Previous Page Next Page 
మనస్విని పేజి 21

 

    "రిజల్ట్స్" ఓ మైగాడ్......రోజులు ఎంత త్వరత్వరగా పరిగెడుతున్నాయ్-ఏదీఏదీ చూడనీ - 1150.....51.....అరేనా నంబరు లేదే-కంగారుగా అడిగాడు.
    
    నవ్వుతూ అంది మీనా.
    
    "సెకండ్ క్లాసులో చూడు మధూ....."
    
    "అబ్బ....సెకండ్ క్లాస్"
    
    "కంగ్రాచ్యులేషన్స్"
    
    "అలాకాదు"
    
    "మరి......కృతజ్ఞతాభివందనాలు అనాలి.....ఇదంతా నీ ప్రోత్సాహమే-ముందు నీకు కృతజ్ఞతలు తెలపాలి నీ పట్టుదలేలేకుంటే నాకు ఏదీ రాదు-ఈ ఫలితం నీదే!"
    
    "అదేంమాట యూనివర్శిటీకి రాసి అదే క్లాసు నాకు ఇప్పించు"
    
    "ఎలాగూ అది ఇద్దరిదీ కాదా?"
    
    నవ్వింది.    

 

    కొద్దిసేపయ్యాక అంది.    

 

    "నీలోస్వార్ధం ఎక్కువ పాళ్లుంది మధూ......నీ రిజల్ట్ చూశావు కానీ సారధి, గీతాంజలి వాళ్ళ రిజల్ట్ అడిగావా?"
    
    "సారీ! అనుకోని ఆనందం హఠాత్తుగా మీధపడితే మనస్సుకొంచెం ఆలోచనలకి తావివటంలేదు-ఇంతకేక్లాసులో పాసయ్యారా?"  

 

    "బి.ఎస్పీవాళ్ళకి క్లాసు రాక ఆర్ట్స్ వాళ్ళకి క్లాసు వస్తుందా? ఇద్దరూ సెకండ్ క్లాసులో పాస్యయారు-జంట బి.ఎస్.సి వేసుకోవచ్చు"    

 

    "ఒక్క ఏడాది ఆగితే మనమూ జంట బి.ఎ. వేసుకోవచ్చు"
    
    పొడిచెట్టుచూసింది మీనాక్షి.
    
    నవ్వేడు మధురం
    
    జతకలిపింది మీనాక్షి.
    
    "అదన్నమాట.....అసలు విషయం అంతా?"    

 

    "అవును"
    
    "డాక్టరేద్వేషం......భయంకావచ్చు.....మనిషిలో అణగారిపోయిన తీరనికోరికల వల్ల కొన్నికొన్నిసార్లు మనస్చాంచల్యం కలిగితే అతనికి-అలాంటివిషయాల్లో, ఆ పరిసరాలలోనిల్చునే వాళ్ళంటే చెప్పలేని విసుగుకోసం ద్వేషం ఏర్పడుతుంది"  

 

    "నిజమండీ-అతనివిషయంలో అలాగే జరిగింది......గ్రాడ్యుయేటుకావాలని తర్వాత బి.ఇడిచేసి హాయిగా, సంతోషంగా, బాధ్యతా రహితమూ, ప్రశాంతత మూర్తీభవించిన టీచింగ్ ప్రొఫెషనల్ లో ప్రవేశించాలని అతనికి అనుకోకుండానే చిన్ననాటినుండీ ఉన్న ఊహ మధ్యలో కవిత్వపు వాసన తగిలింది. కవిత్వం మనిషిని పట్టుకుంటే అది అంత సులభంగా వదలదండీ. అతడు ప్రాణం వదలొచ్చు కానీ-దాన్ని వదలదు-దాంతోపరీక్షలు వరుసగా తన్నేశాయ్ విద్యనీ విద్యా విధానాన్నీ తిట్టేవాడు. అలాంటి స్థితిలో అతను వ్రాసిన కవిత్వాన్ని ఎవరో దొంగిలించారు"
    
    "ఐసీ! వండర్ ఫుల్ కేస్.....దాంతో అతనికి సడెన్ షాకు అయిందంటాడు.....అవునా?"
    
    "అంతేనండి......."
    
    కుర్చీలోంచిలేచారు డాక్టరుగారు మెల్లిగా అటూ ఇటూ పచార్లు చేస్తూ అన్నాడు.    

