Previous Page Next Page 
కాలనాగు పేజి 22

    ఏళ్ళకొద్ది బ్రతికిన పాము శిరస్సున మని వెలుస్తుందట! అది వెలుగు వెన్నెలని విరజల్లుతుంది_ట! అన్నీ ట! ట! చూసిన వాళ్ళు_ లేరు_ ఒకవేళ ఎవరయినా చూశామన్నా అని హిలూసిషన్ అంటారు? వీళ్ళు, భ్రమ ఎంతసేపు. కానీ అది శాశ్వితంగా వుంటుందా?

    మణి లభించిందనిచెప్పే వాళ్ళుండినారట! ఆ మణి ప్రభావంతో మణి- మంత్ర ఔషధంతో రాగాలు కుదుర్చుతారట_ ఎన్నో అద్బుతాలు చేశార్ట! ఏవీ అమణులు_ మాణిక్యాలు_వజ్రాలు_వైడూర్యాలు.

    పాములున్నాయి_మహిమగల పాములున్నాయి. దివ్యమైన పాములున్నాయి_ వాదనకే అనుకుందాం_ ఉన్నాయని ఒప్పుకుందాం! నాటికి కామరూప విద్య వుందనీ ఒప్పుకుందాం....

    అయితే నేం?

    ఆ ప్రభావ నా మెడకే చుట్టుకోవాలా?

    ఈ నాగ కన్య నా కంఠహారం కావాలా?

    నిజానికి సర్వజ్ఞాడైన శంకరు డొక్కడే పాముల్ని మెడకి వేసుకో గలడు. హారంగా వేసుకున్నా, భూషనంగా ధరించినా, నడుముకి బెల్తులాగా బిగిమ్చుకున్నా అయన కావుక్కదికే చెల్లు.

    ఆ మాటకి వస్తే అసలు శివుడున్నాడా? ఎందుకు లేదు? మరి శివుడుంటే సంనగాలున్నాయి- పన్న గేమ్ద్రులా వుంటారు_"

    'ఏమిటి దీర్ఘాలోచనలో పడ్డావు?' పరమ సరళంగా పలుకరించింది ఉలూచి.

    'మీ గురించే!'
            
    'నీ ఉఉహలన్నీ నాకు తెలుస్తూనే వున్నాయి. అదంతా నిజమే. శివుడున్నాడు, దేవుడున్నాడు, మేం మున్నం. మాకు కామరూపం వుంది చూస్తున్నావుగా నన్ను.

    'నేను నమ్మను-'

    'ఎందుకు నమ్మవు! నమ్మే ఆలోచించావు అలాగా! ఆదిత్యా! పాములు అందరికీ కనిపించవు. అడ్డురావు. కాతెయ్యవు. తొలగిపోతాయి. దయతో, ఇంకా దయవస్తే కామా రూపంలో నాలా కనిపిస్తారు. కక్షపడితే కాటువేస్తాం, కబళిస్తాం. తరిమి తరిమి కాటువేసి వేసి చంపుతాం!'

    ఒక్కక్షణం అతని వెన్నుగుండా భయం చలి వాయువులా ప్రవహించింది శరీరం రోమాంచితమైంది.

    'భయపడక నిన్నేం చెయ్యను!'

    'ఎందుకు!'

    ,నేను నిన్ను ప్రమిస్తున్నాగా!'

    ,మన మధ్య ప్రేమేమిటి? నువ్వు నాగాజటివి. నేను నరుడ్ని'

    'ఆ సంభంధం గురించి అప్పుడే చెప్పాను. నేను తగిన వాడివి!'

    'ఉలూచీ! నేను యీ జన్మలోనూ నిన్ను ప్రేమించను'

    'ప్రేమిస్తావ్! తప్పదు!'

    'ఏం?'

    'లేకపోతే పము కాటుకి_ పాము పగకి బలి అవుతావు'

    'ఎవరు కాటు వేస్తారు!'

