బుక్ లో పేజీని మడతపెట్టి పక్కన టీపాయ్ మీద పెట్టి , బెడ్ లైట్ ను ఆర్పడానికి చెయ్యి ముందుకు సాచాడు.
సరిగ్గా అదే సమయంలో -----
ట్రింగ్ .......ట్రిం......ట్రిం.......
టెలిఫోన్------
ఎవరై ఉంటారు డాడీ ఏమో! రాత్రివేళ ఫోన్ చేసేది డాడీ ఒక్కరే.
గబుక్కున రిసీవర్ అందుకున్నాడు.
"హలో విమల్ హియర్"
ఒక్క క్షణం నిశ్శబ్దం.
"హలో విమల్ హియర్ " మళ్ళీ అన్నాడు.
"కొత్తలో ప్రతిరాత్రీ ఫోన్ చేసేవారు . జ్ఞాపకం ఉందా" అట్నించి ఆ గొంతు మెత్తగా విన్పించింది.
ఆ నిశ్శబ్దపు రాత్రిలో ఆ గొంతునుంచి వస్తున్న ఆ మాటలు ఏ.సి. గదిలో స్పష్టంగా విన్పిస్తోంది.
"నువ్వా" గుర్తు పట్టాడు విమల్.
"నువ్వా? అంటే నా గురించి మరిచిపోయారన్నమాట." ఆ గొంతు నుంచి వస్తున్న శబ్దం ఆడా, మగా కాని విలక్షణమైన స్వరంతో విన్పిస్తోంది.
"అదికాదు' ఏదో సవరణ చెయ్యబోయాడు విమల్.
"అవును .........నాకు తెలుసు ......మర్చిపోతారని నాకు తెలుసు మర్చిపోతున్నారని నాకు తెలుసు! కానీ ఒక్క విషయం! ఎంతగా మీరు మర్చిపోవటానికి ప్రయత్నించినా నేను మర్చిపోను, ఎక్కడున్నా , ఎలా వున్నా నేను మర్చిపోను.........గుర్తుంచుకొండి" ఏదో దగ్గు ఆ గొంతుకు అడ్డం పడింది. రెండు నిమిషాల సేపు ఆ దగ్గు ఫోన్ లో విన్పిస్తూనే వుంది.
ఆ తర్వాత నిశ్శబ్దం -----
"నీ హెల్త్ ఎలా గుంది?" నెమ్మదిగా అడిగాడు విమల్.
"విన్నారుగా ఇలా వుంది."
"మేడిసేన్స్ అవీ వాడుతున్నావా?"
సమాధానం లేదు.
"స్పెషలిస్టు ఏమన్నారు?"
సమాధానం లేదు.
ఆ తర్వాత -----
"చూడండీ మీ సానుభూతి పలకరింపులు, పరామర్శలు నాక్కకర్లేదని చెప్పాను. కొన్ని వెళ్ళ మైళ్ళ దూరం నుంచి నేనిప్పుడు ఫోన్ చేసింది మీ పరామర్శ కోసం కాదు మీ జాగ్రత్త కోసం."
"జాగ్రత్త కోసమా.........అంటే....."
"అంటే........." చిరునవ్వు.
"మీ రూంలో ఒక్కరే వున్నారా .ఎవరైనా వున్నారా.......అబద్దం ఆడకుండా నిజం చెప్పండి. మీరు అబద్దం చెప్పినా నాకు నిజం తెల్సుస్తుంది."
ఆ మాటకు విమల్ కు కోపం వచ్చింది.
"నా రూమ్ లో నేనొక్కడినే వుంటాను" విమల్ మాటల్లో కోపం ధ్వనించింది.
ఆ కోపాన్ని అవతలి గొంతు పసిగట్టింది.
"ఇంత మాత్రానికే కోపమా, విమల్ మీరిప్పుడు మీ రూంలోనే వున్నా మీరిప్పుడు వంటరిగా లేరు. మీ విశాలమైన బెడ్ మీద , ఇంకో అమ్మాయి, మన మాటల్ని వింటూ ఇంకో అమ్మాయి ఉంది. అవునా కాదా........."
విమల్ ఆ మాటలకు ఒక్కసారి తత్తరపడ్డాడు. భయంగా తన బెడ్ వేపు చూసాడు.
\నిజంగా అక్కడేవరూ లేరు.
"చూడు హాస్యానికి గానీ, అనుమానానికి గాని ఒక హద్డుంటుంది సీరియస్ గా అన్నాడు విమల్.
"మీతో హాస్యాలాడడానికి నాకిప్పుడు టైం లేదు. ఆ విషయం మీకు స్పష్టంగా తెల్సు కదూ. హస్యమాడే రోజులు పోయాయి. మాట తప్పించకండి. మీ బెడ్ మీద ఇప్పుడున్న అమ్మాయి పేరెం పేరో చెప్పండి. మీ సిన్మాలో ఎగస్ట్రా నా.........." విసురుగా వచ్చాయి ఆ మాటలు .
"కృష్ణనందనా" అరిచినంతగా పనిచేసాడు విమల్.
'అలా అరిచినంత మాత్రాన నేనేం బెదిరిపోను. చూడండి మీ ఆనందానికి నేనెలాగూ అడ్డురాను....రాలేను కూడా. కానీ ఒక నిజం తెల్సుకోవాలని అంతే. చెప్పేయండి ఫోన్ పెట్టేస్తాను. మీ హాపీ మూడ్ లోకి మీరెళ్ళిపోదురుగానీ" విమల్ వళ్ళంతా కుతకుతలాడిపోతోంది. ఫోన్ రిసివర్ని ముక్కలు ముక్కలు చేసేయ్యలన్నంత కసి వచ్చింది.
కానీ ------
ఏదో అశక్తత .........బలహీనత........
"వందనా నిజంగా నా రూంలో ఎవరూ లేదు. ఫోన్ పెట్టేయ్ నన్ను ప్రశాంతంగా నిద్రపోనీ.......రేపుదయం షూటింగ్ ఉంది." ప్రార్దిస్తున్నట్టుగా అడిగాడు విమల్.
"మీ మగవాళ్ళు చాలా దుర్మర్గులండీ ఒక్కసారి మీరు ఎనిమిది నెలల వెనక్కేళ్ళండి నా ఫోన్ కాల్ కోసం ఫోన్ లో నా గొంతు వినడం కోసం, రాత్రి రెండు మూడు గంటల వరకూ మీరు ఎదురు చూసేవారు అవునా........ఆ రోజులు పోయాయి. ఇపుడు నేను మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తున్నాను . అంతేనా, ఓ.కే....."
విమల్ ఏం మాట్లాడలేదు.
"చివరగా ఒకే ఒక ప్రశ్న జవాబు చెప్పేయండి" ఐ వాంట్ కరెక్ట్ అన్సర్."
"ఏంటా ప్రశ్న "విసుగ్గా అసహనంగా వుంది. విమల్.