Previous Page Next Page 
యోధుడు పేజి 21

    ఎంతటి హిడింబిలాంటి గమ్యలిగంపైనాసరే తను అందాన్ని పొగిడితే చాలు ఆడవాళ్ళు యిట్టే ప్రసన్నులైపోతారని ఆ రోజు ఉదయాన్నే హాస్పిటల్లోని సీనియర్ బోయ్ చేసినఉపదేశం గుర్తుకు తెచ్చుకుని ఆ పాచికను వేశాడు శివానందం.

    "అందాన్ని చూస్తున్నాను, అరాదిస్తున్నాను, ఆనందిస్తున్నాను" అనే మూడు మాటలు వేదవాక్కుల్లా పనిచేశాయి మేరీమీద.

    గయ్ మని లేవాబోయిన మేరీ నాగస్వరం విన్న నాగుపాములా ఆగిపోయింది.. సూటిగా శివానందం వైపు చూసింది. ఉద్యోగరీత్యా తక్కువ హొదాలో వుండడం తప్ప అతనిలో ఏ లోపమూ లేదనిపిందామెకు ఆ క్షణాన్నే.

    "ఆఖరుసారిగా చెపుతున్నాను. నీవు నాకు నచ్చావు. పెళ్ళిచేసుకుంటానని అడుగుతున్నాను తప్పా? అదీ పైసా కట్నం లేకుండా. నువ్వావుప్పుకున్నావనుకో ఆ కాళీసీసాలు పక్కన పడేసి నాతో వచ్చీ. డాక్టర్ మధురిమ గారి సాక్షిగా పెళ్ళిచేసుకుందాం" సీరియస్ గా అన్నాడు శివానందం.

    దూరం నుంచి ఇద్దరు జూనియర్ డాక్టర్లు శివానందం మాటల్ని వింటూ నవ్వుకున్నారు.

    "పేళ్ళట... పెళ్ళి... ఛీ...ఫో" అంతకంటే మరేం అనలేక ముందుకు సాగిపోయింది మేరీ.

    నిజంగా శివానందం అంటే అసహ్యముంటేఅప్పుడే చెంప పగలగోట్టేది. రోజురోజుకూ తను దగ్గరవుతూన్నాడు. అతన్ని ఆపడం ఎలా?

    పేషెంట్ గా హాస్పిటల్ కి వచ్చినా, శివానందం మంచితనాన్ని గుర్తించి డాక్టర్ మధురిమ వర్డ్ బోయ్ గా వుద్యోగం యిచ్చింది. వర్డ్ బోయ్ స్థానం నుంచి అతను తన భర్త స్థాయికి వచ్చేస్తాడా? ఆ ఊహా ఆమెలో కలవరం కలిగించింది.

    ఆ ప్రోపెషనల్  లోకి వచ్చిన కొత్తలో అందరిలాగే మేరీ పెళ్ళి కలలు కంది. తను కొంతమందిని ఇష్టపడినా, ఆ కొంతమంది మేరీని యిష్టపడలేదు. కట్నం.హొదా కొన్ని పెళ్ళిసంబదాలకు అడ్డు నిలిచాయి. తనని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు నుంచి శివానందంతన పట్ల అభిమానాన్నే ప్రదర్శిస్తున్నాడు.

    చాలాస్దార్లు మౌనంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అతను నిర్భయంగా, ధైర్యంగా ప్రేమ విషయాలు మాట్లాడటం మొదలెట్టదు ఈ మధ్య.

    అతని కోరికను అంగీకరిస్తే? ఆ ఆలోచన రావడం తడవుగా మేరీకి చెమటలు పట్టేశాయి. ఖాళీసెలైన్ సీసాను బీన్ లో పడేసి_ కాశీచరణ్ రూమ్ కి వెళ్ళాలని మలుపు తిరిగేటంతలో రిసెప్షనిస్టు వచ్చింది చేతిలో బ్రౌన్ కలర్ కవరుతో.

    "మేరీ!  కాశీచరణ్ స్పీడ్ ఫోస్ట్ లో వచ్చింది కవర్. అయన కిచ్చేయ్" కవర్ని మేరీకిచ్చి వెనక్కీ వేల్క్లిపోయింది రిసెప్షనిస్టు. కవరు అందుకుని. కాశీచరణ్ రూమ్ లోకి నడిచింది మేరీ.

