పదంతస్థుల ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ముందు ఒక్కొక్క కారే వచ్చి ఆగుతోంది.
ఒక్కొక్క కారు ఐదు లక్షలకు తక్కువవుండదు. వాటి వెనుక సీట్లోంచి దిగుతున్న ప్రతివ్యక్తి వెనుక లెక్కకుమించిన ఆస్తులుమూలుగుతున్నాయి.
అయినా ఓ ఒక్కరి మొఖంలోనూ కళ లేదు-పాలిపోయిప్రళయం ముంచుకువస్తుందన్న భయాందోళనలు స్పష్టమవుతున్నాయి.
ఎవరికివారే ప్రతిఒక్కరూ మరొకరితో తమ బాధను వెళ్ళబోసుకుంటున్నారు.
ఓ అరగంటలో టెక్సుటైల్స్ ఇండస్ట్రీ చక్రవర్తుల కాన్పరెన్సు హాల్లో సమావేశమయ్యారు.
దాదాపు రావలసిన వారందరూ వచ్చేసినట్లే- ఇక మిగిలింది ఒకే ఒక్కరు- భూపతిరావు.
ముంచుకురానున్న టెక్సుటైల్ పారిశ్రామిక ప్రపంచ మహాకీలాగ్నిలో ఎవరి భవిష్యత్ ఏమవుతుందోనన్న భయాందోళనలు. అక్కడున్న ప్రతి ఒక్కరిలో సత్యరాజ్ ని నల్లిలా నలిపివేయాలన్నంత ఆవేశం పరవళ్ళు తొక్కుతోంది.
సరీగ్గా అదే సమయంలో సత్యరాజ్ భాగ్యరాజ్ మృదువుగా తన మీసాన్ని మెలేస్తూ అడిగాడు.
"ఆ.......దాదాపు-కాని" ఆగాడు సత్యరాజ్.
"నీకు కానిపనులు! సందేహాలా?!" భాగ్యరాజ్ ఆశ్చర్యపోయాడు.
"అవును- నా వెనుక 60 శాతం కార్మికవర్గం నిలబడుతుంది. ఈ వర్గంతోనే ఇండస్ట్రీ ని ఫ్రీజ్ చేయగలను__కాని మిగతా 40 శాతం కూడా నావెనుక నిలిస్తేనే ఘనవిజయం సాధించినట్లు......"
"మరందుకు ఏం చేస్తున్నావ్.....?" భాగ్యరాజ్ కంఠంలో ఆసక్తి వ్యక్తమయింది.
"సామంత్ ను రంగంలోకి దింపే ప్రయత్నాలు ప్రారంభించాను. అది ఎప్పుడు సక్సెస్ అయితే అప్పుడే జెండాలు పైకి లేస్తాయి."
"డానికి చాలా కాలం పడుతుందా?"
"పటవచ్చు__పట్టకపోవచ్చు"
"నీ మీద నీ మనుష్యుళమీద నమ్మకం లేకకాదు-సామంత్ నిజాయితీ మీద కొండంత నమ్మకం ఉంది గనుక...."
భాగ్యరాజ్ లేచి చిరాగ్గా పచార్లు చేస్తున్నాడు.
అంతలోనే భాగ్యరాజ్ కి వేరే ఆలోచన వచ్చింది__సత్యరాజ్ నాటకం ఆడటం లేదుకదా?!
* * *
భూపతిరావుకి ఆ రాత్రి నిద్రపట్టాలేదు-ఎలాంటి ప్రమాదాన్నయినా తనకు లాభించేలా మల్చుకోవటం భూపతిరావుకి వెన్నతో పెట్టిన విద్య.
ఒక ప్రమాదాన్ని తట్టుకొని, రెండో ప్రమాదాన్ని అనుకూలంగా మల్చుకోగలగాలి_____ఎలా?
రాత్రి రెండవుతుండగా క్రింద ఫ్లోర్ లోకి దినేష్ రూమ్ తలుపు తట్టాడు- అప్పటివరకూ ప్రోడక్షను వ్యవహారాలు చూసుకొని అప్పుడే లైట్ ఆర్పేసి పడుకోబోతున్న దినేష్ టక్కున లేచివచ్చి తలుపు తీసాడు ఎదురుగా తండ్రి! అంత రాత్రివేళ!!
