"అదేంటిరా బెల్లంకొట్టిన రాయిలా అలా వుండి పోయావు. టిక్కట్లు దొరకవనే భయంవుంటే కాస్తముందుగా వెళ్ళి మేడమీదకి తీసుకురా. ఓ పావులో అర్ధో ఎక్కువ అంతేగా?"
"నాబాధ నీకర్ధంకాదు నాన్నమ్మా!" అనుకుని లేని నవ్వు ముఖాన పులుముకుని "అదికాదు నాన్నమ్మా! ఈ ద్రౌపదీ వస్త్రాభరణం సినిమా తెలుగులో తియ్యలేదు. ఇంగ్లీషులో తీశారు. ఇంగ్లీషువాళ్ళకోసం మన భారతరామాయణాలు వాళ్ళభాషలో తీసి చూపిస్తున్నారు." అని చెప్పి "అమ్మయ్య" అనుకున్నాడు మదన్ గోపాల్.
"ఏ భాషలో తీస్తేనేంరా. మన భారతంలోది మన ద్రౌపదీ వస్త్రాభరణం ఆమె." అన్నది.
వైజయంతి ముసిముసి నవ్వులు నవ్వింది.
వళ్ళు మండిపోయింది మదన్ గోపాల్ కి.
"ఇంగ్లీషులో ఎలా చూస్తావు నాన్నమ్మా! భాషవేరు ద్రౌపదిచీరలు కట్టుకొని వుండదు. ద్రౌపది ఇంగ్లీషు అమ్మాయి కదా వేసేది. గౌనులు వేసుకొని వుంటుంది. దుశ్శాసనుడు పాంటు షర్టు వేసుకుని వుంటాడు."
"అలా అయినా బాధలేకపోను. నిక్కరు బనీనుతో వున్నాడు. పైగా కిరీటం బదులు నెత్తిన టోపీ పెట్టుకున్నాడు దుశ్శాసనుడు ద్రౌపది గౌనులు లాగిపారేస్తుంటే ఈ తెల్ల కృష్ణుడు పక్కనే బుట్టలో నిండుగా గౌనులు పెట్టుకుని ఒక్కో గౌనుతీసి అందించటం."
బామ్మగారు ముక్కుమీద వేలుంచుకుంది.
"రామ రామ వినాశకాలే విపరీతబుద్దని మనవాళ్ళు వాళ్ళకి మన భారతం అమ్మనేల. వాళ్ళు డబ్బుపోసి కొంటే మాత్రం లాగూలతోనూ, గౌనులతోనూ సినిమా తీయనేల."
"ఈ సినిమా మనంచూసే ఖర్మపట్టనేల" బామ్మగారి మాట పూర్తిచేశాడు మదన్ గోపాల్.
"అయినా నాకు తెలియక అడుగుతానూ..."
"అడుగు నాన్నమ్మా! అడుగు" నాలుగు అబద్దాలు చెప్పి సినిమా మాట మళ్ళీ ఎత్తకుండా చేయవచ్చని మదన్ గోపాల్ ఆతృతపడ్డాడు.
"నీ సంగతి నాకు తెలుసులే" అని కనుబొమలెగరేసి "పోనీ బామ్మగారూ! సినిమా చూస్తేపోలా. మన పవిత్ర భారతకధ ఆయె. ఇంగ్లీషులో తీస్తే ఏమిటీ? హిందీలో తీస్తే ఏమిటీ? భారతం భారతమే గారెలు గారెలే" అంది వైజయంతి.
"నన్నిలా ఏడిపిస్తున్నందుకు నేనే తెలుగుసినిమా హీరో నయినట్లయితే పెళ్ళికి ముందే రేప్ చేసి ఓ బిడ్డకి తల్లయిం తర్వాత నీ మెడలో తాళికట్టేవాడిని" కసికసిగా ఆలోచించాడు మదన్ గోపాల్.
"నిజమేనే పిల్లా! నూనెలో వేసినా, నేతిలో వేసినా గారెల రూపం గారెలదే కాపోతే రుచిలో తేడావుంటుంది. ఏ భాషలో తీస్తేనేమి భారతం భారతమే మదనా! టిక్కెట్టు ముక్కోటి నాకూ తెచ్చేయరా!"
ద్రౌపది గౌనులు వేసుకుంటుంది నాన్మమ్మా?"
"సరే వాళ్ళు గౌను లేసుకుంటారు గాబట్టి గౌనులే చూపించారు" సర్దింది వైజయంతి.
"ఇదిగోండి మీకిలా మానాన్నమ్మని తప్పుదారి మళ్ళిస్తే బాగుండదు. నా కంఠంలో ప్రాణం వుండగా ఇంగ్లీషు భారతానికి మా నాన్నమ్మని తీసుకెళ్ళను. మళ్ళీ ఆ సినిమా పేరెత్తితే నామీద వట్టే. నే ఎందుకు చెపుతున్నానో కాస్త అర్ధం చేసుకో. వెంకటేశ్వరవైభవం సినిమాకి ఫస్ట్ రోజు ఫష్టాటకి ఫస్టుటిక్కెట్టుకొని నిన్ను తీసుకెళ్ళి చూపించానా? లేదా నాన్నమ్మా!"