Previous Page Next Page 
యోధుడు పేజి 20

    ఓ.కే నువ్వు చెయ్యాల్సిన మొదటి పని..." అంటూ ఆ మొదటి పనేమిటో చెప్పాడు రణదీఫ్.

    "మీకా లెటర్స్ ఎప్పటికి కావాలి సార్?" కుర్చీలోంచి లేస్తూ అడిగింది అర్చన. నిజానికి రణదీఫ్ చేయమంటున్న పని ఎంతో ప్రమాదకరమైనదని తెలిసినా అవసరాలు ఆమెను కన్విన్స్ చేయడంలో ఆ పని చేయడానికి అంగీకరించింది.

    "రేపుదయానికి" నవ్వుతూ చెప్పాడు రణదీఫ్.

     "ఓ.కేసార్" అంటూ బయటకి వెళ్ళిపోయింది అర్చన. ఆమె వెళ్ళగానే అంకుష్ వచ్చాడు.

    "మనం రేపు మధ్యాహ్నం... హైదరాబాద్ బయలుదేరుతున్నాం. ఈ లోపల ఇక్కడనుంచి ఒక అందమయిన ప్రేమలేఖ కాశీచరణ్ అడ్రస్ కి ఫోస్ట్ లో వెళుతుంది" నవ్వుతూ అన్నాడు రణదీఫ్.

    "కాశీచరణ్ కి ప్రేమలేఖ వెల్లడమేమిటి?"

    "అంతా సస్పెన్స్. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి చాలు. అవసరమయినప్పుడు అన్ని వివరాలూ చెప్తాను" త్రిబుల్ ఫైవ్ సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు రణదీఫ్ వుత్సాహంగా.

    ఎందుకోగాని అంకుష్ లో వున్న భయం రెట్టింపైంది ఆ క్షణానే.
   
                                                       *    *    *    *

    నర్స్ మేరీ తన చేతిలో ఖాళీ సెలైన్ సీసా పట్టుకుని కారిడార్ లో నడుస్తుంది కారిడార్ చివరునున్న డిస్పోజల్ బిన్ లో పడేయడానికి వెళుతోందామె. అదే సమయంలో ఒక రూమ్ లోంచి శివానందం స్పీడుగా బయటకి వచ్చి మేరీకి డాష్ యిచ్చాడు. మేరీ ప్రక్కకు పడిబోతుండగా సినిమాలలో హీరో హీరోయిన్ పట్టుకున్నట్లుగా పట్టుకున్నాడు. ఆమె భుజాలు అతని చేతుల్లో వున్నాయి.

    ఆమె కళ్ళలోకి సూటిగా చూసి చిలిపిగా నవ్వాడు. శివానందం. "సారీ మేరీ! క్రిందపడిపోకుండా ఎలా ఒడుపుగా పట్టుకున్నానో తెలుసా?" మేరీ స్పర్శకు ముగ్దుడైపోతూ తమకంగా ఏదో అనబోయాడు.

    "షటఫ్! కళ్ళుమూసుకుని నడవొద్దని నీ కెన్నిసార్లుచేప్పాలి" విసురుగా విడిపించుకుని అంది మేరీ. అతడు కావాలని తనకు డాష్ కొట్టాడేమో నన్ను అనుమానం కూడా కలిగిందామెకు.

    "షటప్పా... కష్టపడి టకఫ్ చేసుకున్నది షర్ట్ ని ఆఫ్ చేసేందుకా? అయినా మీ ఆడవాళ్ళు ఎప్పుడూ యింతే_ 'షర్ట్_ ఆఫ్' అంటారే తప్ప..." అంటూ ఆమెకి దగ్గరగా జరిగి చెవిలో ఏదో అన్నాడు శివానందం.

    అప్పటికే సిగ్గుతో మేరీ ముఖం ఎర్రబారింది.

    "ఏం చేయమంటావు మేరీ! కళ్ళు తెరుచుకుని నడిస్తే నువ్వు ఎదురుగా కనిపిస్తున్నావు. నా మనసు ల్యాబ్ డబ్ కి బదులు లబలబమని కొట్టుకుంటుంది.

    అందుచేతనే కళ్ళుమూసుకుని నడుస్తున్నానన్నమాట. అలా కళ్ళు మూసుకుని నడవడంవల్లేకదా నువ్వు నా కౌగిలిలో పడ్డా సైజు తెల్ల బాతులా వాలిపోయే అదృష్టం కలిగింది" అన్నాడు శివానందం.

    అది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు కాబట్టి కారిడార్ లో జనం పెద్దగా తిరగడంలేదు.

