"ఒకరి ముందు చేయి చాచాకుండా గడిచిపోతున్నది కదా!"
"ఆ..."
"ముందీ విషయం చెప్పు ఈ వూరు వచ్చి రెండు నెలలు అయింది కదా మా యింటికి రావడానికి తీరిక దొరకలేదా?" నిస్టురంగా అన్నాడు గౌతం.
"క్షణం తిరుబదిలేక!"నసుగుతూ ఆగాడు వరదరాజులు.
"అబద్ధాలు బాగానే నేర్చుకున్నావురా వరదాయ్."
"ఛా...అలాంటిదేమి లేదురా."
"మరెందుకు రాలేదుట?"
"చెప్పాకదా?"
"ఏం చెప్పావ్ అబద్దాలుఆడినా అతికినట్లు వుండాలి. నేను అంతా చుశాలేరా రాజులూ!" గౌతం నవ్వుతూ చురక అంటించాడు.
వరదరాజులు ఉలిక్కిపడ్డాడు.ముఖంలో కంగారు చోటు చేసుకుంది. ఆ విషయం గౌతం కనిపెట్టాడు
.
గౌతమ్ వరదరాజులుని రకరకాల పేర్లతో పిలుస్తుంటాడు. జోకులు పెలుస్తుంటాడు. ఇప్పుడు గౌతం అన్నది తమాషా అయితే వరదరాజులు ఉలిక్కిపడే పనేలేదు.
"అంతా చూడటం అంటే ఏమిటిరా గౌతం?"
"ముందు నీకా కంగారు ఎందుకో చెప్పు?"
"కంగారా! అబ్బే అలాంటిదేమీ లేదే!" మరింత కంగారుగా అన్నాడు వరదరాజులు.
"అబద్దం అడినవాడు ఏదైనా రహశ్యం దాచినవాడు నిజం బయటపడ్డ వాడు కంగారు పడతారు. నీవలా పడుతున్నవురా వరదాయ్!"
వరధరాజులకి ఏం చెప్పాలో తెలియలేదు. తెలియనప్పుడు మౌనం బెటర్.
"నాకంతా తెలుసోయ్ రాజులూ! నా కళ్ళారా నేను చూశాను సరేనా!" మళ్ళి అదేమాట అన్నాడు గౌతమ్.
వరదరాజులువి అసలే చింతపిక్కంత కళ్ళు. ఆచిన్న కళ్ళు గౌతమ్ మాటలకి విపరీతంగా చలించాయి. "నీకేం తెలుసో అది చెప్పు ఆ తరువాత నేను నిజం చెపుతాను." అన్నాడు నెమ్మదిగా.
గౌతమ్ ఏది దాచుకోలేదు. తను సినిమాకి రావటం కౌంటర్ లో అతను "హాలు నిండింది టికెట్లు లేవు అని చెప్పటం తను పాస్ కోసం కుండి పక్కనే ఆగటం అప్పుడు తను చూసింది." వివరంగా చెప్పాడు. అంతటితో ఆగక "సినిమా గంటలోపే అయిపోతుందా!పట్టుమని పాతిక మంది కూడా లేరు హాలు ఎలా నిండింది? హాలులో మీరు చూసింది సినిమానా లేక తోలుబొమ్మలాట?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.
వరదరాజులు ఓ పక్క గౌతమ్ చెప్పేది వింటున్నాడు. మరో పక్క క్విక్ గా ఈ విషయం ఎలా కవర్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు.
6)
"ఇదిరా వరదాయ్! నేను చూసింది. యింక విషయం ఏమిటో చెప్పు!" విషయం వివరించి అడిగాడు గౌతం.
"చెప్పక తప్పదా!"
"తప్పదు."
"వింటే విడిలాంటి వాడా అని నవ్వుతావు."
"నవ్వనని హామీ యిస్తున్నాను సరేనా!"
"నా గురించి చెడ్డగా అనుకోకూడదు."
"అనుకోను విషయం తొందరగా అఘోరించు."
"నేను...నేను...దుర్గామందిర్ హాలులో చూసిన ఫిలిం...
"వద్దురా వరదాయ్ వద్దు నీకంతా కష్టంగా వుంటే చెప్పొద్దు."
"నిజంగా నేను చూసింది."
"ఫైలిమేనంటావ్ అంతేనా!" గౌతమ్ రెట్టించి అడిగాడు.
"అంతే." వరదరాజులు తగ్గు స్వరంతో అన్నాడు.
"మరి అలా జవకరుతూ చెప్పడం దేనికి? అరగంట ఫిలిం ఏమిటిట!న్యూస్ రీలా?" వ్యంగ్యంగా అడిగాడు గౌతం.
"ఆ ఫిలిం నలభై నిముషాలు మాత్రమే వుంటుంది."
"తమిళం పిక్చరు నలభై నిమిషాలే వుంటుందా?"
"అది తమిళం పిక్చరు కాదు."
గౌతమ్ తెల్లబోయాడు. "తమిళ పిక్చరు కాదా?" అన్నాడు వరదరాజులు ముఖంలోకి నిదానంగా చూస్తూ.