" మేం కూడా ఒప్పుకొంటున్నాం!" అన్నారు మిగిలిన బృందం.
దాంతో పూర్ణ మొహం ఆనందంతో వెలిగిపోయింది.
" డన్! అయితే పందెం ఏమిటో వినండి ఫైనల్ బి.ఏ స్టూడెంట్..... పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిఅమ్మాయి....."
"గీతా!" కంగారుగా అన్నాడు దాసు.
"గీతో, పీతో బ్రదర్. నాకు అనవసరం. మరికొన్ని క్షణాల్లో కారులో కాలేజీకి వస్తుంది.కారిడార్ లో దిగి నడుస్తూ ఇటే వస్తుంది. గీతని మన అభినయ్ ముద్దు పెట్టుకోవాలి"
నీ పందెం ఇంత ఘోరంగా వుంటుందని మాకు తెలీదు ఇలాంటి పందెం అభినయ్ కి అవసరంలేదు. పందెం కాన్సిల్" అన్నాడు కమల్.
"అయితే ఓడిపోయినట్టు ఒప్పుకోండి" పూర్ణ డిమాండ్ చేశాడు.
పూర్ణ మొహంలోకి చూస్తున్నాడు అభినయ్ చిరునవ్వుతో.
రోజూ ఎవడితోనో ఒకడితో ఏదో ఒక పందెం కట్టడం అలవాటు పూర్ణకి అతని తండ్రి దగ్గర్లో వున్న పల్లెలో భూస్వామి. వచ్చేడబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తోచక ఇలా పిచ్చి పందాలు కడుతుంటాడు.
అభినయ్ కి ఏదన్నా ఇబ్బంది వస్తే అతన్ని కవ్వించి ఏదో ఒక పందెం కాయించి గెలుస్తుంటాడు.
కానీ ఇప్పుడు ఇంత ప్రమాదకరమైన పందెం వేస్తాడనుకోలేదు.
పూర్ణ అభినయ్ భుజం మీద చేయి వేశాడు.
" ఏరా, నువ్వు గీతని ముద్దు పెట్టుకుంటే పందెంలో నెగ్గుతావు...."
గీత అవమానం తలదించుకొంటుంది. నాక్కావల్సింది అదే!"
" అంటే?" దాసు అడిగాడు.
"అది నన్ను ఏమందో తెలుసా?
పశువా! అందిరా ఫ్రండ్స్.
నేను నల్లగా వున్నంత మాత్రంచేత దానికంటికిన దున్న పోతులానో, గేదెలానో కనబడ్డాననడం ఇది మన మగజాతికే అవమానం అందుకేరా ఈ పందెం"
సిద్ధార్థ మాట్లాడకుండా తలొంచుకున్నాడు. అతనికిదంతా నచ్చనట్టుగా మొహం పెట్టాడు.
" ఒరే అభినయ్, ఇదిగో క్యాష్ నిన్నే నాకు మనిఆర్డర్ వచ్చింది" జేబులోంచి నోట్లు తీసి రెపరెపలాడించాడు పూర్ణ.
సిద్ధార్థని చూసి అభినయ్ పందెం ఒప్పుకోడానికి నిశ్చయించుకున్నాడు.
పూర్ణ ఆశిస్తున్నట్టు ఆమెని అవమానించడానికి కాకపోయినా ఇప్పుడు అవసరం అలాంటిది.
ఏదో చిన్న బెట్ తో సరిపోతుందనుకున్నాడు. కనీ కళ్ళముందు వెయ్యి రూపాయలు కనబడుతున్నాయి. గీత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి కూతురు తర్వాత చిక్కులవలయంలో చిక్కుకుంటావని కూడా అభినయ్ కి తెలుసు.
ఆక్షణంలో అతనికి కైరవి, రమాదేవి గుర్తుకొచ్చారు.
కైరవి దగ్గర డబ్బు దొరకదు.
రమాదేవి అడిగితే కాదనకుండా ఇస్తుంది.
