Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 19

 

    "స్వీట్ బ్రూటల్  పార్టీ అంటే ఏడ్పు సంగీతము ఎద్దుముఖాలు జింకతలలు ముఖానికి మాస్క్ లాగా తగిలించుకుని స్కేలిటన్ భాయిలు యిచ్చిన రెడ్ సూప్ తాగాటమా! తినే పదార్ధాలు యింకెలా వుంటాయో.....!" చక్రపాణి అలా ఆలోచిస్తుండగానే ఏదో వాసనా మసాలా వాసనా ముందుగా హాలుని చుట్టేసింది.

 

    "స్కేలిటన్లు  ప్రతి టేబుల్ దగ్గరకు వచ్చి గ్లాసులు మంచినీళ్ళు జగ్గులు వుంచి వెళ్లారు. గాజు గ్లాసులు జగ్గు పూర్తిగా రెడ్ కలర్ లో వున్నాయి. దానిలో వున్నాయి. దానిలో వున్న నీళ్ళు తెల్లనివే కానీ ఆ గ్లాసుల్లోపోయటంవల్ల రక్తంలాగా కానవస్తున్నాయి. గ్లాసు రంగు నీటిలో ప్రతిభింబిస్తున్నది.

 

    మంచినీళ్ళు సర్వ్ చేయంగానే స్కేలిటన్ లు డిషెస్ ని మోసుకొచ్చి టేబుల్స్  మీద అందంగా సర్దారు. అవన్నీ చాలా గమ్మత్తుగా చాలా రకాలుగా వున్నాయి.

 

    గుర్రం ముఖంవ్యక్తీ ముందు ప్లేటులో చిన్న చిన్న కప్పలు వున్నాయి. కొన్ని టేబుల్స్ ని ఆక్రమించిన ప్లేట్లల్లో పుల్కోడి, పావురాళ్ళు, కుందేలు పిల్లలు, కొన్ని జంతువుల తాలూకా గుండె, తోడ, అసహ్యం గొలుపుతూ అంగము, అలా ఎన్నో రకాలు వున్నాయి.

 

    మేనుకార్డులో వున్న పదార్ధాలపేరు తెలియక ఏ కత్తి అయితే పొడుచుకు చావడానికి అన్నట్లు.... ఓ అయిటమ్ పక్కన పెన్సిల్ తో టిక్ పెట్టాడు చక్రపాణి. పార్టీలో సర్వ్ చేస్తున్న అయిటమ్స్ ఎలాంటివో అప్పుడే అర్ధమైపోయింది. అతనికి "తనముందు నక్కతలకాయ ప్రత్యక్షం అవుతుందో నక్కతోక తగలబడుతుందో!" అని చక్రపాణి పూర్తిగా అనుకున్నాడో లేదో అతను కోరుకున్న అయిటమ్ ని పెద్ద ట్రైలో తెచ్చి టేబుల్ మీద పెట్టివేళ్ళాయి స్కేలిటన్ లు రెండువచ్చి.

 

    చక్రపాణి ముందువుంచిన పెద్ద ప్లేటులో  పందిపిల్ల వుంది. అది అప్పుడే వండి వేడి వేడిగా శగలు పొగలు వస్తున్నట్లువుంది. వేడి శగలతో పాటు మసాలా వాసన ఘుమాయించిపోతున్నది.

 

    చక్రపాణి తందూరి చికెన్ లాంటిది తిన్నాడు. ఫిష్ కట్ లెట్ తిన్నాడు. అందాబజ్జి తిన్నాడు. అంతేకాని కప్పల్ని పాములని పందులని ఇలా పూర్తీ ఆకారాలతో సహా తినటం జరగలేదు. చూడటమన్నదే జరగలేదు. ఇంకా తినేదాకా ఎక్కడ?

 

    అతని ఎదురుగా వున్న గుర్రంముఖం వ్యక్తీ కప్ప పిల్లలని చేగోదిల్లాగా నోట్లో వేసుకుని తింటున్నాడు.

 

    అతను ఒక్కసారి పలువైపులా చూపు సారించి చూశాడు.

 

    ఎవరిదోవన వాళ్ళు రెండోధ్యాస లేకుండా నోటికి చేతికి పని కల్పిస్తున్నారు. అక్కడున్న ప్రతివారి ముఖానికి జంతువుల మాస్క్ లున్నాయి. అయినా కష్టం లేకుండా తినగాలుతున్నారు. కళ్ళకి అడ్డంవుండదు. ముక్కులు గాలి పిల్చే ఏర్పాటువుంది. అలాగే నోటికి వీలువుంది. ముఖం  ఆనవాలు పట్టకుండా జంతువుల తలలు తగిలించుకున్నా అది యిబ్బంది కరంగా లేకుండావుండటం అన్నది చాలా గొప్పగా వుంది. ఎంతో అద్భుతమైన పనితనంతో మాస్క్ లు తయారు చేయటం జరిగింది.

 

    చక్రపాణికి తెలుసు ఏ సమయంలో తాను ఏం చేయవల్సిందీను. పందిపిల్ల పోట్టభాగంలో గుచ్చి చిన్న ముక్కని కట్ చేసి నోట్లో పెట్టుకునేముందు వికారంగా అనిపించినా ముక్క నాలుకకి తగిలేసరికి రుచిగా అనిపించింది. పందిపిల్లలోంచి అయిదారు ముక్కలు కట్ చేసి తినగాలిగాడు. ఆపై యింక గొంతు దిగానని మొరాయించాయి.

 

    "చచ్చినట్లు మొత్తం తినాలా కవాల్సినంతే తిని వదిలేయవచ్చా?" అనుకుంటూ ఎదుటి ప్లేటులోకి చూశాడు. అతను రెండు కప్పలని వదిలేశాడు. అది చూసి అమ్మయ్య అనుకున్నాడు అతను.

 

    "మిస్టర్ ఎక్స్ ఎక్కువ తినలేకపోయారేమిటి?" గుర్రం ముఖం వ్యక్తి అడిగాడు.

 

    "కొత్తకదా!" చక్రపాణి తడుముకోకుండా చెప్పాడు.

 

    "ఈరోజు పార్టీ మీకు యివ్వడం జరిగింది. ఇలాంటిదే యింతకన్న డబల్ హాలు కింద ఫ్లౌర్ లో వుంది. రేపుమీకు చూపిస్తాను. కావలసినప్పుడు వెళ్ళి కావాల్సింది తినొచ్చు. ఇక్కడమాత్రం లిమిటెడ్ సభ్యులు నెలకి రెండుసార్లు. కిందఫ్లోర్ లో ప్రతిరోజూ వుంటుంది.

 

    8)

 Previous Page Next Page