Previous Page Next Page 
యోధుడు పేజి 13

    వరసగా పేషెంట్స్ చూస్తూ థర్టీసిక్స్ బెడ్ వైపు చూసి ఆ పేషెంట్ దుప్పటి కప్పుకుని నిద్రపోతుండడంతో ఊపిరి పీల్చుకుని ముందుకడుగేసింది మేరీ.

    "హాలో... హలో" పిలుపు వినబడడంతో ఉలిక్కిపడి వెనక్కు తిరిగిందామే.

    "నేనే! పడుకున్నాననుకొని వెళ్ళిపోతున్నావు కదూ! రా నర్సూ నీ కోసమే ఎదురుస్తున్నాను" అన్నాడా పేషెంట్.

     "నా కోసమా... ఎందుకూ?" రాయలసీమ యాసతో మాట్లాడే మాటలు చాలా జోగ్గా వుంటాయి మేరీ చెవులకు.

    "చెప్పండి_ ఎనీ ప్రాబ్లం?" అడిగింది మేరీ.

    "ఏం చప్పాలి నర్స్? నిన్న ప్రెసిడెంట్ దగ్గరకు ఇరవై మంది ఏమ్మేల్యేల్ని తీసుకెళ్ళి నా బల్లాన్ని నిరూపించుకున్నాను గదా. అయిదుగురు ఏమ్మేల్యేల్ని తీసుకెళ్ళినవాళ్ళే మంత్రి పదవిని ఆశిస్తున్నప్పుడు నేను ఆశించడంలో తప్పులేదుకదా. అందుకే కేబినెట్ మంత్రిపదవి అడిగాను."

    "ఏమైంది? పార్టీ ప్రెసిడెంట్ ఇస్తానన్నడా?" నవ్వును దాచుకుంటూ అడిగింది మేరీ.

    "అన్నాడు. కానీ రాత్రికి రాత్రి ప్రజాస్వామ్యం భంగబడిపోయింది నర్సూ! ముందురోజు నన్ను రాత్రి ఎమేల్యేలు, రేండో రోజున ఇంకొకడివైపు వెళ్ళిపోయి నాకు మంత్రిపదవిని దక్కకుండా పోయింది" భాదపడుతూ అన్నాడతను.

    "ఎయ్యో పాపం... నువ్వు హాస్పిటల్లో చేరడానికి అసలు కారణం అదా?"

    అదొక్కటేకాదనుకో. తీరుబడిగా ఆలోచించుకోవాలంటే హాస్పిటల్ కంటె మంచి ప్లేస్ దొరకడు గదా అందుకే యిక్కడికొచ్చా. ఇక్కడీ కొచ్చిన ఇరవై నాలుగుగంటల్లో అద్భుతమైన ఐడియా వచ్చింది" ఉత్సాహంగా అన్నాడు అతను.

    "ఏంటదీ?"

    "హుసేన్ సాగర్ లో హొటల్  కట్టించాలని."

    "హుస్సేన్ సాగర్ లో హొటల్ ? అదేందుకు మధ్యన? పాలిటిక్స్ కు స్వస్తి చెప్పేస్తావా?"

    "పాలిటిక్స్ అంటే ఏమిటి? కొంచెం సమతి, మరికొంచెం అసమ్మతి. అంతేకదా! ఎమెల్యేలందరూ ఎవరూ మంత్రిపదవులు యివ్వాలేరు కాబట్టి_ రెండు నెలల్లో అసమ్మతి మొదలవుతుంది. ఒకరు ఆసమ్మతి నాయుకుడు అంటూ బయల్దేరాడు అవునుకదా వాడి వెనక ఎమేల్యేలూ బయలుదేరారు.

    మరీ వీళ్ళందరికీ ఒక హొటల్  వుండాలికదా. అందుచేత హొటల్  కట్టిస్తానన్న మాట. నా హొటల్లోనే మీటింగులనీ జరుగుతాయి కాబట్టి, కొత్త ముఖ్యమంత్రి కూడా అక్కడే పుడతాడు కాబట్టి నా హొటల్ లో వాళ్ళందరూ వున్నందుగ్గాను చార్జీలక్రింద ఓ మినిష్టర్ పదవిఅడుగుతాను. ఎలా వుంది ఐడియా?" ఆనందపడిపోతూ అన్నాడతను.

