నీ మీద మీ అమ్మమ్మ పెట్టుకున్న బెంగా మానసిక వ్యాధిగా మారి అనారోగ్యానికి దారి తీసింది.
అప్పుడే ఆమె విలునామా రాసింది_ తన ఏకైక వారసుడుగా నిన్ను పేర్కొంటూ, తన ఆస్తి మొత్తం నీకు చెందాలని రాసింది ఇప్పుడు కోట్లాది రూపాయల ఆస్తినీ నీ పేరున వుంది" చెప్పటం ఆపి కాశీచరణ్ వైపు చూశాడు నీలకంఠన్ . అతని ముఖం భావరహితంగా వుండే తప్ప ఏ మార్పూలేదు.
"ఆ వీలునామాలో మా అమ్మమ్మగా పేర్కొనబడుతున్న వ్యక్తి నాపేరు... ఏమని రాసింది?" అడిగాడు కాశీచరణ్ కేజువల్ గా.
చాలా ఆసక్తికరమైన ప్రశ్న!
చిన్నగా నవ్వి చెప్పాడు నీలకంఠన్ .
"హాకీం సత్యం ఏకైక పుత్రిక సుశీల కూమారుడు... అదే నీ పేరు..." నవ్వుతూ అన్నాడు నీలకంఠన్ .
"పిచ్చి తగ్గింది... తలకు రోకలి చుట్టమన్నాడట వెనకటికేవడో ..." వ్యాఖ్యానించాడు. కాశీచరణ్.
"మరి నీ పేరే తెలీని ఆమె ఏం పేరని రాయిస్తుంది! ఒకవేళ నువ్వు దొరక్కపోతే, ఈ ఆస్థి మొత్తం నా అధీనంలో వుంటుందని రాసిందామే. నేనా బ్రహ్మచారిని. నా కంటూ ఎవరూ లేరు. హంకీం సత్యం ఆత్మ శాంతించ్చేలా చేయాలి.
నీ గురించి దేశంలోని అన్ని అగ్ల పత్రికల్లో ప్రకటించాను మీ నానా నిన్ను తప్పక చదివిస్తాడని భావించి... అయా ప్రకటన వేయించాను. అయితే... ఆస్తి గురించి వివరాలు ఆ ప్రకటనలో వేయించాకపోవడంవల్ల మూడు నెలలు వరకునాకేలాంటి రెస్పాన్సు రాలేదేమో అనుకుని ఆస్తి వివరాలతో మరో ప్రకటన యిచ్చాను.
"నా గురించి మీకెలా తెల్సింది?" మరొక ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు కాశీచరణ్
"నీ అదృష్టం బావుండి నేనిచ్చిన యాడ్ ని నువ్వు అనుకోకుండా చేశావు. నువ్వు యాడ్ ఏజెన్సీలోపని చేస్తుండబట్టి_ వృత్తిపరంగా అన్ని దినపత్రికల్ని తిరగేసే అవసరం నీకుంటుంది.
నీ కున్న వృత్తిపరమైన ఆ అవసరం కారణంగానే నా ప్రకటన నీ దృష్టిలో కొచ్చింది. మీ నాన్న తన గతాన్ని నీకు చెప్పి వుండటంతో, నీకు విషయం అర్ధమైపోయింది. వెంటనే నువ్వు నాకు ఫోన్ చేశావు. మీ నాన్న చనిపోయాక డిల్లీలో వుంటున్న నువ్వు. అక్కడఫర్ ఫెక్ట్ యాడ్ ఏజెన్సీలో యాడ్స్ ఏజెంట్ గా చేస్తున్నావు, డిల్లీ నుంచి నువ్వు ఫోన్ చేశాక నీ గురించి కొన్ని వివరాలు నాకు తెలిశాయి. ఆ వివరాల్ని డిల్లీలో వున్న నా ఒకప్పటి జూనియర్ లాయర్ కొచ్చి ఎంక్వైరీ చేయమన్నాను. ఆ జూనియర్ లాయర్ డిల్లీలో నిన్ను కలిశాక, నువ్వు నన్ను కలవడానికి ఎ.పి. ఎక్స్ ప్రెస్ లో అవసరమైన సర్టిఫికేట్ తో బయలుదేరావు.