 

    "ఆ పేషెంట్ ని నేనుచాలా శ్రద్దగా, నిశితంగా పరీక్షించాలి.....అతనికి నూటికి తొంభయిపాళ్ళ హాస్పిటల్ లోచికిత్స నిష్ప్రయోజనంకావచ్చు.....ఎక్కడైనా.....లేదా ఇక్కడే అయినా......నర్సింగ్ హోమ్ లో చేర్చటంవల్ల కొంతకు కొంత మేలుండొచ్చు......లేదా అది నిష్ప్రయోజనం కావచ్చు.....చెప్పలేం.....పదండి అతన్ని కల్సుకుందాం......"
    
    కార్లోకూర్చున్నాక అన్నాడు డాక్టరు అనంతం.    

 

    "చూడండి అతన్ని నేను నేరుగావెళ్ళి కలుసుకుంటాను-మీరేమి గాబరాపడి నన్ను, అతన్ని డిస్టర్బ్ చేయకండి.
    
    కారు బయలు దేరింది.
    
    "ఓ అమ్మాయ్!"    

 

    గది మాత్రమే కాకుండా ఆవరసలో నున్న గదులన్నీ దద్దరిల్లేలా పిలిచాడు గురుదేవ్!
    
    భయపడుతూనే వేగంగా లోపలికి వెళ్ళింది.
    
    "రా! ఇలారా!!"
    
    బెరుకుగా చూసింది.
    
    "భయమేస్తోందా?"
    
    అవునన్నట్టు తలూపింది.
    
    "అక్కర్లేదు.....నేను రాక్షసుడిని కాను" 

   

    "ఊహూ"
    
    "దొంగనీకాను"
    
    "ఉహూ"
    
    "పిచ్చివాడినీకాదు"
    
    "ఊహూ"
    
    "రైట్! నీవైనా ఒప్పుకున్నావుచాలు"
    
    "........"
    
    "వీళ్ళంతా నన్ను.......నన్ను......నన్ను......"
    
    గట్టిగా ఏడిచాడు బిత్తరపోయి ఏం చేయటానికి తోచక అలాగే నిలబడింది గీత. రెండు నిమిషాలు అలాగే గడిచాక అన్నాడు.
    
    "నీకు నా మీద దయలేదు"
    
    అర్ధంకానట్టు చూసింది. బేలగా దీనంగా చూస్తూ అన్నాడు.
    
    "అర్ధంకాలేదా? నేను ఏడుస్తుంటే అలాగే నిల్చున్నావేకానీ నన్నుకొంచెమైనా ఓదార్చావా?"
    
    చాలానొచ్చుకుంది.
    
    "దగ్గరగా వచ్చి ఒక్కమాట అయినా అన్నావా?"

   
    మనసుకరిగింది.
    
    "నీవుపిచ్చివాడివి కాదు.......వాళ్ళేపిచ్చివాళ్ళు.......దొంగలు.....రాక్షసులు......అని అయినా అన్నావా?"
    
    దగ్గరగావెళ్ళి అతని మంచంమీదే కూర్చుని భుజం మీద చేయివేస్తూ అంది.

    

    "మీరింత మంచివాళ్ళు అనుకోలేదు"
    
    ఆమేమాటకి అడ్డుతగులుతూ అన్నాడు.    

 

    "కొంచెంమంచివాడనుకున్నావా?"    
    
    "ఊ....నిజంగా పిచ్చి మీకు లేనేలేదు......మిమ్మల్ని అర్ధం చేసుకోలేనివాళ్ళకే పిచ్చి.....నిజం......నిజం .....మీకు నమ్మకంకల్గటం లేదా?"
    
    "నిన్నేనమ్మానా?"
    
    నవ్వింది.
    
    "నవ్వుతావేం?"
    
    "నవ్వువస్తే నవ్వరా?"
    
    "నవ్వుతారా-తప్పుకాదూ"
    
    "సరేలెండి"  

 

    "ఓయ్"
    
    మనస్సులో ఏదో తెలియని ఒకభావన మధురంగావీచింది మళ్ళీ అడిగాడు.
    
    "నీపేరు చెపుతావా?"
    
    "అడగందే ఎలా చెపుతాను"  

 

    "అడిగాను కదా?"    
    
    "ఊహూ"
    
    "అయితే చెప్పు.....ఏయేం పేరు......."
    
    "గీతాంజలి"

 Previous Page Next Page