    'తక్షకుడు!'

    'ఎందుకు?'        
        
     నాకు బందువు కాబట్టి!'

    'వాసుకి మొదలైన వాళ్ళు బంధువులు కరా?

    'మేమంతా ఒకటే జాతి_'

    'మనమంతా అన్లేదు నువ్వు-'

    నవ్వింది 'ఆమె'... అతని ఊహ అర్దమైంది.

    'ఇన్నాళ్ళు నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. కానీ నేను తలుచుకుంటే నువ్వు నన్ను వెంబడిస్తూ రావాలి ఆడదాని మహాత్మ్యం నీకు తెలీదు_'

    'ఎందుకీ రభస నేను స్మద్యని తప్ప_'

    'ఆదిత్యా!' గర్జించింది ఆమె. ఆమె ముక్కుపుటాలు బాగా విస్తృతమయ్యాయి. గాలి రక ఎగరోప్పే మనిషికి మల్లె ఆమె ఉచ్చ్వశ నిశ్వశవాసాలుదీర్ఘమలయ్యాయి. గలి పెల్చుకునే సర్పశ్రేష్టలా వుంది ఆమె... "నువ్వు సంధ్యని పెళ్ళాడాటానికి వీల్లేదు. ఆమె గణాచారి. దేవతా నివేదితమైన  ఆమె యవ్వనం "జీవనం" జీవం అన్నీ దేవుడికే చెందాలి. మనిషివైన నీకు కాదు-"

    నవ్వేడు 'నీ వాదనలో ఎంత లోపం వుందో అలోచించు' అన్నట్టుగా వుంది ఆదిత్య నవ్వు

    'నవ్వు సంధ్యని వదిలేయ్!'

    తల ఆడించాడు అడ్డంగా

    'ఆదిత్యా!' అరుంధతి కంఠం వినిపించింది అవాలి గదినుంచి.

    చప్పున నుంచుంది ఉలూచి. చకచకా కిటికీ వద్దకి నడచి వెళ్ళింది ఒక్క పరుగులో_

    అంతలో గదిలోకి ప్రవేసించింది అరుంధతి.

    సరిగ్గా ఆ సమయానికి లావుగా, పొడవుగా వుంది నిగనిగలాడుతూ, బుసలు కొడుతూ, నాలికలు చస్తూ కిటికీ గుండా బయటికి వెళ్ళింది ఓ నల్ల త్రాచు 'కాలనాగు."

    అది గమనించిన ఆదిత్య ఆశ్చర్యచకితుడయ్యాడు.

    'ఏమిటి?' అంటూ వచ్చింది అరుంధతి.
   
   
                                     21


    ఆమె కేదో సమాధానం చెప్పి పంపేడు ఆదిత్య.

    'ఎవరితో మాతాడుతున్నావ్! అందమే.

    'అబ్బే ఎవరూ లేదే!' అన్నాడు ఆదిత్య.

    'మాటలు వినిపించాయే!'

    "భ్రమ పడ్డావేమో! అన్నాడు  ఆదిత్య.

    "భామనా? దాదాపు అయిదారు నిమిషాలు నీ గొంతు ఆగి ఆగి వినిపించింది".... సంధ్య అనే మాట కూడా వినిపించింది"

    చప్పున జవాబు చెప్పలేడతాను ఆమెవైపు చూశాడు.

    "సంద్యా... సంద్యా..."

    "ఎవర్రా అమ్మాయి?"

    "అమ్మా! మళ్ళీ చేబుతాన్లే !"

    "నీ యిష్టం... అయినా ఏమిటి యీ వేలపుడు లైట్లు వేసుకుని యిలా తలుపు వద్ద నంచునావ్?"

    "అదా! అది_ ఫోన్ మోగినట్టుగా అనిపిస్తే లేచి వెళ్ళా! ఫావున్లేదు. ఏం లేదు_"

    "ఫోనా?"

    "అఁ"        
 

 Previous Page Next Page