Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 13


    "మొండిచేయ్యితో పాటు మొండికాలు కూడా కనపడితే?"అంది మహానంద.

 

    "రెండింటిని కలిపి తాడుతో బిగించికట్టి సముద్రంలో పారేస్తాను? ధైర్య నవ్వుతూ చెప్పింది.


    
    ధైర్య పరిశోధన ప్రాక్టికల్ గా చేస్తానంటే వద్దన్నారు గాని ఆ విషయాన్నీ పూర్తిగా సిరియస్ గా తీసుకోలేదు శ్రీవిద్య గాని మహానందగాని.

 

    ధైర్య ఈ విషయాన్నీ డీప్ గా తీసుకుంది. చేజేతులారా ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నానని మాత్రం ఉహా మాత్రం కూడా గ్రహించలేక పోయింది. ఒక్కోసారి సరదాగా తీసుకున్న చిన్న విషయాలే పెద్ద ప్రమాదాలకి తీస్తాయి.ముమ్ముందు జరగబోయేది అదే.

 

    "మీ యిద్దరూ చదివింతరువాత పుస్తకం నాకు యివ్వండి." ధైర్య లేస్తూ అంది.

 

    "పరిశోధన పరిశోధనకేన!" మహానంద నవ్వుతూ అడిగింది.

 

    "కాదు చదవడానికి."శ్రీవిద్య అంది.

    ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ పార్క్ల్ లోంచి బయటికి వచ్చాడు. ముగ్గురూ కలిసి సెంటర్ దాకా నడిచి వచ్చి అక్కడ విడిపోయారు.

 

    పావుగంట గడిచిపోయింది.

 

                
                                                         6

 


    ఈ పావుగంట వరదరాజులు తన మానాన తను తలొంచుకుని ఏది పట్టించుకోకుండా ఎవరిని చూడకుండా రష్ గా వున్న బజారులో రోడ్డు వారగా నడుస్తూ ముందుకు సాగుతున్నాడు.


    గౌతమ్ సరిగా పావుగంట వరదరజులుని వెంటాడుతూ వెళ్లి యిహ లాభం లేదని వేగంగా అడుగులేస్తూ వెళ్ళి అతన్ని అందుకున్నాడు నెమ్మదిగా వెనకనుంచి భుజం మీద చేయి వేశాడు.

 

    వరదరాజులు ఉలిక్కిపడి వెనుతిరిగి చూశాడు. కళ్ళ ఎదుట నవ్వుతూ గౌతం.

 

    "అరె నువ్వా?" అన్నాడు వరదరాజులు.

 

    "అరే నేనే ఎక్కడికెళ్ళి వస్తున్నావ్?" గౌతం నవ్వుతూ మామూలుగా అడిగాడు.

 

    "చిన్న పనిమీద వెళ్ళి వస్తున్నాను. నీ వెక్కడ నుంచి ఎలా వున్నావ్ ఏదైనా జాబ్ చేస్తున్నావా! అమ్మా నాన్నా ఎలా వున్నారు?" వరదరాజులు ప్రశ్నల వర్షం కురిపించాడు.

 

    వరదరాజులు సినిమాహాలుకెళ్ళి రావటం కళ్ళారా తను చూశాడు.ఎక్కడికికెళ్ళి వస్తున్నావు అని అడిగితె పచ్చి అబద్దం ఆడుతున్నాడు. ఎప్పుడు లేనిది వరదరాజులు తనతో అబద్దం ఆడటమా!తమ మద్య ఏ విషయంలోనూ పోటిలేదు.మాటా మాటా అనుకున్నది లేదు. ఇరువురికి జేబుల్లో కలిపి సింగిల్ టికీ సరిపోను మాత్రమే చిల్లర డబ్బులు వుంటే సింగిల్ టి తీసుకుని చెరో గుక్క తగేవాళ్ళు అలాంటిది యిప్పుడు?

 

    వరదరాజులు అబద్దం ఆడటమా?

 

    తన దగ్గర వాడికి రహస్యమా?

 

    "దీని అంతు తేల్చుకోవాలి." అనుకుని అప్పటికి ఏమి మాట్లాడలేదు. "పద వెళుతూ మాట్లాడుకుందాం."అన్నాడు గౌతం.

    ఇరువురూ కలిసి పదినిమిషాలలో వరదరాజులు వుండే రూం చేరారు.

 

    వరదరాజులు చిన్న రూంలో అద్దెకి ఉంటున్నాడు. రూంలో కొద్దిపాటి సామాను వుంది. అవైనా అవసరానికి వాడుకునే చిన్న పాటివి. రూంని బట్టి అతనంత సామాన్యంగా జీవిస్తున్నది తెలిసిపోతున్నది.

 

    వరదరాజులు పక్కనే వున్న బంకునుంచి టి తెప్పించాడు. ఇరువురు టి తాగి కబుర్లు మొదలుపెట్టారు.

 

    "అయితే నీవు యింకా ఖాళీగానే వున్నావన్న మాట?" వరదరాజులు అడిగాడు.

 

    "ఓ రిక్షా అద్దెకియ్యవయ్య అంటే ఓ రిక్షాల ఓనరు గారు ఏమన్నారో తెలుసా! మీరు రిక్షా తోక్కుతానని నోరు తెరిచి అడిగారు సరే. మీలాంటి పెద్ద చదువులు చదివిన వాళ్ళకి రిక్షా యివ్వాలంటే నాకు సిగ్గుగా వుందండి. నేను యివ్వను అన్నాడు." గౌతం నవ్వుతూ చెప్పాడు.

 

    "ఏమిటోరా నీ జాతకం చూడబోతే అలావుంది నా రాత చూడబోతే ఇలా అఘోరించింది.నెలంతా కష్టపడితే వచ్చేది రెండొందలు.రూం రెంటు తిండి అన్నింటికి బొటాబొటిగా సరిపోతున్నది.ఎప్పుడయినా పైపని పడితే పదో పరకో యిస్తారు."   

 Previous Page Next Page