Previous Page Next Page 
మధుకీల పేజి 17

    "నేను రాను"
    "నీ ఇష్టం... అంతగా మొండికేస్తే నే చెప్పేదేముంది?"
    వసంత జవాబు చెప్పలేదు.
    'వసంతా? ఊరిబయట కాలువ గట్టున, ట్రావెలర్స్ బంగళాలో ఎవరూలేని ఏకాంతం, పేకాట ఆడుతూ కాలం గడిపేద్దాం- ఎంత హాయిగా వుంటుందని, అసలు టైమే తెలియదు- ఎప్పుడైనా అటు వెళ్ళావా?'
    'లేదు.'
    'దెన్! కమాన్! వసంతా! ఇంతవరకూ నా జీవితంలో నేనింతవరకిలా ఎవర్నీ రిక్వెస్ట్ చేయలేదు. పురాణం కబుర్లు చెప్పకుండా కదులు'
    'సుధా--'
    'ష్, అలా జంకొద్దు. లైఫ్ లో ముందుకురికే వాళ్ళకే హాయి దక్కేది. అదిగో బస్ ఖాళీగా వస్తోంది. కమాన్ ఇది ఎక్కి సెంటరులోదిగి నంబర్ ఫైవ్ కాచ్ చేస్తే బంగళాముందు దిగొచ్చు' అని గబగబా నడిచాడు.
    వసంత అనుసరించింది.
    మరో అరగంటకల్లా టి.బి. ముందు దిగారిద్దరూ.
    రెండు నిమిషాలు నడిచి బంగళా చేరుకున్నాడు.
    వాచ్ మన్ చేతిలో అయిదురూపాయలు పెట్టేడు సుధాకర్- కిక్కురుమనకుండా గదితెరిచి శుభ్రంచేసి వెళ్ళిపోయాడు అతను.
    ఆ గదీ, ఆ అలంకరణా అదీ చూసి కళ్ళు తిరిగాయి వసంతకి అంతా సినిమా సెట్ లా వుంది, ఏ మినిస్టరో దిగే బంగళా అది. అందుకు తగ్గట్టుగానే వుంది అరేంజ్ మెంటు.
    'యస్? అదిగో టీపాయ్ ఇలా కుర్చీల దగ్గరికి లాగు కాసేపు పేకేద్దాం' అన్నాడు పేకని అల్మెరా నుంచి తీస్తూ.
    "నాకు అంత బాగారాదు"
    "పదమూడు ముక్కలూ పేర్చుకోవటం వచ్చుగా చాలు ఒట్టి పురాణం కబుర్లు చెపుతావే" అని సిజర్స్ వేసి "ఊఁ కట్ చెయ్ జోకర్ తీ" అన్నాడు.
    బుద్ధిమంతురాలిలా అలాగే చూసింది.
    "ఊఁ స్టిక్ చెప్పు"
    "అంటే?"
    "పిచ్చిముఖమా? ఎంతాట ఆడదాం?"
    "నా వద్ద డబ్బులేదు"
    "పోనీ లెక్కరాసుకుందాం. నీ వద్ద నోట్ బుక్ వుందిగా"
    "నీలాగా నాకు మావాళ్ళు డబ్బులివ్వరు ఎప్పుడూ సిటీ బస్ ఖర్చుకుమాత్రం ఇస్తారు"
    "అయితే" అని పెదాలు బిగించి "ఓ కొత్తరకం పందెం వేద్దాం కౌంట్ అయితే కౌగిలి, పది పాయింట్లకి ఓ ముద్దు" అన్నాడు.
    ఫక్కున నవ్వింది.
    "ఏం?"
    "ఎవరు గెలిచినా నీకే లాభంకదూ?"
    "నీకు మాత్రం అని ఊఁ ఊఁ ఇక కానీ" అని చకచక ముక్కలు పరిచాడు.
    పదిహేను నిమిషాల్లో అది ముగిసింది. వసంత షో చేసింది, సుధాకర్ ది కౌంట్---
    నవ్వింది వసంత.
    "యస్! నేను నీకు కౌగిలి బాకీ- కమాన్ తీసుకో"
    "నో! నో! ఇప్పుడక్కరలేదు--- ఆట అంతా అయిపోయాక బాలెన్స్ చూసుకుందాం"
    "అలాగేలే, మరి పంచు" అని సిజర్స్ వేసి కట్ చే
    వసంత పంచింది కొత్తకొత్తగా ఆడినట్టేవుంది.
    కాలం గబగబా గడిచిపోయింది.
    ఎంతసేపు ఆడారో వాళ్ళకే తెలీలేదు.
    బయట వున్న గడియారం గంటలు కొడుతూవుంటే ఉలిక్కిపడి వింది వసంత! నాలుగు.
    "ఓ మైగాడ్! సాయంకాలం నాలుగైందా? ఇక వెళదాం" అంది వసంత.
    మధ్య మధ్య మాటలతో కబుర్లతో హుషారు చేస్తున్నాడు సుధాకర్ "అబ్బ పేకాట బోర్" అంటుందేమో కబుర్లు మార్చొచ్చని చూశాడు-- కానీ కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు పేకాట మోజులో మునిగిపోయింది వసంత.
    "నీ ఇష్టం"
    "అయితే లెక్కచూద్దాం" అని చెక్ చేసింది. చివరికి చూస్తే బాలెన్స్ నిల్! వసంత ముఖం వెలిగిపోయింది, సుధాకర్ ముఖం మాడిపోయింది.
    "ఇక వెళదామా?"
    "అప్పుడేనా?"

 Previous Page Next Page