    "ఏడ్చినట్టే వుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపేట్టి ముందుపడుకో" అంది మేరీ మెత్తగా కసురుకుంటూ.

    "నా ఐడియా తెలివితక్కువ ఐడియలా వుందా? నువ్వు నన్ను యిప్పట్నుంచే సపోర్టు చేశాననుకో_ నిన్నే హాల్ట్ మినిస్టర్ గా చేస్తా" పెద్దగా నవ్వుతూ అన్నాడతను.

    "ఇంజక్షన్ టైమైంది. ఇంజక్షన్ చేస్తా" అంటూ అతని భుజమ్మీద యిజంక్షన్ చేసింది మేరీ హఠాత్తుగా.

    "ఈ టైమ్ లో ఇంజక్షన్ ఏమిటి కొత్తగా?" అని అడిగాడు.

    "మత్తు ఇంజక్షన్ లే. హాయిగా పడుకో" అంటూ ఆ రూమ్ లోంచి బయటకెళ్ళిపోయింది మేరీ.

    "ఇదన్యాయం. ప్రజస్వామ్య వ్యతిరేక చర్యలు నశించాలి. పూర్తిగా నశించాలి. నేను ఎప్పుడో ఖాయం. నేను మినిష్టర్  అవ్వడం ఖాయం. కానీ నిన్ను... నిన్ను ఈ హాస్పిటల్ నుంచి సస్పెండ్ చేయించకపోతే నాపేరు... పేరు" ఆవలింతలు, ఆ తర్వాత మత్తు ముంచుకురాగా మరి మాట్లాడాలేకపోయాడు ఆ పేషెంట్.

    "ప్రజాస్వామ్యం మత్తుమందు తీసుకుని మరీ నిద్రపోయింది" ఈ గొడవంతా గమనిస్తున్న పక్కనున పేషెంట్ కామెంట్ చేశాడు నవ్వుతూ.
   
                                                     *    *    *    *
   
    డోర్ తెరుచుకుని లోనికొచ్చిన వ్యక్తి సూటిగా చూసింది డాక్టర్ మధురిమ.

    "అయాం లాయర్   నీలకంఠన్" నమస్కరిస్తూ అన్నాడాయన. ప్రతినమస్కారం చేసింది మధురిమ.

    "కాశీచరణ్ ఎక్కడనుండో అనూహ్యంగా యిక్కడకు చేరడం చాలా ఆశ్చర్యంగా వుంది డాక్టర్" ఏ ఉపోద్ఘాతం లేకుండా, లాయర్  నీలకంఠన్  నేరుగా టాఫిక్ లో కొచ్చేశాడు.

    "అవును! యాక్సిడెంట్ కేసో, మెడికో లీగల్ కేసో తెలీక పోయినా, మానవతా దృక్ఫథంతోనే చేర్చుకున్నాను. ఆ నలుగురు మెడికో స్టూడెంట్స్ కరెక్ట్ టైముకి కాశీచరణ్ యిక్కడకు చేర్చారు. లేకపోతే అతను బ్రతికేవాడు కాదు" అందామె.

    "వృత్తిపట్ల మీకున్న నిజాయితీని మనసారా అభినందిస్తున్నానమ్మా_ బైదిబై అతడ్ని నేను చూడవచ్చా?" అని లేచి నిలబడింది డాక్టర్ మధురిమ.

    పేషెంట్ కు, తనకుగల పూర్వపరిచయం గురించి మాట్లాడాసాగాడు  నీలకంఠన్ .

    ఒక నిమిషం తర్వాత "ఇదే అతని రూమ్" అని డోర్ తెరచి లోనికి అడుగుపెట్టింది మధురిమ.

    అంతవరకూ జేరగలపడుకున్న కాశీచరణ్ సడన్ గా  తలతిప్పి డోర్ వైపు చూశాడు.

    "మిష్టర్ కాశీచరణ్... హి ఈజ్ మిష్టర్  నీలకంఠన్ . లాయర్  నీలకంఠన్ . మీ గురించి కలవరిస్తున్న వ్యక్తి ఈయనే" అంది మధురిమ కాశీచరణ్ కేసి చూస్తూ.

     నీలకంఠన్  వైపు నఖశిఖపర్యంతం చూశాడు అతను.

 Previous Page Next Page