   
                        *    *    *    *
   
    మేరీ రూమ్ లో ప్రవేసహించేసరికి ఆ రోజు పేపర్ చూస్తున్నాడు కాశీచరణ్
   
    "స్పీడ్ పోస్టులో మీకో లేటరు వచ్చింది" అంటూ   ఆ కవర్ని కాశీచరణ్ చేతికిచ్చింది.

    "నాకు లేటారా... ఎక్కడ్నుంచి?" ఆ కవరు అందుకుని దానిమీద చక్కగా టైపుచేసి వున్న తన పేరు, హాస్పిటల్ అడ్రసును చూశాడు. ప్రం అడ్రస్ కోసంచూశాడు. ఎక్కడా కనిపించలేదు.

    గబుక్కున కవర్ని చింపి, పట్టుకోవడానికి ఏంట శ్రమపడ్డానో తెలుసా? అలా చెప్పా చెయ్యకుండా హైదరాబాద్ వెళ్ళిపోయావేమిటి? ఆ మొదటి వాక్యం చదవగానే అతని కళ్ళు ఉత్తరం చివరనున్న సంతకం వైపు పరుగులు తీశాయి. మిస్ అర్చన_ లింగ్ షుగర్.

    ఎవరీ అర్చన? అని తనని తాను ప్రశ్నించుకుని మళ్ళీ మొదటి నుంచి ఉత్తరం చదవడం ప్రారంభించాడు కాశీచరణ్ .

    హలో చరణ్ నీ అడ్రస్ పట్టుకోవడానికి ఏంట శ్రమపడ్డానో తెలుసా?చెప్పా చెయ్యకుండా హైదరాబాద్ వెళ్ళిపోయావేమిటి?

    నన్ను డిల్లీకి రమ్మనమని, ముందురోజు ఫోన్ చేసి చెప్పిన నీవు ఆ మాట మర్చిపోయావా?


    ఆ రోజు నీ కోసం బెంగుళూర్ ఎక్స్ ప్రెస్ లో డిల్లీ వచ్చిన నేను రెండు గంటలసేపు నువ్వొస్తావని ఎదురుచూస్తూ డిల్లీ రైల్వే ప్లాట్ ఫాం మీద గడిపాను.

     నేనోస్తానని తెలిసి కూడా హాస్ ఓనర్స్ కీ యివ్వలేదు. అక్కడి నుండి నీవు పనిచేసే యాడ్ ఏజెన్సీకి వెళ్ళాను. నీవు మూడు రోజులు సెలవుపేట్టి హైదరాబాద్ వెళ్ళానని తెలిసి, ఏంట బాధపడ్డానో తెలుసా?

    సడన్ గా నీ ప్రోగ్రామ్  అలా మారిపోయిందేమిటి? మన జీవితానికి సంబంధించి నువ్వు ఒక  నిర్ణయాన్ని తీసుకొంటున్నానని పర్సనల్ గా ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నావని పర్సనల్ గా ఆ నిర్ణయాన్ని నాతో చెప్పి నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తానని వెంటనే నన్ను బయలుదేరి రమన్న విషయం ఎందుకు మరచిపోయావో నాకర్ధం కాలేదు. ఇంతలో నీకు ఏమైంది?

    ఈ మధ్యనే నాకో విషయం తెలసి చాలా బాధపడ్డాను, ఏదో అర్జంటు పనిమీద ఆంద్రా ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ బయలుడేరి బేబీనగర్ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన రైల్ ఎక్ల్సిడెంట్ లో తీవ్ర గాయాలు తగిలి శుశ్రుత నర్సింగ్ లో చేర్చబడి ట్రీట్ మెంట్ పొందుతున్నావని తెలిసింది.

    పోనీలే నువ్వు ప్రస్తుతం కోలుకుంటున్నందుకు ఆనందంగా వుంది. హైదరాబాద్ నుండి ఇక్కడకు రాకుడదు. ముఖాముఖి గా మాట్లడుకుని ఎన్నిరోజులైందో తెలుసా?

    నేను పనిచేస్తున్న ఆఫీస్ బాస్ చండశాసనుడని నీకు తెలుసు. లేకపోతే నీడలా నీ వేంటే వుండనూ.

 Previous Page Next Page