Read more!
 Previous Page Next Page 
40 వసంతాల తెలుగుదేశం పేజి 2

                                 

 

    
                                    తెలుగువారికీ గుర్తింపు

    తమకంటూ ఒక ప్రత్యెక అస్తిత్వం ఉందని, అందువల్ల ప్రత్యెక రాష్ట్రం కావాలని కోరుకున్న తెలుగువారి కోర్కెను మన్నిస్తూ 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయినా అ తర్వాత కూడా తెలుగువారిని మదరాసీలగానే ఉత్తరాదిలో వ్యవహరించేవారు. తెలుగువారు కోరుకున్న ప్రత్యేక గుర్తింపు మన్నన 1982 లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తర్వాతే వారికి లభించింది. జాతీయ స్థాయిలో కూడా తెలుగు జాతి ఔన్నత్యానికి గుర్తింపు తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ లాంటి బలమైన నాయకురాలిని ఎదుర్కొని, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ ని మట్టి కరిపించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అందరి దృష్టిని ఆకర్షించింది. 1983 లో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీకి ఉప్పెన లాగా ఉవ్వెత్తున ఎగసిపడిన మద్దతును చూడటానికి వచ్చిన దేశ, విదేశీ మీడియాతో రాష్ట్రం మీద ఆసక్తి పెరిగింది. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన రాజకీయ విప్లవం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

    (ఏ దేశమేగినా ఎందు కాలిడినా తాను తెలుగువాడినని, తనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని ఆంధ్రులు గర్వంగా చెప్పుకోగలగడానికి తెలుగుదేశం చేసిన సేవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.)
    
    "ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి అధికార మార్పిడి జరిగినపుడు నేను ప్రపంచ బ్యాంకు తరపున బడ్జెట్ సలహాదారుగా ఆఫ్రికా దేశం సూడాన్ లో ఉనాను. లాల్ బహుదూర్ స్టేడియం లో ప్రజాసమక్షంలో ఎన్టీఆర్ ప్రమాణ స్వీకార దృశ్యాన్ని నేను సూడాన్ రాజధాని ఖార్టూమ్ లో టీవిలో చూశాను. ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రాంతం భారతదేశంలో ఉందని అప్పుడే ఆఫ్రికాలో తొలిసారి తెలిసింది." అని రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి బిపిఆర్ విఠల్ తన స్మృతుల్లో రాశారు. అంతర్జాతీయ వార్తల్లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ మెరిసింది.
    తెలుగుదేశం పార్టీ స్థాపకుడిగా ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ వ్యక్తిత్వం, భిన్న ఆలోచనావిధానం, సంస్కరణాభిలాష రాష్ట్రానికి వన్నె తెచ్చాయి. రాష్ట్రంలో ఆయన తీసుకొచ్చిన పాలనా సంస్కరణల మీద జాతీయ మీడియా విస్తృతంగా రిపోర్టు చేసింది. 1983 ఫిబ్రవరి లో జరిగిన ఎన్టీఆర్ తొలి డిల్లీ పర్యటనలో ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఒక జాతీయ నాయకుడిగా ఆయనకు స్వాగతం లభించింది. డిల్లీ ప్రెస్ క్లబ్ లో తొలిసారిగా ఏర్పాటైన అయన విలేకరుల సమావేశం సీనియర్ జర్నలిస్టులతో కిక్కిరిసిపోయింది. దేశ రాజధానిలో ఎక్కడికి వెళ్ళినా తెలుగువారే కాకుండా, తెలుగేతరులు కూడా ఆయన్ని చుట్టూ ముట్టేవారు.
    జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయాన్ని తయారు చేయాలన్న అయన సంకల్పం, అందుకోసం అయన చేసిన నిర్విరామ కృషి కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యెక గుర్తింపును తెచ్చి పెట్టాయి. 1983 మే నెలలో తెలుగుదేశం పార్టీ తొలిసారిగా విజయవాడలో నిర్వహించిన ప్రతిపక్షాల కాంగ్రెస్ లో దేశమంతా ఆంధ్రప్రదేశ్
    (తెలుగువారు కోరుకున్న ప్రత్యెక గుర్తింపు. మన్నన 1982 లో తెలుగుదేశం
     పార్టీ ఏర్పాటు తర్వాతే వారికి లభించింది. తెలుగు బిడ్డ ప్రధాని పదవిలో
     ఉండటం తెలుగువారికి గర్వకారణమని ప్రకటించి, పార్టీ అభ్యర్ధిని పోటీలో     దింపని ఉన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్ ది.)

