Previous Page Next Page 
యోధుడు పేజి 14

    "మిష్టర్ కాశీ... యూ ఆర్ లక్కీ పర్సన్. నువ్వు ప్రయాణం చేస్తున్నా ట్రైన్ ప్రమాదానికి గురైందని తెలిసి నేనెంత వర్రీ అయ్యానో తెలుసా?

    ఎంతగా నీ కోసం గాలించానో తెలుసా? ఈ శుభ్రత హాస్పిటల్లో డాక్టర్ మధురిమ దగ్గర నువ్వు ట్రీట్ మెంట్ పొందుతూన్నావని తెలిసే వరకూ నేననుభవించిన చిత్రవధ నేనీ క్షణంలో నీకు చెప్పలేను."

    కాశీచరణ్,  నీలకంఠన్  చెబుతున్న మాటల్ని రెడియాలో న్యూస్ వింటున్నట్ట్లుగా వుంటున్నాడు తప్ప అతనిలో ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం డాక్టర్ మధురిమ గమనించింది.

    "క్యారీయాన్ మిస్టర్  నీలకంఠన్ ! మీరు మాట్లాడాక రండి" ఇద్దరికీ ఏకాంతాన్ని కల్పిస్తూ బయటకి వెళ్ళిపోయింది డాక్టర్ మధురిమ.

    మధురిమ బయటకి వెళ్ళిపోయాక మొదటి ప్రశ్న వేశాడు  నీలకంఠన్ _ "నేను నీకు గుర్తున్నానా?'

    తల అడ్డంగా వూపాడు కాశీచరణ్.

    "అంటే?"

     "మీరెవరో నాకు తెలీదు. మిమల్ని నేనెప్పుడూ చూడలేదు. మొట్టమొదటిసారిగా యిప్పుడే చూస్తున్నాను." అన్నాడు కాశీచరణ్ భావరహితంగా.

    ఆ మాటలకు నవ్వాడు లాయర్  నీలకంఠన్ .

    "మిష్టర్ కాశీచరణ్! నా పేరుగాని, నా గురించీగాని నీకు జ్ఞాపకంలేదని డాక్టర్ మధురిమ నాకు ముందే చెప్పారు. నేను నీకు డిల్లీ ఎడ్రస్ కి ఉత్తరం వ్రాశాను. అలాగే మనం ఏస్.టి.డి ఫోన్ లో మాట్ల్దాదుకున్నాం. నువ్వు నాకు ఉత్తరంకూడా రాశావు. అ ఉత్తరం ప్రస్తుతం నా దగ్గరవుంది " అంటూ తన బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి అందులోంచి కొన్ని కాగితాలతోపాటు ఉత్తరాన్ని తీసి కాశీచరణ్ కు అందించాడు  నీలకంఠన్ .

     అదే సమయంలో రెండు టీ కప్పులతో లోనికొచ్చి ఇద్దరికీ అందించి వెళ్ళిపోయాడు శివానందం.

    తన గురించి జ్ఞాపకం లేకపోయినా, కాశీచరణ్ అంత త్వరగా గాయాల నుంచి కోలుకున్నందుకు లాయర్  నీలకంఠన్  కి ఆనందంగా వుంది. కాశీచరణ్ తన చేతిలోని ఉత్తరం వైపు చూశాడు. అది తన రాసిన ఉత్తరమా? ఏదీ గుర్తుకు రావడంలేదు.

    "మిష్టర్ కాశీచరణ్! నీకు అమ్మ గుర్తుందా?" లాయర్ అడిగాడు.

    "అసలు నేనెవరో నాకే తెలియనపుడు నాకో అమ్మమ్మ వున్న విషయం ఎలా తెలుస్తుంది లాయర్?" అసహనంగా అన్నాడు కాశీచరణ్. అయినా  నీలకంఠన్  నిరాశ పడలేదు.

    "మీ అమ్మమ్మ పేరు మాణిక్యమ్మ. ఆమె భర్త అంటే మీ తాతగారు నైజాం నవాబు దగ్గర హకీంగా వుండేవాడు. మీ తాటకి ఆయుర్వేధం, యునానీల మీద మంచి పట్టు వుండేది.

    అయన చేసిన సేవలకు అప్పటి నిజాం నవాబు సరూర్ నగర్ వద్ద 100ఎకరాల భూమి, బేగం పేటలో ఐదువేల గజాల స్థలం బంజారా హిల్స్ లో ఐదువేల గజాల స్థలం, ఇనాం గా యిచ్చాడు. మీ తాత నరూర్ నగర్ వద్ద గల 100ఎకరాల్లో కూరగాయలు, గడ్డి పెంచేవారు.

