Read more!
 Previous Page Next Page 
లవ్ మర్డర్స్ పేజి 2

    సగం తలుపులు వేస్తూ వుండగానే వికృతాకారుడి చెయ్యి పని చేసింది. చేతిలో ఇంక్ పిల్లర్ లాంటి దానితో మత్తు మందు నొక్కాడు. జల్లులా అమల మొహానకొట్టింది. అమల అలానే మంచంపై వాలిపోయింది.

    వికృతాకారుడి చేతిలో లావుపాటి చిన్న కొంకి కర్ర వుంది. ఆ కర్ర పిడివైపు తిప్పి లాగితే అది చాలా పొడుగాటి కర్ర అయింది. ట్రాన్స్ సిస్టర్ ఏరియల్ రాడ్ లా నిర్మించబడింది ఆ కర్ర.

    కొంకి కర్రను కిటికీలోంచి పోనిచ్చి అమల లోపల వేసిన తలుపు గడియ పైకి ఎత్తాడు. ఆ తర్వాత వాకిలి తలుపు గడియకూడా కొద్ది శ్రమతో తీయగలిగాడు.

    పరంధామయ్య దంపతులు ఊరికెళ్ళినట్లు..... ఆ ఇంట్లో మరో ప్రాణి లేనట్లు ముందే తెలుసేమో? తాపీగా ఇంటిలో ప్రవేశించాడు వికృతాకారుడు. ముందుగా అమల పుస్తకాలు తిరగేశాడు. దస్తూరీ పరీక్షించాడు. తల పంకించి నోట్ బుక్ లో కాగితం చించి, అమల పెన్ అందుకున్నాడు. జాగ్రత్తగా రాయటం మొదలుపెట్టాడు.

    "అమ్మ, నాన్నగార్లకు,

    మీ దృషిలో పాడు పని, నా దృష్టిలో మంచి పని చేశాననుకుంటున్నాను. నన్ను క్షమించండి. నేను జహంగీర్ ఖాన్ ని ప్రేమించాను. కులమతాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే మీరు మా పెళ్ళికి ఒప్పుకోరు. ఖాన్ మనలో కలపడు, నేను ఖాన్ కోసం వాళ్ళ మతం స్వీకరించి పెళ్ళి చేసుకోదలచుకున్నాను. అందుకే నేను ఈ రాత్రి ఖాన్ తో వారి ఇంటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళి ఎప్పటికో వస్తాను. నా గురించి దిగులు చెంది ప్రయోజనం లేదు కాబట్టి, ధైర్యం తెచ్చుకుని మనస్ఫూర్తిగా క్షమించండి. నాకోసం ఆరాలు తీయవద్దు. మధ్య మధ్య నా క్షేమ సమాచారాలు లెటర్స్ ద్వారా తెలుపుతుంటాను. ఏదయినా నా కొరకై చర్య తీసుకుంటే నా శవం మాత్రమే మీకు దక్కుతుంది. ఇలా వ్రాస్తున్నందుకు నాకూ బాధగానే ఉంది. అందుకే ఏమీ తీసుకెళ్లటం లేదు. మీ బాధ, కోపం తగ్గిం తరువాత వస్తాను. మీ అమ్మడుని క్షమించండి. అంతే నేను కోరేది.

                                                                                                                                            మీ       
                                                                                                                                  అమల (అమ్మడు)" 

    వికృతాకారంగా వున్న తను, తను రాసింది ఒకటికి రెండుసార్లు చదువుకున్నాడు. అమల రైటింగ్, తను రాసింది ఒకేలా ఉండటంతో, రాసిన కాగితాన్ని టేబుల్ మీద పెట్టి, అది ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ పెట్టాడు. కిటికీ తలుపులు మూసేశాడు. టేబుల్ లైట్ ఆర్పేశాడు.

    అమలను చేతులమీద ఎత్తుకుని బైటకు వచ్చాడు. యధావిధిగా అన్ని తలుపులు మూసేసి వాకిలి తలుపుకి చిన్న తాళం వేశాడు.

    ఆ ఇంటికి కొద్ది దూరంలో ఆపిన తన కారు వద్దకు అమలను ఎత్తుకు వచ్చాడు. కారు డోర్ తెరిచి వెనుక సీట్ లో పడుకోబెట్టాడు అమలను. తను వెళ్ళి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు.

    శరవేగంతో కారు ముందుకు దూసుకుపోయింది.
   


                                                                3


    "ఎవరు నీవు? నన్నెందుకు తీసుకొచ్చావు?" అమల కోపంగా అడిగింది వికృతాకారుడిని.

    "నేనెందుకు తీసుకొచ్చింది చెపుతాను. నా పేరు భగవాన్. నే చెప్పింది జాగ్రత్తగా విని ఆచరిస్తే నీకు మేలు జరుగుతుంది. కాదంటే నీ తల్లిదండ్రులను కట్టి తీసుకువచ్చి వారిముందు, నిన్పదిమంది రేప్ చేసేటట్లు చేస్తాను. అది చూచి నీకన్నా ముందే వాళ్ళు గుండె ఆగి చస్తారు. అ తర్వాత నీ కళ్ళముందే మీ అమ్మా నాన్నని చిన్న చిన్న ముక్కలుగా నరికి...."

    "ఆపండి... నేనేం అపకారం చేశాను?"

    "నువ్వుగాని మీ వాళ్ళుగాని నాకే అపకారం చేయలేదు. నాకో పని నీవల్ల కావలసి వుంది. మంచిగా చెపితే నీవు వినవు. నా ప్లాన్ సక్సెస్ కావాలంటే తప్పదు నీ ఎడల కఠిన చర్య తీసుకోవటం" భగవాన్ అంటూనే చప్పట్లు చరిచాడు.

 Previous Page Next Page