                        

వైపు చూడటం మొదలుపెట్టింది. ఆతర్వాత 1984 లో తన ప్రభుత్వాన్ని పడగొట్టిన ఇందిరాగాంధీ దుశ్చర్యను ఎదుర్కొని ఎన్టీఆర్ మళ్ళీ ప్రమాణస్వీకారం చేయడంతో ఆంధ్రప్రదేశ్ పేరు దేశమంతటా మార్మోగింది. తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేయడం కోసమే తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఉందని ఎన్టీఆర్ చేతల్లో చూపారు. తన పార్టీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్ పార్టీ తరపున పివి నరసింహారావు నంద్యాల ఉపఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసినపుడు, తెలుగు బిడ్డ ప్రధాని పదవిలో ఉండటం తెలుగువారికి గర్వకారణమని ప్రకటించి, పార్టీ అభ్యర్ధిని పోటీకి దింపని ఉన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్ ది.
    
                                         తెలుగుదేశం తొలి మ్యానిఫెస్టో

    తెలుగుదేశం పార్టీ సైద్ధాంతిక పునాదులు పార్టీ తొలి మ్యానిఫెస్టో లోనే ఉన్నాయి. ఆత్మగౌరవ నినాదంతో, ఉద్వేగపూరిత ప్రసంగాలతో మాత్రమే ఎన్టీఆర్ ప్రజా మద్దతును పొందలేదు. తెలుగు జాతీయతా భావాన్ని అడ్డు పెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవస్థను సంపూర్ణంగా, సమగ్రంగా సంస్కరించి, తెలుగువారిలో నైతిక, రాజకీయ , ఆర్ధిక , సామాజిక సాంస్కృతిక విప్లవాన్ని సాధించే దిశగా తెలుగుదేశం పార్టీ తోలి మ్యానిఫెస్టోను తయారుచేశారు.
    చారిత్రక పరిస్థితుల నేపద్యంలో ఒక అనివార్య పరిమాణామంగా తెలుగుదేశం ప్రాంతీయ పార్టీగా అవిర్భావించిందన్న అవగాహన మ్యానిఫెస్టోలో వ్యక్తమైంది. తెలుగుజాతి తలయెత్తుకోలేని దుస్థితి నుంచి బయటకు రావాలన్న బలమైన కాంక్ష వెల్లడైంది. తెలుగువాడు సర్వతోముఖ వికాసానికి , మసకబారిన తెలుగు వెలుగులను పునరుద్దీప్తం చేయడానికి తెలుగుదేశం వెలిసిందని మ్యానిఫెస్టో లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచి విష్కళంక పరిపాలన నెలకొల్పడమే దాని ధ్యేయమని ఉద్ఘాటించారు.
    దాదాపు ముప్పయ్ అంశాలతో తెలుగుదేశం పార్టీ తొలి ప్రణాళికను రూపొందించగా, ఇందులో 'తెలుగు భాషకు నిండు గౌరవం' అన్న ఒక్క అంశం తప్ప, మిగతావన్నీ ప్రజల దైనందిక జీవితాలను మెరుగుపరచడానికి, పాలనా వ్యవస్థను శుద్ధి చేయడానికి ఉద్దేశించినవే రైతుకు చేయూత, బడుగు వర్గాల అభ్యున్నతి, మహిళాభ్యుదయం, యువతకు ప్రోత్సాహంతో పాటు పంచాయితీలకు హెచ్చు అధికారాలు, విద్యావిదానలో మార్పులు, సత్వర పారిశ్రామికీకరణ ప్రాదాన్యాలుగా మ్యానిఫెస్టో పేర్కొంది. రెండు రూపాయలకే కిలో మంచి బియ్యం , పిల్లలను మధ్యాహ్న భోజనం అందిస్తామని చెప్పింది. ఎన్నికల సంస్కరణల కోసం, పార్టీ ఫిరాయింపుల నిషేధం కోసంపోరాడతామని తెలిపింది. పార్టీల ఎన్నికల ప్రచార ఖర్చులను ఎన్నికల సంఘమే భరించే విధానాన్ని కోరింది. అన్ని మతాలు, వర్గాలను సమానంగా చూసే సెక్యులర్ విధానం తమదని ఉద్ఘాటించింది. పత్రికలను పూర్తి స్వేచ్చతో పాటు, ప్రభుత్వ అధ్వర్యంలో నడుస్తున్న రేడియో, టీవీలకు స్వయం ప్రతిపత్తి ఉండాలన్నది తమ విధానమని చెప్పింది. బలహీన వర్గాలకు ఇంటి వసతి, వైద్య ఆరోగ్య సేవలు, చేనేతకు చేయూత లక్ష్యాలని తెలిపింది. వీటితో పాటు, రాజ్యాంగం ఫెడరల్ స్వభావానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాలను పునర్ నిర్వచించాలన్నది తమ విధానమని ఆనాడే తెలుగుదేశం పార్టీ ఘోషించింది. రాష్ట్రాలకు ఉన్న అధికారాలను, హక్కులను కేంద్రం హరించడాన్ని వ్యతిరేకించింది.

 Previous Page Next Page