ఆ విషయం... అంటే... ఫలానా రోజున నువ్వు బయల్దేరి వస్తున్నట్లుగా నువ్వు నాకు తిరిగి ఫోన్ చేసి చెప్పావు. ఎ.పి ఎక్స్ ప్రెస్ లో వస్తున్న నిన్ను నేను రిసీవ్ చేసుకోవాలనుకుంటుండగా... రైల్ యాక్సిడెంట్ గురించి తెల్సి షాకయ్యను, మిగతా సంగతి నీకు తెల్సిందే..." భారం దించుకున్నట్లు రిలాక్స్ డ్ గా ఫీలవుతూ చెప్పాడు నీలకంఠన్.
తన తండ్రి సంతోష్ కేవల్కర్ మరాఠీ... కాని తను పెరిగింది కర్నాటకాలో, అయితే తనకు కన్నడం బాగావచ్చుండాలి. తనకి కన్నడం వచ్చా? మాట్లాడగలడా? తను యాడ్ ఏజెంట్ గా డిల్లీలో పని చేస్తుంటే హిందీ కూడా రావాలి కదా. వచ్చా... డిగ్రీ అయినా పూర్తీచేసి వుండాలి. తను డిగ్రీ చదివాడా... ఎక్కడా... మైసూర్ లోనా... బెంగుళూరులోనా... ఏకాలేజీలో చదివాడు... తనకు ప్రెండ్స్ ఎవరూ లేరా?
"మిస్టర్ కాశీచరణ్! ఇంతవరకూ నీ ఆర్ధిక పరిస్థితి ఎలా వుందో నాకైతే తెలేదుకానీ ఇకనుంచీ నువ్వు దేనికీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ అమ్మమ్మ మాణిఖ్యం పేరున బ్యాంక్ లో వున్న దాదాపు 50లక్షలు_నీ పేరున బదిలీ అవుతాయి. రైల్వే డిపార్ట్ మెంట్ ప్రకటించిన ఎక్స్ గ్రేషియా నీ హాస్పిటల్ ఖర్చుకి సరిపోతుంది ప్రస్తుతం నా పర్సనల్ ఆ మౌంట్ నీకో యభై వేలిస్తాను. అలాగే పదివేలు డాక్టర్ మధురిమకిస్తాను_ ట్రీట్ మెంట్ ఖర్చులుకి.
ఇక బేగంపేట, బంజారాహిల్స్ స్థలాలు అమ్మితే, ఇప్పటి రేటు ప్రకారం అయిదారు కోట్లు రావచ్చు. ఆ సరూర్ నగర్ లోనే 90 ఎకరాలు వుంచుకుంటే భవిష్యత్తులో పనికొస్తుంది. లేదా అమ్ముకోవలనుకుంటే రెండున్నర, మూడుకోట్ల రూపాయలు రావచ్చు. సో.... ఇకనువ్వు ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు. ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు.... లేదా బ్యాంకులో వేసుకుంటే వడ్డీమీద హాయిగా బ్రతకొచ్చు" చెప్పి మళ్ళీ నీళ్ళు తాగాడు లాయర్ .
"చాలా పెద్ద ప్లాష్ బ్యాక్ స్టోరీ కోట్లు... ఆస్తికి తను ఏకైక వారసుడు! తన తల్లి వల్ల తెలుగోచ్చింది. తను చదవడంవల్ల ఇంగ్లీషు వచ్చింది. మరాఠీ తనకు రాలేదా? కన్నడం కూడా రావాలి కర్నాటకలో వున్నందున, మర్చిపోయాడా?
అసలు అమ్మా, నాన్న...వాళ్ళ రూపాలు... ఏవీ గుర్తుకురావడం లేదు. ఎందుకని?
తన గురించి తెలుసుకోవడంలో లాయర్ చాలా శ్రమపడి వుండాలి.
లాయర్లు, సాధారణంగా తప్పు చేయరు. అందులోనూ నీలకంఠన్ లాంటి సిన్సియర్ మాన్...సో... తన ఐడెంటిటీ సరిగ్గానే వుంది. అంటే ప్రస్తుతానికి తనకు సంబంధించిన వ్యక్తి లాయర్ నీలకంఠన్ ఒక్కడే! అంతకుమించి మరెవరూ లేరా?
ఇంతకాలం ఇంత ఖరీదైనా వైద్యానికి డబులు ఎవరిస్తారన్న అందోళన వుండేది కాశీచరణ్ కు. ఇప్పుడా భయంలేదు. తనకు చాలా ఆస్తి వుంది. భూములున్నాయి. ఇప్పుడు తన ఒంటరి జీవితంలో తనకు కావలసింది తనను అభిమానించే వ్యక్తి స్నేహం.