చక్రపాణి మాట్లాడకుండా అతను చెప్పేది వింటున్నాడు.
"మిస్టర్ ఎక్స్! మీకు పిగ్ ఫుడ్ చాలా ఇష్టమా!"
తన అయిష్టాన్ని వ్యక్తం చేయకుండా "ఊ" అన్నాడు చక్రపాణి.
కడుపులో పిల్లలు వుండగా అలాగే వండిన పెద్ద సైజు ఆడపంది ని ఈ తఫా కోరి తీసుకోండి. తల్లి కడుపు లోపల వేడిన వుమ్మగిల్లిన పిల్లలు తేనే తోకల్లాగా వుంటాయి. అలాగే కొన్ని జంతువుల అవయవాలతో తయారయిన.....
అది వింటున్న చక్రపాణి కడుపులో గిర్రున తిరిగినట్లయింది.
"రెడ్ సూప్ ఉదయం సాయంత్రం తీసుకోవాలి. అలా చేస్తేగాని ఆ పనులు చేయలేరు."
మరోసారి "ఊ" అన్నాడు చక్రపాణి.
రెడ్ సూప్ అనేది మూడు జంతువుల రక్తంతో కలిసి తయారుచేసేది. మనిషి కోతినుంచి ఉద్భవించాడు. మానవత్వంతో పాటు కోతిచేష్టలు కూడా చేస్తుంటాడు. అప్పుడప్పుడూ పశువులా ప్రవర్తిస్తుంటాడు. పూర్తిగా పశుగుణాలు అవసరం కాబట్టి ఆ పని చేయటానికి ముందు రెడ్ సూప్ తగాడటంతో మొదలవ్టుతుంది సి. ప్రమోషన్ వచ్చిన వాళ్ళ కార్యక్రమం.
వానపాములతో వంటకాలు. కప్పలతో ఊరగాయలు చైనీస్ ఫుడ్ లో చోటు చేసుకుంటుంది. డెవిల్స్ క్లబ్బులు కొన్ని దేశాలలో అతి రహస్యంగా వున్నాయని, ఆ క్లబ్బులో చేరినవాళ్ళు నరరూప రాక్షస బుద్దులు కల వాళ్ళని.... తర్వాతెప్పుడో పోలీసులు పట్టుకుని క్లబ్బులని ముసేయడం జరిగిందని..... చట్టబద్దంగా అలాంటి క్లబ్బులని నిర్వహించటం నేరం అని .... ఇప్పుడు కూడా అలాంటి క్లబ్బులు ఇతర కంట్రిలలో అతి గోప్యమయిన ప్రదేశాలలో ఒకటో రెండో ఉండొచ్చని చక్రపాణికి తెలుసు.
"పవిత్రతకి మారుపేరైన భరతఖండంలో...." చక్రపాణి ఆలోచన యిదికాదు. ఇంకా డీప్ గా డీ..ప్..గా డీ..ప్..గా సాగుతున్నది.
పార్టీ ముగిసింది. మరోసారి చిన్న స్పీచ్ ఈ తఫా మ్యూజిక్ ఆగిపోయి మైక్ లోంచి వినవచ్చింది. తరువాత చేయవలసిన కార్యక్రమాలు చెప్పటం జరిగింది.
అందరూ లేచారు. వాళ్ళెక్కడ డ్రెస్ మార్చుకుంటారో తెలియదు, గుర్రం ముఖం వ్యక్తీ చక్రపాణి మాత్రమే ఇందాకటి రూములోకి వచ్చారు. ఆ వ్యక్తీ తన ముఖానికున్న మాస్క్ ని తీయలేదు. "మాస్క్ తీసి డ్రెస్ మార్చుకోమని చెప్పి వన్ మినిట్ లో వస్తానని చెప్పి' అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
అక్కడే అప్పుడే తొందరపడిపోయిన చక్రపాణి తాను ఒంటరిగా వున్నాను అనుకుని చిన్న తప్పుపని చేశాడు. అది తప్పు పని కాదు చిన్న పొరపాటు. ఆ పొరపాటు అతని పాలిట గ్రహపాటు కానుంది.
ఎప్పుడో కాదు రేపే.
స్వీట్ బ్రూటల్ పార్టీలో మరోసారి ప్రవేశాన్ని చక్రపాణి పూర్తిగా అనర్హుడయ్యాడు.
8
"ఒక్క రాత్రిలో ఏం చదువుతావు?" నిరంజనరావు అడిగాడు.
"పుస్తకాలు" సావిత్రి నవ్వుతూ అంది.
"సిటిలో భయమేమిటి డాడి ! నన్ను మరి పిరికిదాన్ని గాను పసిపిల్లగాను చూస్తున్నారు" అంది ధైర్య.
"నా కూతురు పిరికిది కాదు, ధైర్యానికి మారుపేరు ధైర్య. నిన్నలాగే పెంచాను. విషయంమేమిటంటే ధైర్య! నీవు లేకుండా చూసి మీ అమ్మ నా చెవిని పిండుతూ అమ్మాయిని పెళ్ళికి వచ్చేలా ఒప్పించండి అంది. ఎంతైనా భార్యమాట తోసి కాదనలేక....
నిరంజనరావు చెపుతుంటే "చాల్లెండి ఎవరయినా వింటే నవ్వుతారు. ఎదిగిన ఆడపిల్ల ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు" మధ్యలో అడ్డుతగిలి చిరుకోపంతో అంది సావిత్రి.
మరి జరిగింది ఏమిటో ధైర్యకి తెలియాలి కదా!" నిరంజనరావు కావాలని అమాయకంగా ముఖం పెట్టి అన్నాడు.
భర్త టక్కరు తనానికి సావిత్రి నవ్వి వురుకుంది.
అసలు విషయం ఆ వూళ్ళోనే నిరంజనరావు స్నేహితుడి కూతురు మ్యారేజి. స్నేహితుడికి భార్య లేదు. "నీవు వచ్చి నాకు కాస్త సాయంగా వుండరా" అని నిరంజనరావుని కోరాడు. తెల్లవారుఝామున మగ పెళ్ళి వారు వస్తారు. మగ పెళ్ళి వారికీ ఎదురెళ్ళి మర్యాదగా ఆహ్వానించి విడిదిలో దింపి మంచి చెడ్డ చూడాలి. స్నేహితునికి సాయపడదామని భార్యతో సహా బ్యాగ్ లో బట్టలు సర్దుకుని రాత్రి ఏడు గంటలకి వెళుతున్నాడు నిరంజనరావు.