Previous Page Next Page 
యోధుడు పేజి 12

    వెనీషియన్ బ్లయిండ్స్ వేపు తదేకంగా చూస్తున్నాడతను. లేత సూర్యకిరణాలు ప్రతిఫలిస్తున్న మిర్రర్స్ ఏవో అస్పష్టమయిన జ్ఞాపకాలు,

    దట్టమయిన మంచుపోగా, దూసుకుపోతున్న రైలు, ఆకస్త్మాత్తుగా ఏదో బాంబు పేలినట్లు శబ్దం, తర్వాత అక్కడంతా నిశ్చబ్దం.

    అ యాక్సిడెంట్ లోనే తన బ్రెయిన్ కి ఏదో ప్రమాదం జరిగింది. లేకపోతే తన పేరు తనేమరచిపోవడం ఏమిటి? రైల్లో తన పక్క సీట్లో ఎవరో వుండాలే... ఎవరా వ్యక్తి?

    ఆలోచిస్తుంటే కాశీచరణ్ తలలో నరాలు చిట్లిపోతున్నట్లుగా వుంది. ఏదో తెలియని మత్తు, మగత.

    తన అసలు పేరు ఏమి వుంటుంది కాశీచరణేనా ? ఆ పేరుతోనే తను స్థిరపడి పోతాడా? తను వేసిన ఆ ప్రశ్నలకు సమాధానం యివ్వలేని నిస్సహాయస్థితి అతని కళ్ళలో స్పష్టంగా గమనించింది.

    ఆ సమయంలో సమాదానలా కోసం రెట్టించడం అంత మంచిది కాదని దగ్గరగా వెళ్ళి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని నాడిని చెక్ చేయసాగింది. చేతి వాచీవైపు చూసుకుంటూ.

    మధురిమ స్పర్శ మత్తుగా, గమ్మత్తుగా వుంది కాశీచరణ్ తను మధురిమ అంతకుముందెప్పుడూ చూడలేదు. ఆమె పర్యవేక్షణలోకి రావడం చాలా కాకాతాళీయంగా జరిగిన విషయం. ఆమె పక్కనంటే, ఒక డాక్టర్ ను కాకుండా ఎవరో అత్మీయురాలిని చోస్తున్నట్ట్లుగా వుంది కాశీచరణ్ కు.

    "గుడ్... హార్ట్ బీట్ నార్మల్. భుజానికి తగిలిన గాయం కూడా తగ్గుతోంది. తలకి గాయం తకలగాపోయివుంటే అసలు సమస్యే వుండేది కాదు. ఎనీవే_ప్రాబ్లం లేదులేండి" అని అప్పుడే వచ్చిన నర్స్ మేరీవైపు చూసింది డాక్టర్ మధురిమ.

    ఆ చూపును అర్ధం చేసుకున్న మేరీ వెంటనే బయటకు వెళ్ళిపోయింది.

    కాశీచరణ్ కళ్ళలోకి సూటిగా చూసింది మధురిమ. "మిస్టర్ కాశీ! ఆంద్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ లో ఆ రోజు మీరు హైదరాబాద్ వస్తున్నారు.

    దట్టమైన పోగామంచులో స్పీడుగా పోతున్న ట్రైన్... బీబీనగర్ స్టేషన్ దాటగానే రోడ్ క్రాసింగ్ దగ్గర పట్టాలు తప్పింది. చాలా ఘోరమయిన ప్రమాదం. వందకుపైగా మరణించారు.

    మీకు తలమీద దెబ్బ కంపార్ట్మెంట్ లో, ప్రాణాలతో బయటపడ్డా నలుగురిలో మీరున్నారు. అ నలుగురిలో కూడా ఇద్దరు సికింద్రాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. మీరాదృష్టివంతులు" అంది మధురిమ.

    "మరి నన్ను నలుగురు కుర్రాళ్ళేవరో ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారని నర్స్ మేరీ చెప్పింది" అడిగాడు కాశీచరణ్.

