమె ఇక్కడకొస్తే?

     జరిగే పరిమాణలేలా వుంటాయి?

`    ఆసుపత్రి నుంచి డిస్చార్జి అయ్యాక తనేక్కడకు వెళతాడు? ఈ లెటర్ విషయం తను ఎవరితో చర్చిస్తే బావుంటుంది? లాయర్ నీలకంఠన్ తోనా లేక డాక్టర్ మధురిమతోనా? ఆలోచనలతో కళ్ళు మూసుకున్నాడు కాశీచరణ్. ఆలోచనలతోనే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడతను.
   
                        *    *    *    *   

    "హలో మో బోయ్... హొ ఆర్యూ?" గంభీర్యమైన కంఠస్వరానికి వెంటనే కళ్ళు విప్పాడు కాశీచరణ్    ఎదురుగా లాయర్ నీలకంఠన్. చేతిలో పూలగుచ్చం. "ఎలా వుంది నీ ఆరోగ్యం?"

    బెడ్ నుండి నెమ్మదిగా లేచి, పక్కనే వున్న కేస్ చైర్లో కూర్చున్నాడు కాశీచరణ్    కాసేపు అవీ ఇవీ మాట్లాడక అడిగాడు లాయర్ నీలకంఠన్_"నీవు చిన్నప్పుడు లింగ్ షుగర్ లో ఎన్నాళ్ళున్నావు బాబూ?

    మరొక సమస్య. ఏం చెప్పాలో అర్ధం కలేడటానికి. "లింగ్ షుగర్ ఏమిటది?" అర్ధంకాక అడిగాడు కాశీచరణ్.

    "లింగ్ షుగర్ అంటే షుగర్ లో ఓ వైరైటీ కాదు. కర్ణాటక బోర్డర్లో వున్న సిటీ అక్కడ మీ నాన్న సంతోష్ కేవల్కర్ వుండేవాడు."

    "నాకా ఊరు, పేరు గుర్తుకురావడంలేదు, మీ నోటి ద్వారా ఇప్పుడే వింటున్నాను" అన్నాడు కాశీచరణ్ నిర్వికారంగా.

    "నీవు చిన్నప్పుడు ఎక్కడ పెరిగావు?" లాయర్ అడిగాడు.

    "తెలీదు,"

    లింగ్ షుగర్ వెళ్ళిన మహేందర్, అశోక్ రెడ్డి అక్కడ ఇంకా కొన్ని కేవల్కర్ కుటుంబాలునాయని ఫోన్ లో చెప్పిన మీదుట లాయర్ నీలకంఠన్ కాశీచరణ్ ద్వారా ఇంకా ఏవైనా వివరాలు మారినందుకు అతను మౌనం వహించాడు.

    "ఇంతవరకూ మీ ప్రశ్నల ద్వారా మీరు నన్ను సర్ పరిక్ చేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని సర్ ప్రైజ్ చేయబాబోతున్నాను" అంటూ దిండు క్రింద నుంచి కవర్ని తీసి అతనికి అందించాడు కాశీచరణ్.

    ఆ ఉత్తరం వైపు అగాడిగా చూసి గబగబా చదవడం ప్రారంభించాడు లాయర్ నీలకంఠన్.

    ఆ ఉత్తరాన్ని చదువుతున్నప్పుడు నీలకంఠన్ హావభావాలనే గమనిస్తున్నాడు కాశీచరణ్. చదివి ఆ ఉత్తరాన్ని టీపాయ్ మీద పెడుతూ నవ్వాడాయన.

    "ఎందుకు నవ్వుతున్నారు?" అడిగాడు కాశీచరణ్.

    "మానవమాత్రులకి గానీ, సైన్సు కి గానీ సాధ్యంకాని సమస్యల పరిష్కారాన్ని దేవుడే చూపిస్తాడంటారు. కరెక్ట్ టైం కి నీకి లెటర్ వచ్చింది" అన్నాడు నీలకంఠన్ లాయర్ సాలోచనగా.

    "మీరేం అంటున్నారో నాకేం అర్ధంకావటంలేదు."

    "అందర్నీ మర్చిపోయినా, అన్ని విషయాలు మర్చిపోయినా నువ్వు ప్రేమించిన అర్చనను_ నిన్ను ప్రేమించిన అర్చనను మర్చిపోలేవు"

    ఏం మాట్లాడాలోతెలీక కళ్ళప్పగించి చూస్తున్నాడు కాశీచరణ్ అయన వైపు.

 Previous Page Next Page