    రోజురోజుకి నీ గోడ వెక్కువై పోతోంది. నీ బాధ పడలేకపోతున్నాను." అంది మేరీ.

    "బాధా... ఉండా నీలోనా? అయితే బయటకు చెప్పుకోరాదా ఓ మేరీ... మేరీ తుహై ప్యారీ... ఓ నా మేరీ" శివానందం ఆటపట్టిస్తూన్నట్టుగా అనిపించింది మేరీకి.

    "మిస్టర్ శివానందం! తోటి స్టాఫ్ తో ప్రవర్తించే తీరు యిదేనా? పైగా నువ్విక్కడ ఎలా చేరావో గుర్తుకుతెచ్చుకో" అంది మేరీ కోపంగానే.

    "సినిమాష్టార్ మాధురీదీక్షిత్ లాంటి అమ్మాయి వెనకాల పడ్డాను. నాకేం తెలుసు ఆమె అన్నయ్యలు దాదాలని. అ దేబ్బతో గాయపడి ఈ హాస్పిటల్ కి పేషెంట్ గా వచ్చిపడ్డాను.

    ఆఫ్ కోర్స్! ఇక్కడ కూడా మంచే జరిగిందిగదా. నీలాంటి అండమయిన సిస్టర్... ఛీ...ఛీ నర్స్ దొరికిందికదా" చెప్పుకుంటూ పోతున్నాడు శివానందం.

    రోజూ ఎప్పుడో ఒకప్పుడు పదినిమిషాలసేపు అయినా తన బ్రెయిన్ బిర్యానీలా తింటున్నాడు. పైగా ప్రేమ. ఇక లాభం లేదనుకుని చివరి బాణం వదిలింది మేరీ మధురిమగారికి కంప్లయింట్  చేస్తానంటూ.

    "చెయ్... నాకేం భయమా? బారతదేశంలో పుట్టే ప్రతివాడికీ వాక్ స్వాతంత్యం వుంది. కానుక 'ఐ లావ యూ' అన్నాడు బ్యూటీ స్వాతంత్యమా వుంది. అందుకే నీ వెనుకపడ్డాను ఏం తప్పా?

    నువ్వు నాకు నచ్చావు_అందుకే పెళ్ళిచేసుకుంటానని అడుగుతున్నాను అది తప్పేనా? అదీ పైసా కట్నం లేకుండా, నయాపైసా లంచం పుచ్చుకుని ఎక్సయిజ్ వారిని, అర్టిసీవారిని, కట్నం తీసుకుని పెళ్ళికోడుకుల్ని శాటిలైట్ ద్వారా వెతికినా దొరకదు. నా గొప్పదనం అర్ధం చేసుకో లేక అపార్ధం చేసుకుంటున్నావ్" శివానందం  సీరియస్ గా చెప్పాడు.
    నిజానికి కేరళ అమ్మాయి మేరీ శివానందం కాకిమిక్కుకి దొండపాండు సామెతని గుర్తుకు తెస్తాడు.

    అయితే అతడి మంచితనం, అందర్నీ నవ్వించే అతని గుణంవల్ల స్టాఫ్ అంతా అతడ్ని బాగా అభిమానిస్తారు. అయినా మేరీ అతడ్ని దూరం గానే వుంచుతుంది. నిజానికి మేరీకి పెళ్ళి అవసరం ఎక్కువ. కట్నం యిచ్చే స్తోమత ఆమెకు లేదు గనుక.

    "నేను వార్డ్ బోయ్ అనగానే నీకు చిన్నచూపు? మూడు నెలల్లో ఎక్స్ రేలు తీయడం నేర్చుకుని రేడియాలజీ డిపార్ట్ మెంట్ లో చెరకపోతే చూస్తుండు. అప్పుడయినా చేసుకోకపోతావేమో చూస్తా" ప్రతిజ్ఞ చేశాడు.

    ఆమెకో విషయం అర్ధంకాలేదు. అందుకే అడిగింది "బ్యూటీ స్వాతత్యం అంటే ఏమిటి?" అని.

     "బ్యూటీ స్వాతంత్యంమంటే బ్యూటీ ని ప్రేమించే స్వాతత్యం. అందం చూడవయ్య... అనండిచావయ్యా... అన్నారా పెద్దలు. అందాన్ని చూస్తున్నాను, అరాదిస్తున్నాను, ఆనందిస్తున్నాను" ఓరకంట మేరీని చూస్తూ అన్నాడు శివానందం.
 

 Previous Page Next Page