    అయన ముసలి వయస్సులో 100ఎకరాల్లో 10ఎకరాలు అమ్మేశారు. ప్రస్తుతం సరూర్ నగర్ గ్రామంలో 90ఎకరాలు, బేగంపేట, బంజారాహిల్స్ లో వున్న రెండుప్లాట్లు, అయన చనిపోవడంతో మీ అమ్మమ్మ మాణిక్యమ్మకు చెందాయి."

    అయన చెప్తున్నా విషయాల్ని కాశీచరణ్ ఆసక్తిగా వింటున్నాడు. ఆ విషయాలేవీ ఒక్క ముక్కకూడా గతంలో విన్నట్లు అతనికి గుర్తులేవు.

    "మీ తాతపేరు కాళేశ్వర సత్సనారాయణ ప్రసాద్. అంతా హకీంనాట్యం అనేవారు. అయన బేగం పేట స్థలంలో ఒక భవనాన్ని నిర్మించారు. మీ తాత, నేను చిన్నప్పటి స్నేహితులం. నా చదువుకి ఆయనే సహాయం చేశాడు. మీ తాతకి ఒకే కూతురు. పేరు సుశీల_ మీ అమ్మ."

    ఆ పేరు విన్నప్పుడు కూడా కాశీచరణ్ లో ఎలాంటి లేకపోవడం  నీలకంఠన్  గమనించాడు.

    "మీ అమ్మ సుశీల పదహారేళ్ళప్పుడు_ ఇంటి పక్కనే వుండే మరాఠీ కుర్రాడు సంతోష్కేవల్కర్ ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం తెల్సి మీ తాత అగ్గిరాముడై పోయాడు. సంతోష్ మరాఠీవాడు_ పైగా నిరుద్యోగి_చిన్న బట్టల వ్యాపారం చేసేవాడు.

    మీతాత తన ఒక్కగానొక్క కూతురు సుశీలను మరాఠీ అబ్బాయికి యివ్వడానికి ఒప్పుకోలేదు. ఆఖరికి నా మాట వినలేదు."

    చెప్పి, కాశీచరణ్ కళ్ళలోకి చూశాడు  నీలకంఠన్ . గ్లాసులోని నీళ్ళు తాగి మళ్ళీ చెప్పసాగాడు.

    "ఒక రాత్రి మీ తాతకు మొదటిసారిగా హార్ట్ ఎటాక్ వచ్చింది. దానికి కారణం_ సుశీల సంతోష్ కేవల్కర్ తో ఎక్కడికో వెళ్ళిపోవడం. తన కూతురు చచ్చిందనుకుంటానని, ఆ రోజునుంచే ఆమెను మర్చిపోయాడు. మీ తాత చనిపోయాక, మీ అమ్మమ్మ భవంతిలో సగ భాగం అద్దేకిచ్చింది, అద్దే డబ్బు, పొలం కౌలు డబ్బుని వడ్డీలకిచ్చిబాగానే సంపాదించింది.

    మీ నాన్న, అమ్మ కర్నాటకలోని లింగ్ షుగర్ సిటీలో వుంటున్నట్లు, బట్టల వ్యాపారం కల్సిరాక, వేరేచోటకి వెళ్ళినట్లు తెల్సింది.

    ఆ తర్వాత వారు బళ్లారిలో వుంటున్నట్లు తెల్సింది. అప్పటికి నువ్వోక్కడివే సంతానం.

    బళ్లారిలో, రోడ్డు ప్రమాదంలో సుశీల మరణించటంతో సంతోష్ కేవల్కర్, అంటే_ మీ నాన్న తీసుకుని ఎటో వెళ్ళిపోయినట్లు మాత్రం మీ అమ్మమ్మకు తెల్సింది సుశీల మరణించాక కూడా ఆమె మనస్సు కరగలేదు. సుశీల జీవిత పేదరికంలో గడవటానికి కారణం సంతోష్ కెవల్కర్ అని అతని మీద కోపం. కేవలం కోపం  కాదు...ద్వేషం.

    కానీ ఆమె అవసాన దశలో మనవడు మీద ప్రేమ పుట్టుకొచ్చింది_ తన ఆస్తికి ఏకైక వారుసడైనా నీ గురించి బెంగా పెట్టుకుంది.

 Previous Page Next Page