    "అవును. ఆ నలుగురికీ మీరు రోడ్డుమీద గాయాల్తో స్పృహాలేని స్థితిలో కనిన్పించారట."

    "రైలు ప్రమాదంలో ఇరుకున్న నేను రోడ్డు మీదకు ఎలా వచ్చాను?" అన్నది ఆమె.

    "అసలు ఆయనెవరో లాయర్ నీలకంఠన్ మాత్రమె విప్పగలరను కొంటున్నాను" అన్నది ఆమె.

    "అసలు ఆయనెవరో నాకు తేలీనప్పుడు నాచిక్కుముడిని అయన ఎలా విప్పగలరు?" చిన్నగా నవ్వుతూ అన్నాడు కాశీచరణ్.

    కాశీచరణ్ నవ్వును చూస్తూనే అతను అందమయిన మనిషేకాదు_ అందంగా నవ్వగలడు కూడా అని అనుకుంది డాక్టర్ మధురిమ మనసులోనే.

    "డాక్టర్! నేనెవరో ఏమిటో నాకు తేలేకపోయినా, మీకు తేలేకపోయినా నన్ను ప్రత్యక్ష్యంగా చూస్తుంన్నందుకు కృతఙ్ఞతలు" అన్నాడు కాశీచరణ్.

    "ఇందులో నేను చేసిందేమిలేదు. నా వృత్తికిన్యాయం చేకూర్చలన్నదే నా సిద్దాంతం. మీరు బాగా కోలుకుంటే అదే చాలు. జరిగినదాని గురించి, జరగబోయేదాని గురించి కానీ ఎక్కువ అలోచించకండి. ఈ టైమ్ లో బ్రెయిన్ కు స్ట్రయిన్ యివ్వడం మంచిదికాదు. హేవ్ ఎ గుడ్ స్లీఫ్" చిన్నగా నవ్వి ముందుకెళ్ళిపోతున్న మధురిమ వైపు కన్నార్పకుండా చూస్తూనే వున్నాడు కాశీచరణ్.

    కాశీచరణ్ మనస్సులో ఇప్పుడు గతం గురించి దిగులులేదు. భవిష్యత్తు గురించి అసలు భయంలేదు.

    మధురిమ చెప్పిన మాటలు అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఆలోచనల్లో పడింది. అతన్ని చూడగ్గానే తన మనస్సులో ఏదో భావ సంఘర్షణ? అది ఏదైనా. ఎలాంటిదైనా మళ్ళీ అలంటి ఆలోచనలకూ తావివ్వకూడదని ఒకస్థిరమైన నిర్ణయానికి వచ్చిందామె.

    రిసెప్షన్ దాటి ముందుకు వెళ్తున్న డాక్టర్ మధురిమ దగ్గరకు పరుగు పరుగున వచ్చింది రిసెప్షనిష్టు.

    "మేడమ్! కాశీచరణ్ అనే పేషెంట్ కోసం ఒక వ్యక్తి రెండుసార్లు ఫోన్ చేశాడు."

    "ఎవరతను?"

    "ఏమో తెలీదు_ రెండుసార్లు కూడా లైన్ కట్ అయింది. బహుశా ఏస్.టి.డి అనుకుంటాను. ఈసారి ఫోన్ చేస్తే ఏం చేయమంటారు?" అడిగిందామె.

    "ఎవరో కనుక్కో. ఏం కావాలో కనుక్కో. కానీ డైరేక్టగా కనెక్ట్ చేయద్దు ఆ వ్యక్తి పేరు  నీలకంఠన్ అని చెప్పాడా?"
    "కాదు మేడమ్! పేరెం చెప్పలేదు. లాయర్  నీలకంఠన్ వాయిస్ నాకు తెలుసు మేడమ్! అయనకాదు_ ఏదో కొత్త గొంతు."

    "ఈసారి ఫోన్ చేస్తే నాకు కనెక్ట్ చెయ్యి" చెప్పి ముందుకు కదిలింది డాక్టర్ మధురిమ.
   
                                                   *    *    *    *   

 Previous Page Next Page