Previous Page Next Page 
డాళింగ్ పేజి 15

 

    "మనసులోని బాధ చెప్పుకుంటే తీరుతుందంటారు" గేరు మారుస్తూ అంది మాధురి.
    "అందరితో అన్ని విషయాలు చెప్పలేం" నిర్లిప్తంగా ఉంది విమల్ గొంతు.
    "అందరితో చెప్పమన్నానా. నాతొ చెప్పొచ్చు కదా" మిర్రర్ లోంచి అతని కళ్ళ వేపు చూస్తూ అంది మాధురి.
    విమల్ మాట్లాడలేదు.
    మరో ఇరవై నిముషాలకు కారు ఊటీ చేరుకుంది.
    అందరికీ ఒక్కసారి ప్రాణం లేసోచ్చినట్టయింది. విమల్ తిరిగొచ్చినా వార్తా క్షణాల్లో అన్నిచోట్లకు చేరిపోయింది. యూనిట్ సభ్యులు హోటల్ మేనేజ్ మెంట్ ఊపిరి తీసుకుంది. ఈ విషయం విమల్ తండ్రికి తెలిసి ఫైరయ్యే లోపే అతను తిరిగి రావడం అందర్నీ కుదుటపర్చింది.
    "హీరోగారూ ఎటు వెళ్ళిపోయారండి సడన్ గా విఠల చార్య సినిమాలోలా మాయమైపొతే ఎలాగండీ. నా గుండె గట్టిది కాబట్టి తట్టుకున్నాను లేకపోతేనా" అలా అంటున్న ప్రొడ్యుసర్ వేపు నవ్వుతూ చూసి.
    "సారీ ఇకనుంచి ఇలా జరగదు" అన్నాడు విమల్.
    "భరోసా ఇచ్చేరయ్యా . ఇక ఏకబికిన లాగించేద్దాం" హీరో, హీరోయిన్ వేపు చూస్తూ అన్నాడు డైరెక్టర్.
    ఊటీలో దగ్గర్లో "అంబరిల్లా ట్రీ" అనే గ్రామం వుంది. అక్కడ తోడా జాతి గిరిజనులుంటారు. ఆ గ్రామ ప్రాంతాలలో పాట షూటింగ్ జరుగుతోంది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయిన షూటింగు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరిగింది.
    ఒంటిగంటకు లంచ్ బ్రేక్.
    హీరో, హీరోయిన్లకు స్పెషల్ లంచ్ వచ్చింది.
    ఎదురెదురుగా కూర్చుని తింటున్నారు.
    మౌనంగా ఏమీ మాట్లాడకుండా లంచ్ చేస్తోన్న విమల్ ని చూస్తుంటే మాధురికి ఏదో అసంతృప్తిగా అనిపించింది.
    "నాకు చిన్నప్పుడు విఠలా చార్య సినిమాలంటే ఎంతో సరదాగా వుండేది. ఎన్నిసార్లు చూసేదాన్నో తెలీదు. సడన్ గా రామారావు గారో, కాంతారావు గారో మాయమైపోవడం పొట్టేలు గానో, తోడేలుగానో మారిపోవడం, రాజనాల పులిలా మాయమై పోవడం చీకటి గుహలో పాములు అబ్బా అప్పట్లో రాత్రిళ్ళు ఆ సీనులే కలల్లో కొచ్చి ఎంత భయమేసేదో...అప్పుడప్పుడు నిద్దర్లో కేకలు వేసేదాన్నట" మాధురి ఎలాగోలా అతన్ని  మాటల్లోకి దించాలని చెప్పింది.
    "ఇప్పటికి ఆ సీన్ లు తలచుకొని భయపడుతున్నారా" నెమ్మదిగా అడిగాడు విమల్.
    "లేదు, రహస్యం తెల్సిపోయింది. ఈ మధ్య వాహిని లో విఠలా చార్య గారు కలిసారు. అదే చెప్పాను ఆయనతో . అయన పెద్దగా నవ్వేసి అదంతా వైరు వర్క్, ఆట్ట సెట్టింగులేగా అనన్నారు దాంతో నాకు భయం పోయింది" నవ్వుతూ అంది మాధురి.
    ఆ మాటలకు విమల్ పెద్దగా నవ్వాడు.
    "హీరో, హీరోయిన్ లు కలుసుకోవడం వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడడానికి అప్పట్లో డైరెక్టర్లు ఎన్ని సీన్లు తీసి ఎస్టాబ్లిష్ చేసేవారో. ఇప్పుడో అంతా స్పీడ్' కామెంట్ చేసింది మాధురి.
    "ఇప్పటి జనరేషనే అంత. దానికి మన సినిమాలు అద్దం పడుతున్నాయి అంతే."
    లంచ్ కార్యక్రమం అయిపొయింది.
    ఇద్దరూ చెట్లకింద తీరుబడిగా కూర్చున్నారు.
    మాధురి కళ్ళవైపే అలా చూస్తున్నాడు విమల్ ' ఎందుకో సిగ్గనిపించి ఎటో చూస్తున్నట్టు నటిస్తోంది మాధురి.
    "మాధురి మిమ్మల్నో ప్రశ్న వెయ్యనా, ఏమనుకోకూడదు" అకస్మాత్తుగా అడిగాడు విమల్.
    "నేనెప్పుడైనా ఏవైనా అనుకున్నానా, అడగండి" నవ్వుతూ అంది మాధురి.
    "ఎప్పుడైనా మీరు ఎవర్నయినా ఇష్టపడ్డారా" అడిగాడు విమల్.
    అలాంటి ప్రశ్న విమల్ వేస్తాడని ఊహించలేదు మాధురి.
    "ఇష్టపడటం అంటే......."ఎదురు ప్రశ్న వేసింది.
    "అంటే.....ప్రేమించడం."
    "నా దృష్టిలో ఇష్టం ప్రేమ వేర్వేరు చాలామందిని ఇష్టపడతాం. కానీ ఒక్కర్నే ప్రేమిస్తాం."
    "కావచ్చు, ఎవర్ని ఇష్టపడ్డారు, ఎవర్ని ప్రేమించారు." మళ్ళీ ప్రశ్న వేశాడు విమల్.
    "మా డాడీ అంటే ఇష్టం మమ్మీ అంటే ఇష్టం.......ప్రెండ్స్ అంటే ఇష్టం. ప్రేమించడం అంటే ఇంతవరకూ నేనెవర్ని ప్రేమించలేదు."
    "ఏం అలాంటివాళ్ళు తారసపడలేదా"
    రెండు నిమిషాలు ఆలోచనల్లోపడింది మాధురి. ఇంతల్లో డైరెక్టర్ నుంచి పిలుపొచ్చింది.


                                                   *    *    *    *

    రాత్రి పది గంటలైంది.
    "గాన్ విత్ ద విండ్' నవల చదువుతున్నాడు విమల్.
    She wondered Occasionally if these meetings were not more than accidental. They became more and more numerous as tha weeks went by and as the tension in town heightened over negro ontrages. but why did he sheek her out, now of all times when she looked her worst Certainly he had no designs upen her if he had ever had any and she was begining to doubt even this it had been months sinces he made any joking references to their distressing scence at the Yankee Jail. He never mentioned Ashley and love for him. or made any coarse and illbread remarks about ..."coveting her" she thought it best to let Sleeping dogs lie, so she did not ask for an explanation of their frequent meetings". And finally she decided that because he had little to do besides gamble and had the anough nice friends in Atlanta he sought her out solely for companionship's sake."

 Previous Page Next Page