Previous Page Next Page 
మనస్విని పేజి 22


    
    "ఏమిటి?"
    
    "గీ........తాం.......జ.......లి"
    
    "గీతాంజలి"
    
    "అవును"
    
    "అబ్బ! ఎంత బావుంది!"
    
    మౌనంగా వింటూ కూర్చుంది.
    
    "గీతా!"
    
    ఉలిక్కిపడింది.
    
    "ఏం అలా అయ్యావ్?"
    
    "ఏంలేదు"
    
    "కాదుచెప్పు"
    
    "కాదులేచెప్పు"
    
    "ఏమీలేదంటే"
    
    "మరిఏమిటో అది?"    

 

    మౌనంగా జవాబు చెప్పింది.
    
    "గీతా!"
    
    "ఊ"
    
    "ఓపాట పాడు"    

 

    గుండెఝల్లుమంది.
    
    "ఊ..పాడు"
    
    "నాకుపాడటంరాదండీ....."
    
    "అహా అలా కాదు"
    
    "నిజంగా రాదండీ"
    
    "పాడమంటే....."
    
    అతని కంఠంలో ధ్వనిస్తున్న గోముకి మంకుతనానికి ప్రాధేయతకు ముగ్గురాలైంది. సిగ్గు పడింది. కరిగిపోయింది.
    
    "పాడనా......"
    
    "ఊ....."
    
    "ఊ--ఎంతమంచిదబ్బా-మాగీత-బంగారు"
    
    కదిలిపోయింది గీతాంజలి
    
    "పాడు"
    
    కంఠం సవరించుకుని పాడబోయింది.
    
    బయటినుంచి ఎవరో తలుపు తట్టారు.
    
    "ఎవరో పిలుస్తున్నారు"
    
    "పిలవనీ"    

 

    "ఊహూ అలా కాదు.......పిలిస్తే వెళ్ళాలి"
    
    "మనం పిలిస్తే వస్తారా?"
    
    "రారు"
    
    "మీరు బంగారుని---దేవతని---తప్ప ఇంకెవర్నీ చూడరుగా?"
    
    "మరి నీవో"
    
    "చూడాలి"
    
    "ఎందుకో"
    
    "మీకోసం?"
    
    "నిజం"
    
    "నిజం"    

 

    "అయితే వెళ్ళు"
    
    వెళ్ళబోయింది
    
    "ఇదిగో--"
    
    "......."
    
    "సారీ.....అలవాటుగా వచ్చింది గీతా---"
    
    "........"
    
    "త్వరగా రావాలి"
    
    "కచ్చితంగా"
    
    "ఊ"
    
    తలుపు తీసుకుని బయటికి వచ్చింది.
    
    డాక్టర్ అనంతంగారు, జనరల్ హాస్పిటల్ డాక్టరుగారూ, సారధి ముగ్గురూ దారంవద్ద నిలుచుని అంతా గమనించారు. బయటికి వచ్చిన గీతాంజలితో అన్నాడు డాక్టర్ అనంతం.
    
    "చూడమ్మాయ్--అతను ఇంతకు పూర్వం నీకు తెలుసా--"
    
    "లేదండీ"
    
    జనరల్ హాస్పిటల్ డాక్టర్ అన్నారు.
    
    "లేదు డాక్టర్! అతనికి ఈ ప్రమాదం జరిగాక తెలివిలోకి వస్తూనే తొలిసారిగా చూసింది ఈమెనే! అప్పటినుంచీ అతను ఆమెని తప్ప మరెవరినీ దగ్గరకురానివ్వటం లేదు"
    
    "ఇంతకు పూర్వం పరిచయం ఏమి లేదు?"
    
    "పరిచయం అంటే అతను కాలేజీలో చదివేప్పుడు ఈమెకూడా చదివేది-చూసేవాడు-అంతే తర్వాత పిచ్చిఎత్తాక రెండుమూడు పర్యాయాలు మాత్రం కలుసుకున్నారు.
    
    కాబోలు-అంతేకాదు ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆమె అక్కడే వుంది-ఆమెనుదెబ్బవేయటానికి వెళ్ళే ఈ ప్రమాదంకొని తెచ్చుకున్నాడు"
    
    మౌనంగా విన్నాడు డాక్టర్ అనంతం. మెల్లిగా కన్సల్టింగ్ రూమ్ కి దారితీశాడు. ఆయన వెనకాలే ముగ్గురూ వెళ్ళారు. సారధివైపు చూస్తూ అన్నాడాయన.    

 

    "మిస్టర్ సారధీ! ఇతనికీ మీకూ ఏమైనా బంధుత్వంలాంటి సంబంధం వుందా?"    
    
    "ఏమీలేదండీ! ప్రమాదం జరిగింది-మా సమక్షంలో అందులో కొంత కాకున్నాకొంతైనా మా పొరపాటూ వుంది. అందుకే తోటిమానవుడికి సహాయం చేయాలని ఇక్కడికి తీసుకుని వచ్చాం. అంతేకాక అతను మా కాలేజిలో చదివేప్పుడు కొంచెంపరిచయం వుంది. అంతకుమించి మరే బంధమూ సంబంధమూ లేదు"    

 

    డాక్టరు మళ్ళీ గీతాంజలివేపు చూశాడు. అడ్డంగా తలవూపింది కోపంతో-నవ్వుకున్నాడు డాక్టర్ అనంతం.
    
    "నావల్ల ఈ ప్రమాదం జరిగింది అనే భావనా, పైగా పిచ్చివాడు అనేదయ, సానుభూతి తప్ప మరేమిలేదు డాక్టర్ గారూ" అంది.
    
    కుర్చీలోంచి లేచి మౌనంగా పచార్లు చేస్తూ అన్నాడు.
    
    "చూడండి-అతను మీకు బంధువు కాడు ఏదో సానుభూతి సహాయం తాత్కాలికం మాత్రమే! అతనికి పిచ్చి నయం కావాలంటే మీరు ఏమీ సహాయం చేయలేకపోవచ్చు-కానీ-అతన్ని అలా వదిలేయలేము-అలా అని ఏ హాస్పిటల్లోనో చేర్చితే అతను చేసే రాద్దాంతంభరించటం కష్టం-పైగా అతని పిచ్చి మరింత అధికం కావచ్చు. ఇప్పుడు మనిషిలో వున్న సౌమ్యతా, సరసం అన్నీ మాయమై వాటిస్థాన్నే క్రోధం, ఈర్ష్య, అసూయ, ఏవగింపు బయల్దేరవచ్చు"
    
    ఒక అరక్షణం ఆగి అన్నాడు;
    
    "పైగా అతన్ని బలవంతంమీద బంధించో లేదా మరేదైనా చేసోవైద్యం చేయాలంటే చాలా కష్టం. అది చెడుగే అవుతుంది చివరికి-కొద్దికొద్దిగా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న అలాంటివాడికి మైల్డ్ గా వైద్యం ఇవ్వాలేకానీ మరేదైనా అయితేతిరిగి అతనికి పిచ్చితిరగబెడుతుంది. అది కచ్చితం"
    
    ఆయనమాటలకి అడ్డంవస్తూ అన్నాడు సారధి'
    
    "మరేమిచేయాలి డాక్టర్"

 Previous Page Next Page