దినేష్ పక్కకు తొలగిదారిస్తూ "రండి నాన్నగారు_" అన్నాడే తప్ప ఈవేళప్పుడు ఎందుకొచ్చారు? ఏం పని బడిందని అడగలేదు.
భూపతిరావు ఒకే అడుగులోపలకు వేసి "ఓ భయంకరమైనపద్మ వ్యూహం మన వెనుక ఉచ్చులు బిగుడుకుంటోంది. మనకు నమ్మకమైన వ్యక్తులుంటే తప్ప ఈ సుడిగుండంలోంచి బయటకు రాలేం_ వెంటనే పెదబాబుకి టెలిగ్రామ్ ఇచ్చి వెంటనే రమ్మనమను-మరో విషయం మద్రాస్ బీసెంట్ బీచ్ లో నిర్మాణంలో ఉన్న మన కొత్త యూనిట్ సాధ్యమైనంత త్వరలో ప్రోడక్షనులోకి దిగిపోవాలి___" భూపతిరావు యుద్ధ ప్రాతిపదికమీద చెప్పుకుపోతున్నాడు-
"విమల్ బ్రాండ్ నేమ్ తో బట్టల పరిశ్రమలోకి పదిహేనుసంవత్సరాల క్రితం ఓసాధారణ వ్యాపారస్తుడిలా, కేవలం పదివేల రూపాయల పెట్టుబడితో దిగిన రిలయన్సు టెక్స్ టైల్స్ ఇండస్ట్రీస్ అధినేత ధీరూభాయ్ అంబాని నేడుభారతీయ పారిశ్రామిక రంగంలో సంచలనం సృష్టిస్తూన్న ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త. దశాబ్ధాలుగా అంచలంచలుగా పెరుగుతూ తమ పారిశ్రామిక సామ్రాజ్యపు ఎల్లలు పెంచుకొంటూ వస్తూన్న టాటా, బిర్లా, దాల్మియా, శ్రీరామ్, బజాబ్, ఎ.సి సి,కాల్గెట్, పామోలిన్, ఒ.టి.సి, పెయికోలాంటి జెయింట్ కంపెనీల అమ్మ కాల్ని, టర్నోవర్ ని, డివిడెండ్స్ ని అధిగమించి ముందుకెళ్ళాడు ధీరూభాయ్ అంబాని.
శతాబ్దాలుగా బట్టల పరిశ్రమలో నియంతలైన డి.సి.ఎమ్, బొంబే డైయింగ్, రిమాండ్స్, దినేష్ సూటింగ్స్, డిగ్ జామ్, యస్. కుమార్, గ్వాలియర్, మఫత్ లాల్ లాంటి కంపెనీలకు తీవ్రమైన పోటీ ఇచ్చిన ధీరూభాయ్ అంబానీపై రాజకీయాలు మొదలయ్యాయి.
ఈ సందర్భంలో బట్టలపరిశ్రమ అధినేతలబలాబలాల్లో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. మార్కెట్ లో టెక్స్ టైల్ బ్రాండ్స్ ఇమేజ్- వినియోగదారులు, రిటైల్, హొల్ సేల్ డీలర్స్ దృష్టిలో మార్పు చెందటం ప్రారంభించింది.
అంబాని ఆలోచనల్ని ఒక్కమాటలో చెపుతాను-విదేశీ వలసలు ఎక్కువ కావటం, విహారయాత్రల రద్దీ పెరగట మూలంగా విదేశీబట్టలు తరుచూ ఇండియన్ కన్పూమార్ మార్కెట్ లోకి విరివిగా రావటం ప్రారంభించాయి.
కస్టమ్స్, ఎక్సైజ్ వాళ్లు ఎయిర్ పోర్ట్ లో, హార్బర్స్ లో విదేశీ వస్తువుల మోజులో కొన్ని వస్తువుల్ని తమకిస్తే మిగతా వాటిని వదిలేసే ఓ ద్వారం ప్రదర్శించటంతో ఇదీ మరింతగా పెచ్చు పెరిగింది. ఆ వస్తువులు చాలా తేలిగ్గా సగటు భారతీయ వినియోగదారుడి దృష్టిలో పడటంతో వాటి ఫినిషింగ్ పట్ల ఉత్తేజితులు కావటం ప్రారంభించారు.