కానీ తను అడ్వాంటేజీని తీసుకున్నట్టుగా ఆమె భావిస్తే ఎంతో చులకన అయిపోతాడు.
" నేను రెడీరా పూర్ణ" అన్నాడు అభినయ్.
" సరే, నీ యిష్టం. కానీ ఇందుమూలంగా నువ్వు ఎదుర్కోబోయే కష్టనష్టాలకి, నాకూ ఎలాంటి సంబంధం వుండదు"
"నో ప్రాబ్లం!" అన్నాడు అభినయ్.
"అదుగో కారు...... అమ్మాయి గారు దిగుతున్నారు" అన్నాడు పూర్ణ.
అభినయ్ అటు చూశాడు.
కారు దిగి హంసలా నడిచి వస్తోంది గీత.
అప్పటికే పందెం జరుగుతోందని తెలుసుకొని గుంపులు గుంపులుగా చేరిపోయారు విద్యార్థినీ విద్యార్థులు.
కొందరు గీత వస్తుంటే జాలిగా చూస్తున్నారు.
ఇంకొందరు ఉత్సాహంగా వున్నారు.
ఊపిరి బిగపెట్టి చూస్తున్నారు ఏం జరుగుతుందోనన్న ఉత్సుకతో.
"అబ్బ ఏం నడకరా బాబూ! నా కైతే గీత పాదలని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది!" ఎవరో అన్నారు.
గీత నడక చూసి ఇంకెవరో అన్నారు.
"మిస్ ఇండియా సెలక్షన్ కెళితే గ్యారంటీగా ఎన్నకయిపోతుందిరీ ఈ అమ్మాజీ"
నిజం చెప్పాలంటే గీత నడక అద్భుతంగా వుంటుంది. ఆమె నడకని చూస్తే నెమలి కూడా సిగ్గుపడుతుందేమోననిపిస్తుంది.అలా నడవడం ఆమెకి మాత్రమే చాతనవును.
అభినయ్ ఆమెకి ఎదురు నడవడం మొదలుపెట్టాడు.
ఎదురుగా తన దారికి అడ్డంగా వస్తున్న అభినయ్ ని చూసి విస్మయంగా ఆగిపోయింది గీత.
తనతో ఏదన్నా మాట్లాడానికిగాని వస్తున్నాడేమోననుకుంది. గీత
కారిడార్ దగ్గర వందల సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు నిలబడ్డారు.
అభినయ్ పెదవుల మీద చిరునవ్వు.
గీత పక్కకి తప్పుకోబోయింది.
అభినయ్ గబుక్కున ఆమె భుజాలని పట్టుకున్నాడు.
ఊహించని ఆసంఘటనకి కంగారుపడింది గీత. అటూ యిటూ చూసింది. కానీ అంతలోనే....
ఒక చేతిని ఆమె మెడ వెనక్కి పోనిచ్చి రెండో చేతితో ఆమె మొహాన్ని పైకెత్తి పెదవుల మీద ముద్దు పెట్టకున్నాడు అభినయ్.
గీత కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది.
ఆమె చెంపలు సిగ్గుతోనూ, అవమానంతోన ఎర్రబడిపోయినాయి. అతనలా చేస్తాడని ఆమె ఏమాత్రం ఊహించలేదు.
ఆమె ఆవేశంతో ఊగిపోతూ చేతిని విసిరింది అతన్ని కొట్టడానికి.
ఆమె చర్యని ముందే ఊహించిన అభినయ్ ఆ చేయి తన చెంపనితాకకుండా పట్టుకున్నాడు.
"నీ చేయి కందిపోతుంది" అన్నాడు.
"స్టుపిడ్.... రాస్కెల్ " ఆమె మునిపళ్ళతో కింది పెదవిని కొరుక్కుంది.
అందరూ తనకేసే చూస్తుంటే ఆ అవమానా భారాన్ని మోయలేక గబగబానడుస్తూ వెళ్ళిపోయింది తిరిగి బయటకి.